లోకేశ్ కోస‌మేనా.. ప‌వ‌న్ టార్గెట్‌!

టీడీపీ త‌న‌ వాయిస్‌ను ఇత‌రుల ద్వారా వినిపించ‌డం రాజ‌కీయంలో వ్యూహంలో భాగంగా అమ‌లు చేస్తుంటుంది.

టీడీపీ త‌న‌ వాయిస్‌ను ఇత‌రుల ద్వారా వినిపించ‌డం రాజ‌కీయంలో వ్యూహంలో భాగంగా అమ‌లు చేస్తుంటుంది. ముఖ్యంగా సీపీఐ నాయ‌కులు కె.నారాయ‌ణ‌, కె. రామ‌కృష్ణ టీడీపీకి అన‌ధికార ప్ర‌తినిధుల‌నే బ‌ల‌మైన ముద్ర వుంది. వైసీపీ హ‌యాంలో జ‌గ‌న్‌ను ముఖ్యంగా సీపీఐకి చెందిన ఈ ఇద్ద‌రు నేత‌లు ఎంత ఘాటుగా విమ‌ర్శించారో అంద‌రికీ తెలుసు.

తాజాగా ప్ర‌భుత్వంలో కీల‌క నాయ‌కుడైన డిప్యూటీ సీఎం ప‌వ‌న్‌క‌ల్యాణ్‌పై సీపీఐ అస్త్రాన్ని టీడీపీ ప్ర‌యోగిస్తోంద‌న్న అభిప్రాయం వుంది. ఈ విమ‌ర్శ‌కు ప‌వ‌న్‌పై సీపీఐ రాష్ట్ర కార్య‌ద‌ర్శి కె.రామ‌కృష్ణ ఘాటు వ్యాఖ్య‌లు బ‌లం క‌లిగిస్తున్నాయి. ప‌వ‌న్‌క‌ల్యాణ్ గ‌త కొంత‌కాలంగా వ్య‌వ‌హ‌రిస్తున్న తీరు స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌ల‌కు, అనుమానాల‌కు తావిస్తోంది. డిప్యూటీ సీఎంగా బాధ్య‌త‌ల్ని విస్మ‌రించి, ఎక్క‌డెక్క‌డో తిరుగుతూ, ఏం చేస్తున్నారో ఆయ‌న‌కే తెలియ‌డం లేద‌న్న చ‌ర్చ కూట‌మి నేత‌ల మ‌ధ్య సాగుతోంది.

ఈ నేప‌థ్యంలో ప‌వ‌న్‌పై సీపీఐ నాయ‌కుడు రామ‌కృష్ణ తీవ్ర విమ‌ర్శ‌లు చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. ప‌రిపాల‌న‌ను గాలికి వ‌దిలేసి, గుళ్లు, గోప‌రాలు అంటూ ప‌వ‌న్ తిరుగుతున్నార‌ని ఆయ‌న మండిప‌డ్డారు. ఇలాగైతే డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఎందుకుని ప్ర‌శ్నించ‌డంతో పాటు దేవాదాయ‌శాఖ బాధ్య‌త‌ల్ని తీసుకోవాల‌ని ఉచిత స‌ల‌హా ఇచ్చారు.

పాలించ‌డం మానేసి తిరిగే ప‌వ‌న్‌క‌ల్యాణ్‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి అవ‌స‌ర‌మా? అని నిల‌దీశారు. మౌన‌దీక్ష‌లు, కాషాయం అంటూ తిర‌గ‌డం ఏంట‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. లోకేశ్‌కు డిప్యూటీ సీఎం ప‌ద‌వి ఇస్తార‌నే ప్ర‌చారం నేప‌థ్యంలో, ప‌వ‌న్ అస‌మ‌ర్థుడ‌నే ముద్ర ఇత‌ర పార్టీల నేత‌ల‌తో వేయిస్తున్నార‌ని జ‌న‌సేన అనుమానం. రాజ‌కీయాలంటేనే పైకి క‌నిపించ‌ని కుట్ర‌లు. డిప్యూటీ సీఎంగా కీల‌క బాధ్య‌త‌లు నిర్వ‌ర్తిస్తూ, స‌మ‌స్య‌ల‌పై దృష్టి సారించ‌డం లేద‌నే విమ‌ర్శ రానున్న రోజుల్లో క్ర‌మంగా పెరిగే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి.

ఇవ‌న్నీ లోకేశ్ కోస‌మే అని జ‌న‌సేన నేత‌లు అనుకోవ‌డంలో త‌ప్పు లేదు. మ‌రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ మ‌న‌సులో ఏముందో తెలియాల్సి వుంది. ఇక‌పై ప‌వ‌న్ టార్గెట్‌గా రాజ‌కీయం ఉండే అవ‌కాశాలు మెండుగా క‌నిపిస్తున్నాయి.

8 Replies to “లోకేశ్ కోస‌మేనా.. ప‌వ‌న్ టార్గెట్‌!”

  1. పవన్ చంబా ఫోన్ తియ్యలేదు కూటమి లో విభేదాలు అని రాసారు….కట్ చేస్తే నిన్న అందరు కలుసుకున్నారు ఆత్మీయం గ గడిపారు…మాములు సందర్భాల్లో ఐతే ఈ వార్త ని “పవన్ ని బండ కేసి బాదారు” “కూటమి ని చాకిరేవు పెట్టారు” రాసేవారు….కానీ ఇప్పుడు మన కర్తవ్యం పుల్లలు పెట్టడం కాబట్టి రామకృష్ణ భుజాల మీద తుపాకీ పెట్టి చంద్రబాబు కాలుస్తున్నారు అని రాసి మురిసి ముక్కలుఅవుతున్నారు…..అన్నేమో casual గ ఐదేళ్లు ఇంతలోకి కళ్ళుమూసుకుంటే అయిపోతుంది అంటారు…మీరు ఆ కాస్త సేపు (అన్న ప్రకారం ) కూడా కళ్ళు మూసుకోలేకపోతున్నారు….

  2. పాపం! ఈ బులుగు మంద చెయని ప్రయత్నం అంటూ ఉండదెమొ!

    పవన్ BJP తొ అతిగా అంటకాగుతున్నడు అన్నది కమ్యునిస్ట్ ల ఎడుపు. అందుకె విమర్సించుతున్నారు! దానికి నీ ఎడుపు కలిపి.. నువ్వు TDP మీద ఎడుస్తున్నావ్!

  3. 2029 లోగా కూటమిలో విభేదాలు సృష్టించాలి అని మీ బ్లూ మీడియా విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు. ఎందుకంటే వారు కలిసువుంటే మీ పార్టీ గెలవలేదు. 2014 లో అలా విడగొట్టే సక్సెస్ అయ్యారు. ఈసారి అలా జరగదు. లోకేష్ మీ నాయకుడి లాగా సజ్జల మీద ఆధారపడలేదు. స్వతహాగా ఎదుగుతున్నాడు. తనకు తెలుసు ఎక్కడ తగ్గాలో, ఎక్కడ ఎక్కాలో. అతను పవన్ గారి దగ్గర నుండీ ఆ పోస్టు లాక్కొవాలని అనుకోవడంలేదు

Comments are closed.