బాబును జైలుకు పంప‌డంలో కీల‌క పాత్ర పోషించాడ‌నే…!

స్కిల్ స్కామ్‌లో చంద్ర‌బాబునాయుడు 50 రోజుల‌కు పైగా జైల్లో వుండ‌డానికి నాటి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌ధాన కార‌కుడు అని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ మాత్రం అట్లా అనుకోవ‌డం…

స్కిల్ స్కామ్‌లో చంద్ర‌బాబునాయుడు 50 రోజుల‌కు పైగా జైల్లో వుండ‌డానికి నాటి ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి ప్ర‌ధాన కార‌కుడు అని అంద‌రూ అనుకుంటున్నారు. కానీ చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు లోకేశ్ మాత్రం అట్లా అనుకోవ‌డం లేదు. వ్య‌వ‌స్థ‌ల్ని మేనేజ్ చేసి, త‌న‌ను జైలుకు పంప‌డంతో పాటు ఏకంగా 50 రోజులు ఊచ‌లు లెక్కించేలా చేయ‌డంలో టీటీడీ ఇన్‌చార్జ్ ఈవో ధ‌ర్మారెడ్డి కార‌ణ‌మ‌ని చంద్ర‌బాబు, ఆయ‌న త‌న‌యుడు భావిస్తున్నారు.

అందుకే ధ‌ర్మారెడ్డిని ఎలాగైనా జైలుకు పంపాల‌ని తండ్రీత‌న‌యుడు ప‌ట్టుద‌ల‌తో ఉన్నారు. చంద్ర‌బాబు ముఖ్య‌మంత్రిగా బాధ్య‌త‌లు తీసుకోకుండానే ధ‌ర్మారెడ్డిపై దృష్టి సారించ‌డం గ‌మ‌నార్హం. ధ‌ర్మారెడ్డి పాల‌న‌లో టీటీడీలో అక్ర‌మాలు జ‌రిగాయ‌ని, వాటిని వెలికి తీయాలంటూ సుమారు 70 మంది విజిలెన్స్ సిబ్బందిని తిరుప‌తికి పంపారు. దీన్నిబ‌ట్టి ధ‌ర్మారెడ్డిపై ఎంత అక్క‌సుతో ఉన్నారో అర్థం చేసుకోవ‌చ్చు.

ఇందులో భాగంగా ధ‌ర్మారెడ్డి శ్రీ‌వాణి ట్ర‌స్ట్ నిధుల్ని నిబంధ‌న‌ల‌కు విరుద్ధంగా ఇత‌ర‌త్రా అవ‌స‌రాల‌కు వాడుకున్నార‌ని విజిలెన్స్ గుర్తించిన‌ట్టు ప్ర‌చారం జ‌రుగుతోంది. ధ‌ర్మారెడ్డిని జైలుకు పంప‌డానికి కావాల్సిన ఆధారాలు దొరికాయ‌ని విజిలెన్స్ సిబ్బంది చెబుతున్నారు. ఇందులో భాగంగా ధ‌ర్మారెడ్డికి నోటీసులు కూడా పంప‌డం గ‌మ‌నార్హం.

త‌న‌ను ఎలాగైనా జైలుకు పంపాల‌ని ప్ర‌స్తుత ప్ర‌భుత్వం ప‌ట్టుద‌ల‌తో వుంద‌ని గ్ర‌హించిన ధ‌ర్మారెడ్డి న్యాయ పోరాటానికి స‌న్న‌ద్ధం అవుతున్నార‌ని తెలిసింది.

12 Replies to “బాబును జైలుకు పంప‌డంలో కీల‌క పాత్ర పోషించాడ‌నే…!”

  1. మొన్నె ఎవడొ YCP నాయకులకు సన్నిహితంగా ఉన్న ఒకడె వెయ్యి కొట్లు మద్యం లొ స్వహా చెసాడు అని రాసావ్!

    మరి ముక్యమయిన పొజిషన్ లొ ఉన్న వారు మాత్రం కాలీగా ఉంతారా?

  2. మొన్నె ఎవడొ YCP నాయకులకు సన్నిహితంగా ఉన్న ఒకడె వెయ్యి కొ.-.ట్లు మద్యం లొ స్వహా చెసాడు అని రాసావ్!

    మరి ముక్యమయిన పొజిషన్ లొ ఉన్న వారు మాత్రం కాలీగా ఉంతారా?

  3. మొన్నె ఎవడొ Y.-.C.-.P నాయకులకు సన్నిహితంగా ఉన్న ఒకడె వెయ్యి కొ.-.ట్లు మద్యం లొ స్వహా చెసాడు అని రాసావ్!

    మరి ముక్యమయిన పొజిషన్ లొ ఉన్న వారు మాత్రం కాలీగా ఉంతారా?

Comments are closed.