Advertisement

Advertisement


Home > Movies - Press Releases

'లక్ష్య' దాదాపు పూర్తి

'లక్ష్య' దాదాపు పూర్తి

నాగశౌర్య హీరోగా తయారవుతున్న సినిమా లక్ష్య.  సంతోష్‌ జాగర్లపూడి దర్శకుడు.  కేతిక శ‌ర్మ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ చిత్రంలో ఒక కీల‌క పాత్ర‌లో విలక్షణ న‌టుడు జ‌గ‌ప‌తి బాబు న‌టిస్తున్నారు.  విలువిద్య నేప‌థ్యంలో స్పోర్ట్స్ బేస్డ్ ఫిలింగా అన్ని క‌మ‌ర్షియ‌ల్ హంగుల‌తో ఈ మూవీ తెర‌కెక్కుతోంది.   

సంక్రాంతి శుభాకాంక్ష‌ల‌తో స‌రికొత్త పోస్ట‌ర్ ని రిలీజ్ చేసింది చిత్ర యూనిట్‌. ఇప్ప‌టి వ‌ర‌కు ప‌వ‌ర్‌ఫుల్ మాస్ స్టిల్స్‌ని రిలీజ్ చేసిన మేక‌ర్స్ ఈ సారి నాగ‌శౌర్య‌, కేతిక‌శ‌ర్మ‌ల‌తో కూడిన రొమాంటిక్ పొస్ట‌ర్ విడుద‌ల చేశారు. 

లక్ష్య సినిమా దాదాపు పూర్తి కావచ్చింది. ఫైనల్ షెడ్యూలు ప్రారంభమైంది. త్వరలో ఈ షెడ్యూలు పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ కు చేరుకుంటుంది. క్లయిమాక్స్ సీన్లను భారీగా ఓ స్టేడియంలో ప్లాన్ చేసారు.

యంగ్ హీరో నాగశౌర్య, కేతిక‌శ‌ర్మ, జగపతి బాబు ప్రధాన పాత్రల్లో న‌టిస్తోన్న ఈ చిత్రానికి సినిమాటోగ్రాఫర్‌: రామ్‌రెడ్డి, సంగీతం:  కాల‌బైర‌వ‌, ఎడిట‌ర్‌:  జునైద్‌, నిర్మాత‌లు: నారయణదాస్ కె. నారంగ్‌, పుస్కూర్ రామ్‌మోహన్‌రావు, శరత్‌ మరార్, కథ, స్క్రీన్‌ ప్లే, దర్శకత్వం: సంతోష్‌ జాగర్లపూడి.

మంచి కిక్‌ ఇచ్చారు

న‌వ్విపోదురు గాక‌..మాకేటి సిగ్గు

అందరూ ఒక వైపు.. ఆ ఒక్కడూ మరో వైపు

రాజకీయ జూదంలో ఓడితే బతుకేంటి?