ర‌సికుడు.. బాబోయ్ మెగా ఫ్యామిలీ ట్రోలింగ్‌!

ఒక సినిమా వేడుక‌లో త‌న తాత ర‌సికుడ‌ని చిరంజీవి చెప్పిన కామెంట్స్‌… మెగా ఫ్యామిలీ ట్రోలింగ్‌కు దారి తీసింది.

ఒక సినిమా వేడుక‌లో త‌న తాత ర‌సికుడ‌ని చిరంజీవి చెప్పిన కామెంట్స్‌… మెగా ఫ్యామిలీ ట్రోలింగ్‌కు దారి తీసింది. చిరంజీవి మాతృమూర్తి అంజ‌లీదేవి తండ్రిని చూపి, ఆయ‌న గురించి రెండు మాట‌లు చెప్పాల‌ని యాంక‌ర్ సుమ కోరారు. దీంతో చిరంజీవి మాట్లాడుతూ….

“తాత పేరు రాధాకృష్ణ‌మ‌నాయుడు. ఆయ‌న నెల్లూరు వాసి. కానీ మొగ‌ల్తూరులో స్థిర‌ప‌డ్డారు. స్టేట్ ఎక్సైజ్ ఇన్‌స్పెక్ట‌ర్‌గా రిటైర్డ్ అయ్యారు. నీకు ఎవ‌రి బుద్ధులైనా రావ‌చ్చు కానీ, ఆయ‌నవి రాకూడ‌ద‌ని నాతో చెప్పేవాళ్లు. ఎందుకంటే ఆయ‌న ర‌సికుడు. నాకు ఇద్ద‌రు అమ్మ‌మ్మ‌లు. వీళ్లిద్ద‌రూ అలిగితే మూడో వ్య‌క్తి మ‌రొక‌రు వుండేవాళ్లు. నాకు తెలిసి ముగ్గురు. న‌లుగురైదుగురు ఉన్నారేమో మ‌న‌కు తెల‌య‌దు” అని న‌వ్వుతూ చిరంజీవి చెప్పారు.

చిరంజీవి కామెంట్స్‌ను తీసుకుని, సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ఓ రేంజ్‌లో సెటైర్స్ విసురుతున్నారు. తాత బుద్ధులు మెగా ఫ్యామిలీలో ఎవ‌రెవ‌రికి వ‌చ్చాయో నెటిజ‌న్లు పేర్ల‌తో స‌హా ట్రోల్ చేయ‌డం గ‌మ‌నార్హం. చిరంజీవి త‌న తాత ర‌సికుడ‌ని చెప్పే ముందు, కాస్త ఆలోచించి వుంటే బాగుండేద‌ని జ‌న‌సేన శ్రేణులు అంటున్నాయి.

చిరంజీవి అమాయ‌కంగా అన్న మాట‌ల‌తో ప‌వ‌న్‌క‌ల్యాణ్‌, ఇత‌ర కుటుంబ స‌భ్యులంతా అన‌వ‌స‌రంగా ట్రోలింగ్‌కు గురి అవుతార‌నే ఆవేద‌న వాళ్ల‌లో క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే తాత వార‌స‌త్వాన్ని ప‌వ‌న్ కొన‌సాగిస్తున్నార‌ని పెద్ద ఎత్తున పోస్టులు సోష‌ల్ మీడియాలో ప్ర‌త్య‌క్ష‌మ‌య్యాయి. చిరంజీవి అమాయ‌క‌త్వం త‌మ నాయ‌కుడిని ఇర‌కాటంలోకి నెట్టాయ‌ని జ‌న‌సేన శ్రేణులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నాయి.

10 Replies to “ర‌సికుడు.. బాబోయ్ మెగా ఫ్యామిలీ ట్రోలింగ్‌!”

  1. పబ్లిక్ లో మాట్లాడటం చేతకాకపోతే , నోరు మూసుకొని వుండాలి. తగుదునమ్మా అని ఈ ముసలి వయసు లో ప్రతీ ఫంక్షన్ కి వెళ్లి వాగితే ఇలానే వుంటుంది

Comments are closed.