ఇటు బాయ్ కాట్ ట్రెండ్.. అటు సీక్వెల్

లైలా సినిమాపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. “బాయ్ కాట్ లైలా” అనే హ్యాష్ ట్యాగ్ ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది.

లైలా సినిమాపై సోషల్ మీడియాలో ఓ రేంజ్ లో ట్రోలింగ్ నడుస్తోంది. “బాయ్ కాట్ లైలా” అనే హ్యాష్ ట్యాగ్ ఇంకా ట్రెండింగ్ లోనే ఉంది. ఓవైపు ఇలా బాయ్ కాట్ లైలా అంటూ ఓ సెక్షన్ విరుచుకుపడుతుంటే, మరోవైపు విశ్వక్ సేన్ మాత్రం తన సినిమా ప్రచారాన్ని కొనసాగిస్తున్నాడు. ఏకంగా సినిమాకు సీక్వెల్ హింట్ ఇచ్చాడు.

లైలా సినిమాలో వేసిన లేడీ గెటప్ విశ్వక్ సేన్ కు బాగా నచ్చిందట. ఆ గెటప్ తోనే ప్రచారం చేయాలనుకున్నానని కానీ కుదరలేదని అన్నాడు. మళ్లీ అవకాశం వస్తే లైలాగా మారడానికి తనకు ఎలాంటి అభ్యంతరం వ్యక్తం లేదన్నాడు. ఈ సందర్భంగా సీక్వెల్ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

సినిమా సీక్వెల్ కు పనికొచ్చే మంచి క్లిప్ ఉందంట. కాకపోతే ఆ క్లిప్ ను యాడ్ చేయలేదంట. సినిమాకు మంచి రెస్పాన్స్ వస్తే, సెకెండ్ వీక్ లో ఆ సన్నివేశాన్ని యాడ్ చేస్తారట. అలా సీక్వెల్ కూడా ప్రకటించే ఆలోచన ఉన్నట్టు బయటపడ్డాడు విశ్వక్ సేన్.

ఇక సోషల్ మీడియాలో నడుస్తున్న బాయ్ కాట్ ట్రెండ్ పై స్పందిస్తూ.. ప్రెస్ మీట్ పెట్టి మరీ తను చెప్పాల్సిన విషయం చెప్పేశానని, బహిరంగంగా క్షమాపణలు కూడా చెప్పానని, ప్రతిసారి తగ్గడం కరెక్ట్ కాదని అన్నాడు. ఆ వివాదాన్ని అంతకుమించి హైలెట్ చేయడం కూడా తనకు ఇష్టం లేదన్నాడు.

లైలా సినిమా ప్రమోషన్ లో భాగంగా నటుడు పృధ్వీ, వైసీపీని ఉద్దేశించి వివాదాస్పద వ్యాఖ్యలు చేశాడు. దీంతో ఏపీలో వైసీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. విశ్వక్ క్షమాపణలు చెప్పినప్పటికీ, సినిమాను బాయ్ కాట్ చేస్తామంటున్నారు చాలామంది.

6 Replies to “ఇటు బాయ్ కాట్ ట్రెండ్.. అటు సీక్వెల్”

Comments are closed.