మిత్రులకు గోతులు తవ్వుతున్న పచ్చముఠాలు!

గిద్దలూరులో మునిసిపల్ ఛైర్మన్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తే.. అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా రంగంలోకి దిగుతోంది.

గిద్దలూరులో మునిసిపల్ ఛైర్మన్ స్థానాన్ని భారతీయ జనతా పార్టీకి కేటాయిస్తే.. అక్కడ తెలుగుదేశం పార్టీ కూడా రంగంలోకి దిగుతోంది.

బిజెపి ప్రకటించిన అభ్యర్థి అసమర్థుడని, వైసీపీతో స్నేహం కలిగిఉన్న వ్యక్తి అని ఆరోపణలు చేస్తూ.. స్వయంగా ఎమ్మెల్యే ముత్తుముల అశోక్ రెడ్డి తమ్ముడే స్వయంగా అక్కడ నామినేషన్ వేయడానికి సిద్ధపడుతున్నారు.

అదేవిధంగా.. తిరువూరు సీటును జనసేనకు కేటాయిస్తే.. అక్కడ తిరుగుబాటు అభ్యర్థితో నామినేషన్ వేయించడానికి ఎమ్మెల్యే కొలికపూడి స్వయంగా రంగంలోకి దిగారు.

ప్రస్తుతానికి ఈ రెండూ బహిరంగంగా కనిపిస్తూ ఉన్నా.. రాష్ట్రంలో అనేకచోట్ల మిత్రపక్షాల అభ్యర్థులకు తెలుగుదేశం నుంచి వెన్నుపోటు తప్పకపోవచ్చుననే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.

క్షేత్రస్థాయిలో కూటమి పార్టీల మధ్య విభేదాలు తొలి నుంచి అలాగే ఉన్నాయి. పార్టీలు నాయకత్వం స్థాయిలో సీట్లను పంచుకున్నారు తప్ప.. ఆ పంపకాలకు తగినట్టుగా క్షేత్రస్థాయి నాయకులు ఆమోదయోగ్యంగా లేని పరిస్థితి పలుచోట్ల ఉంది.

ఇలాంటి అసంతృప్తులు తెలుగుదేశం, జనసేన ఇరు పార్టీల్లోనూ ఉన్నప్పటికీ.. నష్టం మాత్రం ఎక్కువగా జనసేనకు ఎదురవుతుందని పలువురు అంచనా వేస్తున్నారు.

సార్వత్రిక ఎన్నికల సమయం నుంచి కూడా.. జనసేనతో పొత్తు పట్ల క్షేత్రస్థాయిలో తెలుగుదేశం కార్యకర్తల మధ్య భిన్నాభిప్రాయాలున్నాయి. అసలు జనసేనతో పొత్తు వద్దే వద్దని అప్పటినుంచి వాదిస్తున్న వారున్నారు. అలాంటి వారంతా ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల వేళ శృతి పెంచుతున్నారు.

జనసేన నిజానికి గత్యంతరం లేని స్థితిలో ఉంది. సంఖ్య పరంగా పట్టుబట్టి.. ఎక్కువ సీట్లు తీసుకున్నారే తప్ప.. ఆయా సీట్లలో పోటీకి వారికి అభ్యర్థులు కూడా లేరు. తెలుగుదేశం నుంచి, వైసీపీ నుంచి ఎవరైనా వచ్చి తమ పార్టీలో చేరుతారా? అని ఎదురుచూసే పరిస్థితి.

ఇంకా అనేకచోట్ల మిత్రులకు పంచిపెట్టిన సీట్లలో కూడా తెలుగుదేశం అభ్యర్థులు నామినేషన్లు వేస్తున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. నామినేషన్ల ఉపసంహరణ రోజు వరకు బేరసారాలు చేసుకుంటే నాలుగు డబ్బులు గిట్టుబాటు అవుతాయని చూసేవాళ్లు కొందరు.

ఇండిపెండెంట్లుగా బరిలో కొనసాగి అమీ తుమీ తేల్చుకోవాలనే వాళ్లు మరికొందరు. గెలిచే సంగతి ఏమో గానీ.. కూటమి పార్టీల నుంచే తిరుగుబాటు అభ్యర్థులు ఇండిపెండెంట్లుగా బరిలో ఉంటే.. జనసేన, బిజెపి తరఫున పోటీచేసేవారికి ఖచ్చితంగా నష్టం జరుగుతుంది.

ఇలాంటి పరిస్థితుల్ని తెలుగుదేశం నాయకులే చక్కదిద్దాల్సి ఉంది. పైనుంచి అధినాయకులు తిరుగుబాటు అభ్యర్థుల్ని సహించం వంటి ప్రకటనలు చేస్తున్నప్పటికీ.. క్షేత్రస్థాయిలో వారిని బుజ్జగించి, ఊరుకోబెట్టాల్సిన ఎమ్మెల్యేలు అంత సీరియస్ గా తీసుకోకపోవడం వల్ల ఇలాంటి పరిస్థితి ఉన్నదని పలువురు అనుకుంటున్నారు.

4 Replies to “మిత్రులకు గోతులు తవ్వుతున్న పచ్చముఠాలు!”

  1. ఇతే ఇంకేమి చంకలు గుద్దుకుని, కళ్ళు ఆరేసుకొని పడుకో అన్న గెలుస్తాడు ఓట్లు చెలిపోవడమే గా కావాలి

Comments are closed.