Advertisement

Advertisement


Home > Movies - Press Releases

’పుడింగి నెంబర్‌ 1’,,, సంపూర్ణేష్‌బాబు..

’పుడింగి నెంబర్‌ 1’,,, సంపూర్ణేష్‌బాబు..

బర్నింగ్‌స్టార్‌ సంపూర్ణేష్‌బాబు హీరోగా నటిస్తున్నతాజా చిత్రానికి ‘పుడింగి నెంబర్‌ 1’ అని టైటిల్  కన్ఫర్మ్‌ చేశారు. ఈ సినిమాతో మీరావలి దర్శకుడిగా పరిచయం అవుతుండ‌గా విద్యుత్‌లేఖరామన్, సాఫీ కౌర్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా ముహూర్త‌పు స‌న్నివేశాని‌కి నిర్మాత కేఎస్‌ రామారావు క్లాప్ కొట్ట‌గా, దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కెమెరా స్విఛాన్ చేశారు.

ఈ సందర్భంగా సినిమా దర్శకుడు మీరావలి మాట్లాడుతూ –‘‘  ఏం టైటిల్‌ పెట్టాలా? అనుకున్నాం. ఫైనల్‌గా ‘పుడింగి నెం 1’  అనే టైటిల్ కన్‌ఫ‌ర్మ్ చేశాం. పుడింగి నెంబర్ 1 గా నేను సంపూర్ణేష్‌బాబును ఫీలయ్యాను. సంపూ–బుజ్జమ్మ (విద్యత్‌లేఖరామ్మన్‌) కాంబినేషన్‌ అదిరిపోతుంది. మరొక హీరోయిన్‌గా సాఫీకౌర్‌ను అనుకున్నాం అన్నారు.

చిత్ర నిర్మాతలు  కె. శ్రీ‌నివాస రావు, కె. సుధీర్ కుమార్ మాట్లాడుతూ -`` పుడింగి టైటిల్‌లోనే ఫన్నీనెస్‌ ఉంది. కథ విన్నప్పుడు చాలా హ్యాపీ ఫీలయ్యాం. డైరెక్టర్‌ మంచి నటీనటులను ఎంచుకున్నారు. మా సినిమాలో నటించడానికి ఒప్పుకున్న పోసాని, అజయ్‌ఘోష్‌లకు ధన్యవాదాలు. జూలైలో సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాము.`` అన్నారు. 

హీరోయిన్‌ విద్యుత్‌లేఖ రామన్‌ మాట్లాడుతూ – ‘‘ చాలా హ్యాపీగా ఉంది. ఇది ఓ మంచి ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌. ఒక తమిళ అమ్మాయిని అయినప్పటికీని నన్ను అదరిస్తున్న తెలుగు ప్రేక్షకులకు ధన్యవాదాలు. `` అన్నారు. 

సంపూర్ణేష్‌బాబు మాట్లాడుతూ –‘‘ డైరెక్టర్ మీరాలో మంచి కసి ఉంది. నాలాంటి ఒక చిన్న నటుడిని ఆశీర్వదించడానికి వచ్చిన నిర్మాత కేఎస్‌రామారావుకి, దర్శకులు భీమనేని శ్రీనివాస రావుకి ధన్యవాదాలు’’ అన్నారు.

ఇద్దరూ ఏడ్చేసారు

నేను సింగిల్ గా ఉండిపోతా