తెలంగాణలో భారాస నుంచి ఫిరాయించి కాంగ్రెసులో చేరిన ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేసే విషయంలో స్తబ్ధతకు ఇంకా ఇంకా ఎక్కువ కాలం అవకాశం ఉండకపోవచ్చు. తాను కూడా రాజ్యాంగబద్ధ పదవిలోనే ఉన్న వ్యక్తిని గనుక.. తనను మరొక రాజ్యాంగ వ్యవస్థ శాసించజాలదని తెలంగాణ స్పీకరు తలపోయవచ్చు గాక. అలాగని సైలెంట్ గా ఇక ఎక్కువ కాలం కూర్చోలేని పరిస్థితి వచ్చింది.
అనర్హత పిటిషన్ల గురించి నిర్ణయం తీసుకోవడానికి హేతుబద్ధంగా అసలు ఎంత సమయం కావాలనే సంగతి వారంలోగా తమకు చెప్పాలని సుప్రీం కోర్టు తాజాగా ఆదేశించింది. ఇది బహుశా తెలంగాణలోని కాంగ్రెసు సర్కారుకు మింగుడుపడని వ్యవహారం కావొచ్చు. వారంలోగా స్పీకరు స్పందించాల్సి ఉంటుంది.
భారత రాష్ట్ర సమితి నుంచి పలువురు ఎమ్మెల్యేలు ఇప్పటికే అధికార కాంగ్రెసు పార్టీలో చేరిపోయినప్పటికీ.. కేవలం ముగ్గురి మీద అనర్హత వేటు వేయడం గురించి భారాస చాలా గట్టిగా పోరాడుతోంది. బిఆర్ఎస్ తరఫున గెలిచిన దానం నాగేందర్, తెల్లం వెంకట్రావు, కడియం శ్రీహరి విషయంలోనే గట్టిపోరాటం సాగుతోంది.
గతంలో ఇదే పిటిషన్ హైకోర్టులో సుదీర్ఘంగా నడిచింది. ఏకసభ్య ధర్మాసనం ఇచ్చిన తీర్పును డివిజన్ బెంచ్ కొట్టేసింది. అసెంబ్లీ స్పీకరు తగిన సమయంలోపు నిర్ణయం తీసుకోవచ్చునని డివిజన్ బెంచ్ నిర్దేశించింది. బిఆర్ఎస్ తరఫున ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి కూడా ఢిల్లీలోని ప్రముఖ న్యాయవాదులతో సుదీర్ఘ మంతనాల తర్వాత.. డివిజన్ బెంచ్ తీర్పును సవాలు చేస్తూ సుప్రీం కోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ దాఖలు చేసింది.
ఈ వ్యవహారాన్ని సుప్రీం కోర్టు చాలా సీరియస్ గా పరిగణిస్తున్నట్టు తాజా పరిణామాల వల్ల తెలుస్తోంది. ఆ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు స్పీకరు నోటీసులు ఇవ్వడానికి పది నెలలు పట్టిందా అంటూ.. సుప్రీం ధర్మాసనం తీవ్రంగా ఆక్షేపించడం విశేషం. మహారాష్ట్రలో లాగా.. పదవీకాలం ముగిసిపోయే దాకా అనర్హత పిటిషన్ పై నిర్ణయం తీసుకోకుడా నానుస్తారా అంటూ ఆగ్రహించడం గమనార్హం.
సుప్రీం కోర్టు నిర్దిష్ట సమయం ఏమిటో చెప్పకుండా.. స్పీకరు నిర్ణయం తీసుకోవడానికి సహేతుక సమయం తీసుకోవచ్చునని మాత్రమే చెప్పిందంటూ.. అసెంబ్లీ కార్యదర్శి తరఫు న్యాయవాది వాదించారు. సహేతుక సమయం అంటే మీ దృష్టిలో ఏమిటి? అంటూ న్యాయమూర్తులు ప్రశ్నించారు. రెండు వారాల్లోగా స్పీకరును అడిగి.. కార్యచరణ మొదలు పెట్టడానికి ఎంత సమయం కావాలో చెబుతానని న్యాయవాది చెప్పడంతో.. రెండు వారాలు కాదు.. ఒక్క వారంలోగా ఎంత సమయంలో కావాలో తేల్చి చెప్పాలని ఆదేశించారు. =
దీంతో.. తెలంగాణ స్పీకరు మౌనం వీడవలసిన అవసరం వచ్చేలా ఉంది. సుప్రీం ధర్మాసనానికి ఏదో ఒక విషయం చెప్పాలి. ఈ క్రమంలో పరిస్థితులు వికటిస్తే.. ఆ ముగ్గురు ఎమ్మెల్యేలపై అనర్హత వేటు కూడా తప్పకపోవచ్చునని పలువురు భావిస్తున్నారు.
Vc 919471199
Ala gaddi pettandi, veelu neetigaane vundaru
speaker will decide not SC
మ్మెల్యే ల అనర్హత విషయం జగన్ గారి అవినీతి కేసు తేలటానికి ఎంత టైం పడుతుందో అంత టైం పడుతుందని చెప్పేయడమే అన్ని సాక్ష్యాలు వున్న బాబాయ్ హత్య జరిగి ఇంత కాలమైనా కేసు తేలనప్పుడు ఇలాంటి సున్నిత విషయాలు ఎలాగా తేలుతాయి ఇది మన సర్వోన్నత న్యాయ స్తానం కూడా ఆలోచించాలి