నిజమైన వారసురాలిగా ఫోకస్.. ఏపీ జనం యాక్సెప్ట్ చేస్తారా?

వైఎస్ రాజశేఖర రెడ్డి నిజమైన వారసురాలిగా ఆయన కూతురు షర్మిలను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బాగా ఫోకస్ చేస్తున్నారు. వైఎస్ఆర్ నిజమైన వారసురాలు షర్మిలనే అంటున్నారు. ఏపీలో షర్మిల నిర్వహించిన వైయ‌స్ఆర్ జయంతి సభకు…

వైఎస్ రాజశేఖర రెడ్డి నిజమైన వారసురాలిగా ఆయన కూతురు షర్మిలను తెలంగాణ కాంగ్రెస్ నాయకులు బాగా ఫోకస్ చేస్తున్నారు. వైఎస్ఆర్ నిజమైన వారసురాలు షర్మిలనే అంటున్నారు. ఏపీలో షర్మిల నిర్వహించిన వైయ‌స్ఆర్ జయంతి సభకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు దాదాపు మంత్రులంతా తరలివెళ్లారు. 

అక్కడ షర్మిలను ఏపీకి కాబోయే ముఖ్యమంత్రిగా అభివర్ణించాడు. వచ్చే ఎన్నికల్లో ఆమె ముఖ్యమంత్రి అవుతుందన్నట్లుగా మాట్లాడాడు. రేవంత్ రెడ్డిని చంద్రబాబు శిష్యుడిగా చాలామంది చెబుతుంటారు. కానీ ఆయన మాత్రం తాను వైఎస్ ను చూసి రాజకీయాలు నేర్చుకున్నానని అన్నాడు. 

ఒరిజినల్ కాంగ్రెస్ నాయకుల కంటే ఎక్కువ భక్తి ప్రదర్శించాడు. జగన్ అసెంబ్లీకి పోడని, ఆయన కడప నుంచి ఎంపీగా పోటీ చేస్తాడని, అక్కడ అవినాష్ రెడ్డి చేత రాజీనామా చేయిస్తాడని, పులివెందులలో తల్లి విజయమ్మనుగానీ, భార్య భారతిని గానీ పోటీ చేయిస్తాడని కొన్నాళ్లుగా సోషల్ మీడియాలో భారీగా ప్రచారం సాగుతోంది. 

టీడీపీ అనుకూల మీడియాలోనూ ఈ వార్త వచ్చింది. అందుకే రేవంత్ రెడ్డి కూడా కడపలో ఉప ఎన్నిక జరిగితే తాను ఊరూరు తిరిగి షర్మిల గెలుపు కోసం ప్రచారం చేస్తానని చెప్పాడు. వచ్చే 2029 ఎన్నికల్లో ఏపీ సీఎం షర్మిలనే అన్నాడు. వైఎస్ వారసురాలు ఆమేనన్నాడు. 

తెలంగాణలో రాజకీయాలు చేసి ఫెయిలైన షర్మిల ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఏపీకి షిఫ్ట్ అయ్యింది. అక్కడ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలైంది. దీని వెనుక కూడా రేవంత్ రెడ్డి వ్యూహం ఉంది. కానీ మొన్నటి ఎన్నికల్లోనూ ఏపీలో కాంగ్రెస్ కథ ఎప్పటి మాదిరిగానే ఉంది. అంటే వైఎస్ కూతురిని రంగంలోకి దించినా ఫలితం కనబడలేదు.

వ్యక్తిగతంగా ఎన్నికల్లో షర్మిల కూడా ఫెయిలైంది. అంటే ఆమెను ఇటు తెలంగాణ ప్రజలు యాక్సెప్ట్ చేయలేదు. అటు ఆంధ్ర జనాలు కూడా యాక్సెప్ట్ చేయలేదు. ఎన్నికల్లో ఫెయిలైతే అధ్యక్షులను మార్చడం కాంగ్రెస్ పార్టీలో మామూలే. కాబట్టి వచ్చే ఎన్నికల నాటికి కాంగ్రెస్ చీఫ్ గా షర్మిల ఉంటుందనే నమ్మకం లేదు. 

కాబట్టి ఒకవేళ ఆమె ఎన్నికల్లో గెలిచినా సీఎం అవుతుందని చెప్పలేం. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చాడనే పేరు రేవంత్ రెడ్డికి వచ్చింది కాబట్టి పార్టీ అధిష్టానం ఆయన్ని ముఖ్యమంత్రిని చేసింది. వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ లో ఒరిజినల్ లీడర్స్ మోస్ట్ సీనియర్స్ చాలామంది ఉన్నారు.

ఏపీలోనూ షర్మిల కాంగ్రెస్ పార్టీలో జూనియరే కదా. ఆమె సీఎం కావాలంటే వచ్చే ఎన్నికల్లోనైనా పార్టీని అధికారంలోకి తీసుకురాగలగాలి. అంతటి శక్తి సామర్ధ్యాలు ఆమెకు ఉన్నాయా?