బాబు స‌ర్కార్‌కు ఎప్ప‌టికైనా మ‌చ్చే!

వైద్య క‌ళాశాల‌ల ఏర్పాటులో చంద్ర‌బాబు స‌ర్కార్ అవ‌లంబించిన తీరు ఎప్ప‌టికైనా మ‌చ్చ‌గానే మిగులుతుంది. జ‌గ‌న్ స‌ర్కార్ 17 క‌ళాశాల‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని భావించి, అందులో ఐదింటిని ప్రారంభించింది కూడా. గ‌త ఏడాది ఒక్కో క‌ళాశాల‌లో…

వైద్య క‌ళాశాల‌ల ఏర్పాటులో చంద్ర‌బాబు స‌ర్కార్ అవ‌లంబించిన తీరు ఎప్ప‌టికైనా మ‌చ్చ‌గానే మిగులుతుంది. జ‌గ‌న్ స‌ర్కార్ 17 క‌ళాశాల‌ల‌ను ఏర్పాటు చేయాల‌ని భావించి, అందులో ఐదింటిని ప్రారంభించింది కూడా. గ‌త ఏడాది ఒక్కో క‌ళాశాల‌లో 150 సీట్లు చొప్పున మొత్తం 750 సీట్లతో అడ్మిష‌న్లు పూర్తి చేసింది. దీంతో వైద్య విద్యార్థుల‌కు అవ‌కాశాలు మెరుగుప‌డ్డాయి.

ఆ త‌ర్వాత వ‌చ్చిన కూట‌మి ప్ర‌భుత్వం ఇంకా గొప్ప‌గా చేస్తుంద‌ని వైద్య విద్య‌ను అభ్య‌సించాల‌ని ఆశిస్తున్న విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు అనుకున్నారు. ఎన్డీఏ కూట‌మిలో చంద్ర‌బాబు భాగ‌స్వామి కావ‌డంతో ఎన్నో సాధిస్తార‌నే న‌మ్మ‌కం. కానీ విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు ఆశ‌ల‌న్నీ అడియాస‌ల‌య్యాయి. అర‌కొర‌గా వ‌చ్చిన సీట్ల‌ను కూడా వ‌ద్ద‌ని నేష‌న‌ల్ మెడిక‌ల్ కౌన్సిల్‌కు రాష్ట్ర ప్ర‌భుత్వం లేఖ రాయ‌డం ఆశ్చ‌ర్య‌ప‌రిచింది.

కొత్త కాలేజీల‌ను ప్రారంభించి, గ‌తంలో మాదిరిగా ఒక్కో కాలేజీకి 150 సీట్లు సాధించి వుంటే చంద్ర‌బాబు స‌ర్కార్‌కు ఎంతో మంచి పేరు వ‌చ్చి వుండేది. కానీ విద్యార్థుల కంటే ప్ర‌భుత్వానికి ఇత‌ర‌త్రా ప్రాధాన్యాలున్నాయి. అందుకే మెడిసిన్ సీట్ల విష‌య‌మై ఏ మాత్రం జాగ్ర‌త్త‌లు తీసుకోలేదు. పాడేరులో మాత్రం 50 సీట్ల‌తో అడ్మిష‌న్లు ప్రారంభించారు. పులివెందుల మెడికల్ కాలేజీకి 50 సీట్లు ఇస్తే, వ‌ద్ద‌ని లేఖ రాయ‌డం తీవ్ర విమ‌ర్శ‌ల‌పాలైంది.

ఈ ఏడాది ప్రారంభించాల‌ని అనుకున్న పాడేరు, ఆదోని, మార్కాపురం కాలేజీల గురించి ప్ర‌భుత్వానికి ప‌ట్టింపే లేకుండా పోయింది. ఈ నేప‌థ్యంలో విద్యార్థి సంఘాలు ఊరూరా రోడ్డెక్కాయి. వైద్య క‌ళాశాల‌ల‌ను ప్రైవేట్‌ప‌రం చేసే కుట్ర‌లో భాగంగానే, అడ్మిష‌న్ల‌ను కూడా వ‌ద్ద‌నుకుంద‌నే అనుమానం ప్ర‌జ‌ల్లో బ‌ల‌ప‌డింది. ఈ అనుమాన‌మే బాబు స‌ర్కార్‌పై వ్య‌తిరేక‌త‌కు దారి తీసింది.

7 Replies to “బాబు స‌ర్కార్‌కు ఎప్ప‌టికైనా మ‌చ్చే!”

  1. అసలు కాలెజి నిర్మణం పూర్తి కాకుండా, వసతులు లెకుండా బొదన ఎలా సాద్యం రా అయ్యా!

    .

    రెండు రొజుల క్రితమె ఈ వార్థ భయటకి వచ్చినిద్. కొన్ని jr కాలెజీ లాలొ అసలు లాబ్స్ లెవు. మరి ఎలా చెపుతున్నరొ, ఎలా పాస్ చెస్తున్నారొ వారికె తెలియాలి.

  2. ఫీజు ఫ్రీ పేరుతో అసలు ఫ్యాకల్టీ లేని కాలేజీల్లో ఇంజనీరింగ్ డిగ్రీ అనే పేరుతో ఇంజనీరింగ్ డిగ్రీ వాల్యూ నీ దిహాజర్చారు అప్పట్లో తండ్రి టైమ్ లో. దాని వలన ఇప్పటి ఆటో డ్రైవర్లు లో సగం పైగా అప్పటి ఇంజనీరింగ్ చదివిన వాళ్ళే.

    అమెరికా లో కూడా ఆంధ్ర, తెలంగాణ లో ఇంజనీరింగ్ చదివిన వాళ్ళు అంటే ఇప్పటికి వాల్యూ ఇవడం లేదు. ఫ్యాకల్టీ లేకుండా మెడిసిన్ ఎలా చదవాలి? వాళ్ళు ఏమి నేర్చుకుంటఆరు?

Comments are closed.