ప్రభాస్ సంక్రాంతికి రాకపోతే..!

ప్రభాస్ సినిమానే కనుక వస్తే ముందుగా ప్లాన్ చేసుకున్న చాలా సినిమాలు మూట ముల్లె సర్దుకుని పక్కకు జరుగుతాయి. అది ఫిక్స్.

ఇప్పటికి మూడు నాలుగు సంక్రాంతి సీజన్‌లు చూస్తూ, టాలీవుడ్ ఒకటి అయితే డిసైడ్ అయిపోయింది. సరైన సినిమా సంక్రాంతికి వస్తే సొమ్ములు గట్టిగా చేసుకోవచ్చు అన్న నమ్మకం బాగా కుదిరింది. అందుకే ఆరేడు నెలలు ముందు నుంచే సంక్రాంతిని టార్గెట్ చేస్తున్నారు. ఎవరూ వెనక్కు తగ్గడం లేదు. మరీ భారీ ఈవెంట్ ఫిల్మ్ వస్తుంది అంటే అప్పుడు ఆలోచిస్తున్నారు. కానీ సంక్రాంతినే టార్గెట్ గా పెట్టుకుని ఎవరి ప్రయత్నాలు వాళ్లు, రివర్స్ లో లెక్కలు చేసి, ప్లాన్ చేసుకుంటున్నారు.

2026 సంక్రాంతికి ఇప్పటి నుంచే అలాంటి ప్లానింగ్ మొదలైపోయింది. దాదాపు మూడు నాలుగు సినిమాలు సంక్రాంతి మీద దృష్టి పెట్టాయి.

అనిల్ రావిపూడి- మెగాస్టార్- సాహు గారపాటి సినిమా సంక్రాంతి టార్గెట్ గా వర్క్ చేసుకుంటోంది.

నవీన్ పోలిశెట్టి- సితార సంస్థ సినిమాను కూడా సంక్రాంతి టార్గెట్ అనే విధంగా ప్లాన్ చేస్తున్నారు. అదే టైమ్ లో మరో మాస్ సినిమాను కూడా ప్రిపేర్ చేయబోతున్నారు. అయితే ఇది లేదంటే అది దింపాలన్నది ఆలోచన.

నిర్మాత చెరుకూరి సుధాకర్, రవితేజ కాంబినేషన్ సినిమా కూడా సంక్రాంతిని టార్గెట్ గా పెట్టుకుని రెడీ చేయబోతున్నారు.

నాగార్జునకు సంక్రాంతి డేట్ అంటే చాలా ఇష్టం. అఖిల్ తో చేయబోయే పల్లెటూరి బ్యాక్ డ్రాప్ సినిమాను సంక్రాంతిని దృష్టిలో పెట్టుకునే ముందుకు నడుపుతున్నారు.

బాలయ్య అఖండ 2 ను సంక్రాంతి వరకు హోల్డ్ చేయకపోవచ్చు. లేదూ అంటే అది సంక్రాంతికి రేస్ లో ముందు వుండే సినిమా అవుతుంది.

ఇవన్నీ ఇలా వుంచితే ఈ లెక్కలు అన్నీ ప్రభాస్ సినిమా ఏదీ సంక్రాంతికి రాకపోతేనే. ఇంకా సిజి పనులు, షూటింగ్ పనులు అన్నీ కలిసి మూడు నెలలు టైమ్ వుంది రాజా సాబ్ కి. అందవల్ల ఆ సినిమాను సంక్రాంతి వరకు మెల్లగా నడుపుతారా? లేదా హను రాఘవపూడి తన సినిమాను చకచకా ప్లాన్ చేస్తూ వెళ్తున్నారు. ఇంకా 270 రోజులు టైమ్ వుంది కనుక దాన్ని ఏమైనా సంక్రాంతి బరిలోకి దింపుతారా? ఈ విషయాల్లో క్లారిటీ రావాలి.

ప్రభాస్ సినిమానే కనుక వస్తే ముందుగా ప్లాన్ చేసుకున్న చాలా సినిమాలు మూట ముల్లె సర్దుకుని పక్కకు జరుగుతాయి. అది ఫిక్స్.

2 Replies to “ప్రభాస్ సంక్రాంతికి రాకపోతే..!”

Comments are closed.