త‌మ్ముడిపై చెల‌రేగిన కేశినేని నాని!

ఈ సంస్థ విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని చూపొందించిన బినామీ, మోస‌పూరిత సంస్థ‌గా అభివ‌ర్ణించ‌డం విశేషం.

విజ‌య‌వాడ మాజీ ఎంపీ కేశినేని నాని త‌న సొంత త‌మ్ముడు, ఎంపీ కేశినేని చిన్నిపై సోష‌ల్ మీడియా వేదిక‌గా చెల‌రేగారు. త‌న త‌మ్ముడు సృష్టించిన బినామీ కంపెనీకి విశాఖ‌లో ఏకంగా 60 ఎక‌రాలు పంపిణీ చేయ‌డం ఏంట‌ని సీఎం చంద్ర‌బాబును ఆయ‌న ప్ర‌శ్నించారు. అలాగే మంత్రి నారా లోకేశ్ పేరును ఎంపీ చిన్ని దుర్వినియోగం చేస్తున్నార‌ని ఆయ‌న విమ‌ర్శించారు. మ‌రోవైపు టీసీఎస్‌కు భూమి కేటాయించ‌డాన్ని ఆయ‌న ప్ర‌శంసించారు.

కేశినేని నాని వైసీపీ త‌ర‌పున విజ‌య‌వాడ లోక్‌స‌భ స్థానం నుంచి త‌న త‌మ్ముడిపై పోటీ చేసి ఓడిపోయారు. కూట‌మి ప్ర‌భుత్వం వ‌చ్చిన త‌ర్వాత రాజ‌కీయాల నుంచి త‌ప్పుకుంటున్న‌ట్టు ఆయ‌న ప్ర‌క‌టించారు. అప్పుడ‌ప్పుడు సోష‌ల్ మీడియాలో పోస్టులు పెడుతూ వార్త‌ల్లో క‌నిపిస్తున్నారు. అయితే తాజాగా రాజ‌కీయంగా త‌న త‌మ్ముడిపై విరుచుకుప‌డ‌డం తీవ్ర చ‌ర్చ‌నీయాంశ‌మైంది. కేశినేని నాని పోస్టులోని మంచీచెడుల గురించి మాట్లాడుకుందాం.

విశాఖ‌ప‌ట్నంలో టీసీఎస్‌కు భూమి కేటాయించ‌డం చంద్ర‌బాబు దార్శ‌నిక‌త‌గా ఆయ‌న కొనియాడారు. ఇదే సంద‌ర్భంలో రూ.5,728 కోట్ల విలువైన డేటా సెంట‌ర్‌ను ఏర్పాటు చేయ‌డానికి ఉర్సా క్ల‌స్ట‌ర్స్ ప్రైవేట్ లిమిటెడ్‌కు 60 ఎక‌రాలు భూమి కేటాయింపు స‌రైంది కాద‌ని ఆయ‌న త‌ప్పు ప‌ట్ట‌డం గ‌మ‌నార్హం. దానికి కార‌ణాన్ని కూడా ఆయ‌న చెప్పారు.

ఈ సంస్థ విజ‌య‌వాడ ఎంపీ కేశినేని చిన్ని చూపొందించిన బినామీ, మోస‌పూరిత సంస్థ‌గా అభివ‌ర్ణించ‌డం విశేషం. ఈ సంస్థ‌కు ఎలాంటి అనుభ‌వం, అలాగే ప్ర‌ధానంగా విశ్వ‌స‌నీయ‌త లేద‌ని విమ‌ర్శించారు. ఉర్సా సంస్థ డైరెక్ట‌ర్ల‌లో ఒక‌రైన సతీష్ ఎంపీకి ఇంజ‌నీరింగ్‌లో క్లాస్‌మేట్‌, అలాగే చాలా కాలంగా స‌న్నిహితుడ‌ని ఆయ‌న పేర్కొన్నారు. అలాగే గ‌తంలో అప‌ఖ్యాతి పాలైన సంస్థ‌లో వ్యాపార భాగ‌స్వామి అని కూడా ఆయ‌న వెల్ల‌డించారు. అమాయ‌క కొనుగోలుదారుల్ని మోసం చేసి, సంస్థ‌ను మూసివేశార‌ని ఆయ‌న గుర్తు చేశారు. ఆ సంస్థ‌కు భూకేటాయింపు వెనుక ఎంపీ త‌న ప‌లుకుబ‌డిని ఉప‌యోగించార‌ని తెలిపారు. అలాగే సీఎంతో పాటు ఆయ‌న కుమారుడు లోకేశ్ పేరును వాడుకుంటున్న‌ట్టుగా కూడా చంద్ర‌బాబుకు నాని ఫిర్యాదు చేయ‌డం గ‌మ‌నార్హం.

4 Replies to “త‌మ్ముడిపై చెల‌రేగిన కేశినేని నాని!”

  1. మొన్నెప్పుడో షర్మిల అన్న మీద చెలరేగిన వార్త మాత్రం వేరే గా రాసావ్..

  2. తల్లిని, చెల్లిని అగౌరవపరిచిన నేతకు గౌరవం ఎక్కడ? గ్రామాల నుంచి జగన్‌కు ఘోర తిరస్కారం!

    ఒకప్పుడు “మామయ్య” అంటూ ప్రేమగా పిలిచిన మహిళలు, ఇప్పుడు జగన్ మోహన్ రెడ్డి పేరు వినగానే జాల్రాలు వేస్తున్నారు. ఇంట్లో ఒకరిలా కనిపించిన వ్యక్తి, ఆ ఇంటినే నాశనం చేసాడన్న భావన ఇప్పుడు గ్రామాల్లో బలంగా నెలకొంది. తన తల్లిని కోర్టుకు లాగిన వాడిని మన నాయకుడిగా ఎలా అంగీకరిస్తాం అని ఆడవాళ్లు గళమెత్తుతున్నారు. కుటుంబానికి గౌరవం లేని వాడికి ప్రజలకు ఏమాత్రం గౌరవం ఉంటుంది?

    గ్రామాల్లో ఇది ఏకవాక్యం: “మనం మోసపోయాం… ఇక మళ్లీ కాదు!” జగన్ వేసిన నాటకాలన్నీ బహిరంగమయ్యాయి. సంక్షేమం పేరుతో ఓట్లు గెలవడం మాత్రమే ఆయన లక్ష్యమని ప్రజలు ఎట్టకేలకు గుర్తించారు. అల్లరి మాటలతో ఆకర్షించిన రోజులే గడిచిపోయాయి. ఇప్పుడు ప్రజలు విషయాన్ని తలచుకొని మాడిపోతున్నారు.

    తల్లిని తక్కువ చేస్తే మనిషికి మానవత్వమే లేదని చెప్పే తెలుగు సంస్కృతిని తునాతునకలు చేసిన జగన్ పట్ల ఇప్పుడు గ్రామాల మన్ననే కాదు, మనస్సు కూడా పూర్తిగా తిరస్కరించింది. “ఎవడైనా గెలవాలి కానీ… ఇలాంటోడు కాదు” అన్న మాటలు ఆ వృద్ధుల నోటి నుంచి కూడా వినిపిస్తున్నాయి. ఒక్క కుటుంబం నడిపించలేని వాడిని రాష్ట్రం నడిపించడానికి ఎలా నమ్ముతాం?

    పార్టీ నాయకత్వంలో విభేదాలు, క్యాడర్‌కి గల వైముఖ్యాన్ని వేరే కోణంగా చూడాల్సిన అవసరం లేదు. అది జగన్‌ పట్ల ప్రజల్లోని అసహనం ప్రతిబింబమే. ఇప్పటికే 40 శాతం పైగా పార్టీ శ్రేణులు పార్టీని విడిచి వెళ్లిపోవడం యాదృచ్ఛికం కాదు. అది ప్రజలు తీర్పునిచ్చిన తర్వాత జరుగుతున్న సహజ పరిణామం.

    ఇప్పటికి గ్రామాల్లో ప్రజలు చెప్పేది ఒక్కటే—తల్లిని అగౌరవపరిచిన, చెల్లిని అపహాస్యం చేసిన వాడికి ఓటు వేయడమంటే… మా తల్లులను, చెల్లెల్లను అవమానపరచినట్టు అవుతుంది. ఇది రాజకీయ తిరస్కారం కాదు… ఇది నైతిక తిరుగుబాటు. జగన్ మళ్ళీ వచ్చిన రాస్తా కాదు… ఇదే చివరి దారి!

Comments are closed.