అగ్ర కథానాయిక అనుష్క టైటిల్ రోల్‌లో గుణా టీమ్ వర్క్స్ పతాకంపై శ్రీమతి రాగిణీి గుణ సమర్పణలో డైనమిక్ డైరెక్టర్ దర్శక నిర్మాతగా రూపొందుతున్న భారతదేశపు తొలి హిస్టారికల్ స్టీరియోస్కోపిక్ 3డి చిత్రం ‘రుద్రమదేవి’. ఈ చిత్రంలో స్టైలిష్‌స్టార్ అల్లు అర్జున్ పోషిస్తున్న గోన గన్నారెడ్డి పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఈరోజు గోనగన్నారెడ్డిగా అల్లు అర్జున్ ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశారు.
ఈ సందర్భంగా దర్శకనిర్మాత గుణశేఖర్ మాట్లాడుతూ – ‘‘నలభైరోజులపాటు అల్లు అర్జున్‌పై చిత్రీకరించిన కీలకమైన సన్నివేశాలు, పీటర్ హెయిన్స్ ఆధ్వర్యంలో యాక్షన్ సీక్వెన్స్‌లు చిత్రీకరించడం జరిగింది. గోనగన్నారెడ్డి అల్లు అర్జున్‌పై చిత్రీకరించిన ఈ ముఖ్య సన్నివేశాలు సినిమాకి పెద్ద ఎస్సెట్‌గా నిలవనున్నాయి. యూత్‌ని, మాస్‌ని ఆకర్షించే గోన గన్నారెడ్డి పాత్రను అల్లు అర్జున్ చాలా అద్భుతంగా చేశారు. ప్రస్తుతం ‘రుద్రమదేవి’ చిత్రానికి సంబంధించిన పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ శరవేగంగా జరుగుతోంది’’ అన్నారు.