లిక్కర్ వ్యాపారంలో కొత్త డ్రామా షురూ అవుతోందా?

చంద్రబాబునాయుడు పరిపాలన చెప్పిందొకటి చేసేదొకటిగా ప్రజలను వంచిస్తున్నది. కాకపోతే.. ఆయన ఏం చేస్తే.. అదే గతంలో చెప్పారంటూ ఊదరగొట్టి ప్రజలను మభ్యపెట్టడానికి ఆయన అనుకూల మీడియా తన శక్తివంచన లేకుండా పాటుపడుతుంటుంది. Advertisement చంద్రబాబు…

చంద్రబాబునాయుడు పరిపాలన చెప్పిందొకటి చేసేదొకటిగా ప్రజలను వంచిస్తున్నది. కాకపోతే.. ఆయన ఏం చేస్తే.. అదే గతంలో చెప్పారంటూ ఊదరగొట్టి ప్రజలను మభ్యపెట్టడానికి ఆయన అనుకూల మీడియా తన శక్తివంచన లేకుండా పాటుపడుతుంటుంది.

చంద్రబాబు గతంలో చేసిన హామీ ఇది కాదు కదా అని ప్రజలు అనుకున్నప్పటికీ కూడా.. అబ్బెబ్బే.. మీకు అర్థం చేసుకోవడం రావడం లేదు. ఆ మాటలను అలాగాదు ఇలా అర్థం చేసుకోవాలి అంటూ మభ్యపెట్టగల చాతుర్యం వారికి ఉంది. వారి తెలివితేటలను తెలుసుకోగలిగితే.. ఇప్పుడు మంత్రి కొల్లు రవీంద్ర చెబుతున్న మాటలను గమనించినప్పుడు.. మద్యం ధరలు, దుకాణాలు, లిక్కర్ వ్యాపారం విషయంలో కొత్త డ్రామాకు తెరలేపుతున్నారా? అనే అనుమానాలు ప్రజలకు కలుగుతున్నాయి.

కొల్లు రవీంద్ర మాట్లాడుతూ.. మద్యం ధరల స్థిరీకరణకు త్వరలోనే ఒక టెండరు కమిటీ వేస్తామని చెబుతున్నారు. ఆల్రెడీ క్వార్టరు లిక్కరు సీసా రూ.99కి మించరాదు అని డిసైడ్ చేసి వ్యాపారం ప్రారంభించిన తర్వాత.. మళ్లీ స్థిరీకరణ పేరుతో డ్రామా ఏమిటి? అని ప్రజలు విస్తుపోతున్నారు.

మాట ఇచ్చిన ప్రకారం.. ఇప్పటికే క్వాలిటీ మద్యం ఇస్తున్నాం అని, అత్యంత పారదర్శకంగా దుకాణాలు కేటాయించాం అని ఆయన అంటున్నారు. క్వాలిటీ అనే పదం వాడుతున్నారు గనుక.. ఆ ముసుగులో అధిక రేట్లు కూడా వడ్డించడానికి ప్రయత్నం జరుగుతున్నదా? అనేది అనుమానం. డిస్టిలరీస్ వారితో సంప్రదింపులు జరిపిన తర్వాత ధరలను స్థిరీకరిస్తాం అనడం వల్ల అనుమానాలు ఇంకా పెరుగుతున్నాయి.

రేపు ధరలు పెంచేసి.. డిస్టిలరీస్ వారంతా నష్టపోతున్నాం అని గోల చేస్తున్నారు. అందువల్ల వారు నాణ్యతలో రాజీపడకుండా, క్వాలిటీ లిక్కరు ఇవ్వాలనే ఉద్దేశంతో ధరల పెంపునకు అంగీకరించాం. ఇప్పటికీ జగన్ పరిపాలనలో ఉన్న రేట్లకంటె నాలుగైదు రపాయలు తక్కువకే ఇస్తున్నాం.. ఆ రకంగా మా మాట కూడా నిలబెట్టుకున్నట్టే.. అని నాటకీయమైన డైలాగులు వల్లించినా వల్లించగలరు అనే అభిప్రాయం ప్రజలకు కలుగుతోంది.

డిస్టిలరీస్ తో భేటీ అయినాసరే.. ధరల స్థిరీకరణ అనే ముసుగులో పెంచడానికి వీల్లేదని, వీలైతే ఇప్పుడున్న అన్ని ధరలను తగ్గించి స్థిరీకరిస్తే మంచిదని ప్రజలు కోరుకుంటున్నారు.

5 Replies to “లిక్కర్ వ్యాపారంలో కొత్త డ్రామా షురూ అవుతోందా?”

  1. తాగేవాడు తాగుతాడు.. మన దగ్గర టూరిజం డెవలప్మెంట్ కావాలంటే ప్రీమియం బ్రాండ్స్ ఉండాలి

Comments are closed.