ఆ మంత్రి వియ్యంకుడు బియ్యం త‌ర‌లిస్తున్న‌ట్టు అనుమానం!

కాకినాడ పోర్ట్ నుంచి ఆర్థిక మంత్రి వియ్యంకుడు బియ్యం అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న‌ట్టు మాజీ మంత్రి పేర్ని నాని అనుమానం వ్య‌క్తం చేశారు. కాకినాడ పోర్ట్‌లో కెన్‌స్టార్‌ షిప్‌ను ఎందుకు చూడ‌లేద‌ని క‌లెక్ట‌ర్ షాన్‌మోహన్‌ను పేర్ని…

కాకినాడ పోర్ట్ నుంచి ఆర్థిక మంత్రి వియ్యంకుడు బియ్యం అక్ర‌మంగా త‌ర‌లిస్తున్న‌ట్టు మాజీ మంత్రి పేర్ని నాని అనుమానం వ్య‌క్తం చేశారు. కాకినాడ పోర్ట్‌లో కెన్‌స్టార్‌ షిప్‌ను ఎందుకు చూడ‌లేద‌ని క‌లెక్ట‌ర్ షాన్‌మోహన్‌ను పేర్ని ప్ర‌శ్నించారు. మీడియా ఆయ‌న మాట్లాడుతూ ఆ షిప్‌ను త‌నిఖీ చేయాలి క‌దా అని నిల‌దీశారు. ఆర్థిక మంత్రి వియ్యంకుడికి సంబంధించిందైతే ఎవ‌రికీ షిప్ క‌న‌ప‌డ‌ద‌న్నారు. స్టెల్లా ఎల్ షిప్‌లో ఒకే మ‌నిషి 42 వేల ట‌న్నులు షిప్ మొత్తం నింపి పంపుతుంటే ఎందుకు వెత‌క‌డం లేద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు.

ఆ షిప్‌లో రేష‌న్ బియ్యం లేవా? అని పేర్ని నిల‌దీశారు. స్టెల్లా షిప్‌ను త‌నిఖీ చేసి, కెన్‌స్టార్ షిప్‌ని ఎందుకు వ‌దిలేశార‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. ఉప ముఖ్య‌మంత్రి ప‌వ‌న్‌క‌ల్యాణ్ నిజాయ‌తీగా కాకినాడ పోర్ట్‌కు వెళ్లి త‌నిఖీ చేశార‌ని పేర్ని నాని ప్ర‌శంసించారు. కానీ త‌న సందేహాల‌కు స‌మాధానాలు కావాల‌న్నారు.

షిప్‌లోకి వెళ్లాలంటే అనుమ‌తి ఇవ్వాల్సిన ఇద్ద‌రు ప‌వ‌న్ వెంటే ఉన్నార‌న్నారు. ఇక వెళ్ల‌నివ్వ‌నిది ఎవ‌ర‌ని నాని ప్ర‌శ్నించారు. ఉప ముఖ్య‌మంత్రికి అనుమ‌తి ఇవ్వ‌ని అధికారులు…క‌లెక్ట‌ర్‌ను ఎందుకు వెళ్ల‌నిచ్చార‌ని పేర్ని ప్ర‌శ్నించారు. స్టెల్లా చుట్టే ఎందుకు చ‌క్క‌ర్లు కొడుతూ షూటింగ్ చేశార‌న్నారు. కెన్‌స్టార్ షిప్ ద‌గ్గ‌రికి కూడా వెళ్లాలి క‌దా? అని ఆయ‌న అడిగారు. చంద్ర‌బాబు వెళ్లొద్ద‌ని అన్నాడా? అంటూ పేర్ని నాని ప్ర‌శ్నించారు.

ఎవ‌ర్ని ఏమారుద్దామ‌ని అనుకుంటున్నారో సీఎం, డిప్యూటీ సీఎం త‌ప్పక స‌మాధానం చెప్పి తీరాల్సిందే అన్నారు. నిజాయ‌తీగా త‌నిఖీలు చేశారా? లేక ఏదో జ‌రుగుతుంటే వైఎస్ జ‌గ‌న్‌పై బుర‌ద చ‌ల్లాల‌ని అనుకుంటున్నారా? అని ప‌వ‌న్‌ను పేర్ని నిల‌దీశారు. ఈ త‌తంగం సాగింది యాంక‌రేజ్ పోర్ట్‌లో అని, దానికి అర‌బిందో పోర్ట్‌కు సంబంధం లేద‌ని నాని అన్నారు. యాంక‌రేజ్ పోర్ట్ అనేది ప్ర‌భుత్వానిదన్నారు. పిచ్చి మాట‌లు మాట్లాడొద్ద‌ని పౌర‌స‌ర‌ఫ‌రాల‌శాఖ మంత్రి నాదెండ్ల మ‌నోహ‌ర్‌కు చీవాట్లు పెట్టారు.

12 Replies to “ఆ మంత్రి వియ్యంకుడు బియ్యం త‌ర‌లిస్తున్న‌ట్టు అనుమానం!”

  1. Y.-.C.-.P వళ్ళకి వచ్చె అనుమానాలె నిజాలు అనట్టు చెప్పట్టం అలావటెగా! అయినా పొర్ట్ ని కట్టడి చెసాక వీల్లు ఎదొ ఊపిరి ఆగిపొయినట్టు చెస్తున్నారు!

    .

    మొన్న సాక్షి లొ కొమ్మినెని చెపుతున్నాడు.. అసలు అమెరికా లొ FBI వాళ్ళని TDP వాళ్ళె ఇంఫ్లుయన్స్ చెసి, 1750 కొట్ల లంచం కెసులొ జగన్ పెరు వచ్చెలా చెసారు ఎమొ అని! ఇలానె ఉంటాయి వీళ్ళ ఆర్గుమెంట్లు!

    1. మా అన్నయ్య కష్టపడి సంపాదించిన డబ్బుతో వ్యాపారాలు చేసి సంపాదించాడు 2004నుండి 2009 వరకు అంటారు నీలి గొర్రెలు

  2. నమ్మేశాము లే…. అయితే ఆ షిప్ లో ఉన్న సరుకు మీది కాదు కదా అయితే….కాకినాడ లో అవినీతి “ద్వారం” తెరుచుకుని 5 ఏళ్ళు అయింది…. కాకినాడ లో ఏ “ద్వారం” తట్టి అడిగినా చెప్తారు ఆ సరుకు ఎవరిదో….

  3. మీరు అధికారం లో వున్నప్పుడు ద్వారంపూడి చంద్రశేఖర్ చేసింది సంసారమా ?

  4. Why nani garu came in defense for Aurobindo…. if anchorage port has nothing to do with Aurobindo, it is supposed to be response of Aurobindo…. why ykaapa spokesperson is coming in between…..gummadikayala donga evvaru ante bhujalu thadumukuntunnaru

  5. తప్పు వీడిది కాదు లే భయ్యా .. వీడు పెద్ద ఎర్ర కనకాంబరం అని తెలిసి.. వీడి ముందు మైకులు పెట్టారు చూడు

Comments are closed.