దేశ వ్యాప్తంగా ఇవాళ్టితో సార్వత్రిక ఎన్నికలు ముగియనున్నాయి. సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ వెల్లడికానున్నాయి. ఈ నేపథ్యంలో అధికారంపై చాలా ధీమాగా ఉన్న కూటమి …ఎందుకనో ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై మాత్రం భయపడుతోంది. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎలా వుంటాయో ఎవరికీ తెలియదు. కానీ టీడీపీ నేతృత్వంలోని కూటమి ఎగ్జిట్ పోల్స్ వైసీపీకి అనుకూలంగా వుంటాయని భావిస్తోంది.
అందుకే ఎగ్జిట్ పోల్స్ ఫలితాలపై నెగెటివ్ ప్రచారానికి దిగడం గమనార్హం. ఎగ్జిట్ పోల్స్ శాస్త్రీయతపై ఎల్లో మీడియాలో చర్చకు పెట్టింది. ఎగ్జాట్ పోల్స్ ఫలితాలు మరో మూడు రోజుల్లో వెల్లడి కానున్న నేపథ్యంలో, ఎగ్జిట్ పోల్స్‌పై ఎందుకంత భయమో అర్థం కావడం లేదు. కూటమి భయం చూస్తుంటే.. ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఎగ్జాట్ పోల్స్‌పై ప్రభావం చూపుతాయన్నట్టుగా వుంది.
కనీసం ఎగ్జిట్ పోల్స్‌లో అయినా తాము గెలవాలని వైసీపీ కొన్ని సర్వే సంస్థల్ని మేనేజ్ చేసినట్టుగా వీకెండ్స్ పలుకాయన మీడియా తెగ ఆరోపణలు చేస్తోంది. మేనేజ్ చేసే విద్య చంద్రబాబుకు, టీడీపీ నేతలకు తెలిసినట్టుగా, మరెవరికీ తెలియదని జగమెరిగిన సత్యం. అలాంటప్పుడు తాత్కాలిక ఆనందం కోసం ఎగ్జిట్ పోల్స్‌ను వైసీపీ కొనుగోలు చేసి, ఏ ప్రయోజనం పొందుతుంది? అనే కనీస స్పృహ లేకపోవడం గమనార్హం.
వ్యవస్థల్ని మేనేజ్ చేసే తెలివితేటలు జగన్‌కు వుంటే, వైసీపీ పరిస్థితి మరోలా వుండేది. తాజాగా పోస్టల్ బ్యాలెట్లపై ఎవరిని ఎవరు మేనేజ్ చేశారో జనాన్ని అడిగితే చక్కటి సమాధానం దొరుకుతుంది. వ్యవస్థల్ని మేనేజ్ చేయడం చేతకాకపోవడం వల్లే కోర్టుల చుట్టూ వైసీపీ నేతలు ప్రదక్షిణలు చేస్తున్నారని ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.