మొత్తని వాడిని చూస్తే మొత్త బుద్ది అని వెనకటికి సామెత. సినిమా ఇండస్ట్రీలో పెద్ద హీరోతో సినిమా తీస్తుంటే, ఒక యాడ్ స్టిల్ విడుదల చేయాలన్నా, సినిమాకు ఏ స్టిల్స్ విడుదల చేయాలి, పబ్లిసిటీ కంటెంట్ ఏం తయారు చేసారు ఇలా ప్రతి చోటా హీరో ముందస్తు అనుమతి వుంటుంది. హీరో ఎస్ అంటే ఎస్, నో అంటే నో. హీరోలు గీచిన గీత దాటడానికి లేదు.
కానీ అదే చిన్న హీరో అనేసరికి లెక్కలు మారిపోతాయి. హీరో నాగశౌర్యతో వరుడు కావలెను అనే సినిమా రెడీ అవుతోంది. విడుదలకు రెడీ అవుతోంది. ఇప్పటి వరకు విడుదల చేసిన టీజర్, సాంగ్స్ ఇలా అన్నింటిలో హీరోయిన్ కే తప్ప హీరోకి ప్రాధాన్యత ఇవ్వడం లేదన్న కామెంట్లు వినిపిస్తున్నాయి.
నిర్మాత చినబాబు స్వయంగా చూసుకుంటూ, ఆయనే అన్నీ పర్యవేక్షించుకుంటూ తయారుచేస్తున్న సినిమా ఇది. ఇప్పటివరకు నాలుగు పాటలు వదిలారు లేటెస్ట్ గా వదిలిన పాటతో సహా అన్ని పాటల్లోనూ హీరోయిన్ కు ఇస్తున్న ప్రాధాన్యత క్లారిటీగా తెలుస్తోంది. హీరోను కావాలని పక్కన పెట్టారని అర్థం అయిపోతోంది.
ఇదే మరే పెద్ద హీరో అయినా రెండు క్షణాల్లో నిర్మాత ను తన దగ్గర కు రప్పించుకుని క్లాస్ పీకేస్తాడు. నాగశౌర్య కాబట్టి మౌనంగా భరించడం తప్ప చేసేదేమీ వుండదు. గమత్తేమిటంటే ఇక్కడ దర్శకురాలు లక్ష్మీ సౌజన్య పాత్ర కూడా అంతంత మాత్రమే అని వినిపిస్తోంది.
తనేమీ చేయలేనని తన చేతిలో ఏమీ లేదని ఆమె బాధపడుతున్నట్లు తెలుస్తోంది. లేటెస్ట్ గా వదిలిన పాటలో డైరక్టర్ ఎక్కడున్నారా అని వెదుక్కోవాల్సి వుంది.
జరుగుతున్న వ్యవహారాల పట్ల హీరో నాగశౌర్య చాలా అసంతృప్తితో వున్నట్లు తెలుస్తోంది. ఇదే బ్యానర్ లో డిజె టుల్లూ అనే సినిమా తయారవుతోంది. దాని పబ్లిసిటీ మెటీరియల్ అంతా హీరో చుట్టూ తిరుగుతోంది. అదీ సంగతి.