బియ్య‌పు మ‌ధు వెయ్యిరెట్లు మేలు.. టీడీపీలో వీధికెక్కిన ర‌చ్చ‌!

తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి టీడీపీలో వర్గ విభేదాలు ర‌చ్చ‌కెక్కాయి. ఇక్క‌డి నుంచి టీడీపీ త‌ర‌పున దివంగ‌త బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి త‌న‌యుడు సుధీర్‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు వైసీపీ…

తిరుప‌తి జిల్లా శ్రీ‌కాళ‌హ‌స్తి టీడీపీలో వర్గ విభేదాలు ర‌చ్చ‌కెక్కాయి. ఇక్క‌డి నుంచి టీడీపీ త‌ర‌పున దివంగ‌త బొజ్జ‌ల గోపాల‌కృష్ణారెడ్డి త‌న‌యుడు సుధీర్‌రెడ్డి ప్రాతినిథ్యం వ‌హిస్తున్నారు. ఎన్నిక‌ల స‌మ‌యంలో మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు వైసీపీ నుంచి టీడీపీలో చేరారు.

అయితే ఎస్సీవీ చేరిక‌ను బొజ్జ‌ల సుధీర్ అడ్డుకోవాల‌ని తీవ్రంగా ప్ర‌య‌త్నించారు. కానీ ఎస్సీవీ చేరిక‌తో శ్రీ‌కాళ‌హ‌స్తితో పాటు స‌త్య‌వేడు, వెంక‌ట‌గిరి నియోజ‌క‌వ‌ర్గాల్లో రాజ‌కీయంగా మంచి జ‌రుగుతుంద‌ని చంద్ర‌బాబు, లోకేశ్ న‌చ్చ చెప్పారు. దీంతో టీడీపీలో ఎస్సీవీ చేరిక జ‌రిగిపోయింది. ఎన్నిక‌ల్లో సుధీర్ గెలుపు కోసం ఎస్సీవీ ప‌ని చేశారు.

తొమ్మిది నెల‌ల పాల‌న పూర్త‌య్యే స‌రికి… ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యే మ‌ధ్య విభేదాలు తీవ్ర‌స్థాయికి చేరాయి. గ‌త వైసీపీ ఎమ్మెల్యే బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి నీ కంటే వెయ్యిరెట్లు మేల‌ని ప్ర‌జ‌లు అనుకుంటున్నార‌ని ఎస్సీవీ నాయుడు ఏకంగా మీడియా స‌మావేశంలో సంచ‌ల‌న ప్ర‌క‌ట‌న చేశారు. అంతేకాదు, తొమ్మిది నెల‌ల్లో అధికారాన్ని అడ్డం పెట్టుకుని బొజ్జ‌ల సుధీర్ చేసిన అరాచ‌కాల్ని వంద పేజీల్లో నివేదిక‌గా సీఎం చంద్ర‌బాబుకు అంద‌జేస్తాన‌ని ఎస్సీవీ హెచ్చ‌రించ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది.

గ‌తంలో బియ్య‌పు మ‌ధుసూద‌న్‌రెడ్డి అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఇష్టానుసారం దోపిడీకి పాల్ప‌డ్డార‌న్న ఆరోప‌ణ‌లున్నాయి. బియ్య‌పు దోపిడీనే ఎక్కువ‌ని అనుకుంటే, ఆయ‌న్ను స్ఫూర్తిగా తీసుకున్న సుధీర్ …త‌న‌కు తానే సాటి అనేలా అరాచ‌కాలకు పాల్ప‌డుతున్న‌ట్టు కొంత‌కాలంగా ఆరోప‌ణ‌లు వెల్లువెత్తుతున్నాయి. అదే విష‌యాన్ని ఎస్సీవీ నాయుడు కూడా బ‌హిరంగంగా చెప్ప‌డం రాజ‌కీయంగా క‌ల‌క‌లం రేపుతోంది.

ఇంత వ‌ర‌కూ బియ్య‌పు మ‌ధు కూడా ఈ స్థాయిలో త‌న ప్ర‌త్య‌ర్థి అయిన సుధీర్‌పై ఆరోప‌ణ‌లు గుప్పించ‌లేదు. అలాంటిది సొంత పార్టీకి చెందిన సీనియ‌ర్ నాయ‌కుడు, మాజీ ఎమ్మెల్యే ఎస్సీవీ నాయుడు త‌న పార్టీ ఎమ్మెల్యేపై తీవ్ర ఆరోప‌ణ‌లు చేయ‌డంతో వాటికి విలువ వచ్చింది. చివ‌రికి ఎస్సీవీ కూడా సుధీర్ అరాచకాల‌పై విమ‌ర్శ‌లు చేశార‌ని తిరుప‌తి జిల్లాలో పెద్ద ఎత్తున జ‌నం మాట్లాడుకుంటున్నారు.

13 Replies to “బియ్య‌పు మ‌ధు వెయ్యిరెట్లు మేలు.. టీడీపీలో వీధికెక్కిన ర‌చ్చ‌!”

  1. వివేకా గారి కేసుంలో. సాక్షి లందరికీ వయస్సు తొ సంబంధం లేకుండా కాయిలాస ప్రాప్తి

    1. వివేకా గారి హాత్య జరిగింది టీడీపీ గవర్మెంట్ లో , హాత్య ను రాజకీయం గ వాడుకుంది టీడీపీ , CBN గారు , జగన్ హాత్య చేయించాడు అని ప్రచారం చేసారు … ఇప్పుడు గవర్మెంట్ లో వుంది టీడీపీ నే , విచారించి నిగ్గు తేల్చాలి … అయినా srkalahasthi అవినీతికి దీనికి ఏమి సంబంధం

      1. అందుకే చదువు ముఖ్యం అనేది…వివేకా హత్య జరిగింది ఎలక్షన్ కోడ్ వచ్చాక.ఎలక్షన్ కోడ్ ఉన్నప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతిలో ప్రభుత్వం ఉంటాడని కూడా తెలిసిసావాడు. హత్య జరిగిన తరువాతి రోజే నారాసురరక్త చరిత్ర అని పరచారం చేసిన ఎధవలు ఎవరు?కోర్ట్ కి పోయి హత్య మీద గాగ్ ఆర్డర్ తెచ్చుకున్నది ఎవరు?ప్రతిపక్షం లో ఉన్నప్పుడు సిబిఐ విచారణ అడిగి , అధికారం రాగానే అవసరం లేదు అన్నది ఎవరు?

        1. నేనేమీ చదువుకున్నాను నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను అనేది మనము రాసే రాతలు బట్టి అర్థమవుతుంది.

          సిబిఐ ఎంక్వయిరీ అడిగే హక్కు అపధర్మ ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారికి ఉంది కానీ ఆయన అడగలేదు స్టేట్ గవర్నమెంట్ ద్వారా ఎంక్వయిరీ వేసి జగన్మోహన్ రెడ్డి హత్య చేయించాడు అని ఎలక్షన్ క్యాంపైన్లో రాజకీయంగా వాడుకోవడానికి చూశాడు అప్పుడు జగన్మోహన్ రెడ్డి కోర్టుకెళ్లి వివేకానంద రెడ్డి హత్య గురించి క్యాంపెయిన్ లో వాడకూడదు అని గ్యాప్ తెచ్చాడు, recheck if it is not true

          1. బేసిక్స్ తెలియకపోతే ఇలా కాకి కబుర్లు చెప్పుకోవాలి.. ఆపదర్మ ముఖ్యమంత్రి కి సీబీఐ ఎంక్విరీ ఆర్డర్ చేసే అధికారం ఉందా? మరి జగన్ అధికారం లోకి రాగానే అవసరం లేదని ఎందుకు కోర్ట్ కి చెప్పినట్లు? స్టేట్ ఎంక్విరీ లో బాబు చేయించదనో, సునీత చేయించింది అనో చెప్పించడానికా?

          2. నా బేసిక్స్ నుంచి పక్కన పెట్టి మీరు బేసిక్స్ ఒకసారి చెక్ చేసుకోండి అపధర్మ ముఖ్యమంత్రిగాని ముఖ్యమంత్రిగాని సిబిఐ కి ఆర్డర్స్ పాస్ చేసే రైట్స్ లేవు వాళ్ళు కేవలం రిక్వెస్ట్ చేయొచ్చు లేదా రికమెండ్ చేయొచ్చు ఆ పని చంద్రబాబునాయుడు గారు చేయలేదు.

            కాకి కబుర్లు చెప్పి ఇక్కడ ఎవరు మెప్పు కోసం నేను లేను జగన్ ఏందో మాకు తెలుసు చంద్రబాబు నాయుడు అంటే కూడా ఏంటో మాకు తెలుసు

          3. తమరి తెలివి అలా ఏడ్చింది. ఆపదర్మ ముఖ్యమంత్రి కి ఎటువంటి అధికారాలు ఉండవు.. ఏదీనా విపత్కర పరిస్థితులు సమయంలో తప్ప. సీబీఐ దర్యాప్తు ఎన్నికల కమిషన్ లేదా గవర్నర్ ద్వారా మాత్రమే సాధ్యం. జగన్ ఎందుకో తెలిస్తే చెప్పొచ్చుగా మరి. సీబీఐ ఎంక్విరీ ఎందుకు వద్దనట్ల?

Comments are closed.