జగన్ పై బురదకు ‘డబుల్ ఇంజిన్’ తోడ్పాటు!

సీఎం ర‌మేశ్‌ ప్రసంగంలో అవాస్తవాల్ని ప్రశ్నించడానికి మిథున్ రెడ్డి ప్రయత్నిస్తే మాత్రం.. రాష్ట్ర రాజకీయాలు గుర్తొచ్చాయా.. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇదేనా?

‘డబుల్ ఇంజిన్ సర్కారు- కేంద్రం సహకారం రాష్ట్రానికి పుష్కలంగా ఉంటుంది..’ అని వారు చెప్పుకున్నప్పుడు మనం సహజంగా ఏం అనుకుంటాం..? అభివృద్ధి పనుల విషయంలో కేంద్రం నుంచి నిధులు తీసుకురావడానికి ఇదంతా ఉపయోగపడుతుందేమో అనుకుంటాం. అడ్డదారుల్లో అయినా సరే.. కొన్ని పథకాలకు, పనులకు వారు చేయూత అందిస్తారని ఆశిస్తాం. కానీ.. ప్రస్తుత పరిస్థితులను గమనిస్తోంటే.. జగన్ మీద బురద చల్లడానికి కూడా డబుల్ ఇంజిన్ సర్కార్ ఊతం అందిస్తుంటుందేమో అనిపిస్తోంది. లోక్ సభలో జీరో అవర్ లో వచ్చిన ప్రస్తావనలు, స్పీకరు వ్యవహార సరళి ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి.

ఏం జరిగిందంటే.. లోక్ సభ జీరో అవర్లో భారతీయ జనతా పార్టీ ఎంపీ సీఎం రమేష్ ఏపీలో జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన లిక్కర్ విధానం గురించి తనకు తోచినదెల్లా మాట్లాడారు. లోక్ సభలో అత్యవసర ప్రజాప్రాధాన్యమున్న అంశం పై జరిగిన చర్చలో ఆయన జగన్ పాలన కాలంలోని లిక్కర్ విధానం గురించి ప్రస్తావించారు. జగన్ ప్రభుత్వం ఏకంగా 30 వేల కోట్ల రూపాయల కుంభకోణానికి పాల్పడిందని ఆయన బుదర చల్లే ప్రయత్నం చేశారు. ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కారు పాల్పడిన 2500 కోట్ల లిక్కర్ కుంభకోణానికి ఇది పది రెట్లు ఎక్కువ అని కూడా ఆరోపించారు.

ఒకవైపు ఆయన రాజకీయ గాడ్ ఫాదర్ చంద్రబాబునాయుడు కూడా విజిలెన్సుతో విచారణ చేయించి మరీ.. జరిగినది మూడువేల కోట్ల కుంభకోణం అంటుండగా.. సీఎం రమేష్ ఒక ‘సున్న’ను అదనంగా చేర్చి ముప్పై వేల కోట్ల రూపాయల కుంభకోణంగా రంగుపులమడానికి లోక్ సభ సాక్షిగా ప్రయత్నించారు.

తమాషా ఏంటంటే.. వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఈ బుురద చల్లుడు కార్యక్రమాన్ని అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే స్పీకరు అందుకు అనుమతించకపోవడం విశేషం. ఆ సమయానికి స్పీకరు స్థానంలో ప్యానల్ స్పీకరు జగదంబికా పాల్ ఉన్నారు. ఆయన మిధున్ రెడ్డిని వారించి.. పార్లమెంటు అనేది రాష్ట్ర రాజకీయాలకు ఉద్దేశించిన వేదిక కాదని పేర్కొన్నారు.

కేంద్రంలోని భారతీయ జనతా పార్టీ – రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డిమీద బురద చల్లుడే తమ మనుగడకు జీవనాడిగా బతుకుతున్న తెలుగుదేశం పార్టీ ప్రభుత్వానికి ఈ రకంగా కూడా సహకారం అందిస్తున్నదా అనే అనుమానం ప్రజలకు కలుగుతోంది. జగన్ పాలన, పార్టీ మీద సీఎం రమేష్ బురద చల్లినంత సేపు దానిని స్పీకరు అనుమతిస్తారా? ఆ నిందలన్నీ కూడా రాష్ట్ర రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాలు అనే సంగతి ఆయనకు గుర్తు రాలేదా?

సీఎం ర‌మేశ్‌ ప్రసంగంలో అవాస్తవాల్ని ప్రశ్నించడానికి మిథున్ రెడ్డి ప్రయత్నిస్తే మాత్రం.. రాష్ట్ర రాజకీయాలు గుర్తొచ్చాయా.. డబుల్ ఇంజిన్ సర్కార్ అంటే ఇదేనా? అని జనం నవ్వుకుంటున్నారు.

14 Replies to “జగన్ పై బురదకు ‘డబుల్ ఇంజిన్’ తోడ్పాటు!”

  1. బురదలో పొర్లే పంది పైన మళ్ళీ బురద వేయాల్సిన అవసరం ఏముంది..

    ఆ పంది ఆల్రెడీ బురద లో ఉందని నిరూపించే ప్రయత్నమే ఇది..

  2. అదేందిరా గూట్లే….మొన్న ఢిల్లీ లో బీజేపీ గెలవగానే …నెక్స్ట్ టార్గెట్ టీడీపీ , ఇక టీడీపీ కష్టమే అని రాసావ్. ఇప్పుడేమో డబల్ ఇంజిన్ సర్కార్ అంటావ్….రెండు రోజుల్లో నాలుక అడ్డంగా మడతెడతావ్

  3. జగన్ తో పోల్చి పంది ని తక్కువ చేయకండి బ్రో…

    పంది జాతి కనీసం మనం వేసింది తిని శుభ్రం చేసి పర్యావరణానికి మేలు చేస్తుంది…

    జగన్ అందుకు కూడా పనికి రాడు గాక రాడు…

    సో జగ్గమ్మ పంది కన్నా చాలా హీనం

    1. Abba chaa…meeru chesthunna appulu evvadu jobulloki velthunnai ippudu.. contractors jebulloke ka…kaneesam jagan janala jobulanna nimpadu…GST -10 lo undhi AP di…endhukantav

    2. రే.. పకోడీ!

      రాజ్యాంగబద్ధ సంస్థ కాగ్ చంద్రబాబు హయాంలో స్కిల్ డెవలప్మెంట్

      ప్రాజెక్టులో అవినీతి జరిగిందని నిర్ధారించింది. ఆ ప్రాజెక్టులో రూ.355 కోట్ల మేర

      ఖజానాకు గండి పడిందని నిగ్గు తేల్చింది. వాస్తవ లెక్కల ప్రకారం ప్రాజెక్ట్ విలువను

      రూ.370 కోట్లుగా చూపించి ఉంటే ప్రభుత్వం తన వాటాగా రూ.33 కోట్లు మాత్రమే

      విడుదల చేయాలి.

      అయితే అంచనాలను అమాంతం పెంచేసి రూ.3,300 కోట్లుగా చూపించి ప్రభుత్వ

      వాటా 10 శాతంతోపాటు జీఎస్టీ, ఇతర అంశాలను కలిపి ఏకంగా రూ.371 కోట్లు

      విడుదల చేశారు. రూ.333 కోట్లు కొల్లగొట్టారు. ప్రాజెక్టు మొదలు కాకుండానే నిధులు

      విడుదల చేయడంతో ప్రభుత్వం రూ.22 కోట్లు వడ్డీ రూపంలో రావాల్సిన

      ఆదాయాన్ని కోల్పోయింది. వెరసి ప్రభుత్వ ఖజానాకు రూ.355 కోట్ల నష్టం.

      అలా… అడ్డంగా దొరికిపోయి… 55 రోజులు రాజమండ్రిలో డ్రాయరు మీద కూర్చోబెట్టారు!

      బొల్లి రోగము.. Mvdd! కి కూడా పాకింది అని 4 డాక్టర్ సర్టిఫికెట్లు తెచ్చుకుని హైదరాబాద్ AIG ఆసుపత్రికి పారిపోయాడు!

      మరి ఈ డబ్బంతా… ఏమైనా బొల్లి గాడి అ మ్మ లం జ మొ గు డ వా B0 G@ మ్ L@ NZ K0 D@ K@!?

  4. దాన్ని బురద చల్లటం అనరు..

    నిజాలు నిర్భయంగా గా బయటకి చెప్పటం అంటారు..

    ఇక వైసిపి ఎంపీ కి మైక్ ఇవ్వలేదు అంటే గత ఐదేళ్లు మైక్ ఇస్తే చేసింది అన్నియ్య బజనే కదా..అందుకే ఇవ్వలేదు అని జనం నవ్వుకుంటున్నారు

Comments are closed.