అన్నీ అమ్ముకున్నానంటున్న జనసేన ఎమ్మెల్యే

రాజకీయాల్లోకి వచ్చి అన్నీ అమ్ముకున్నాను అని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. Advertisement తాను రాజకీయాల్లోకి రాకూడదు అనుకున్నానని ఆనాడు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి…

రాజకీయాల్లోకి వచ్చి అన్నీ అమ్ముకున్నాను అని విశాఖ దక్షిణ నియోజకవర్గం జనసేన ఎమ్మెల్యే వంశీకృష్ణ శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

తాను రాజకీయాల్లోకి రాకూడదు అనుకున్నానని ఆనాడు ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవి వల్లనే ప్రజారాజ్యంలో చేరి ఎమ్మెల్యేగా పోటీ చేశాను అని అన్నారు. తరువాత వైసీపీలో చేరి రాజకీయంగా అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నాను అన్నారు.

తన సొంత ఆసులు అరవై ఎకరాల భూమి తాను పోగొట్టుకున్నానని ఆయన అన్నారు. తాను రాజకీయాల్లోకి వచ్చి సంపాదించినది లేదని పోయినదే చాలా ఎక్కువగా ఉందని ఆయన అన్నారు.

ఇపుడు తన మీద విమర్శలు చేస్తున్నారని అవినీతి ఆరోపణలు చేస్తున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు ఒక్క విషయంలో తాను అక్రమాలు చేసినట్లుగా నిరూపించాలని ఆయన డిమాండ్ చేశారు.

తన జీవితం జనసేనలో బాగుందని రాజకీయంగా వైభోగం చూస్తున్నాను అని ఆయన అంటున్నారు. అయితే ఉన్న ఆస్తులు అమ్ముకుని సాధారణ జీవితం సాగిస్తున్న తన మీద ఆరోపణలు చేసిన వారు వాటిని నిరూపించాలని ఆయన కోరారు.

తన మీద చేసిన ఆరోపణలను చట్టపరంగా ఎదుర్కొంటాను అని వంశీ క్రిష్ణ అంటున్నారు.

6 Replies to “అన్నీ అమ్ముకున్నానంటున్న జనసేన ఎమ్మెల్యే”

Comments are closed.