టీచ‌ర్ల‌కేనా ఆత్మాభిమానం… మాకు లేదా?

ఉపాధ్యాయుల‌తో బ‌డుల్లో టాయిలెట్ల ఫొటోలు తీయించ‌డం ఏంటి? వాళ్ల ఆత్మాభిమానం కాపాడుతామ‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ అంది. ఆ బాధ్య‌త‌ల నుంచి టీచ‌ర్ల‌ను ప్ర‌భుత్వం త‌ప్పించింది. టీచ‌ర్ల ఆత్మాభిమానాన్ని కాపాడామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించుకుంది. టీచ‌ర్లు సంతోషించారు.…

ఉపాధ్యాయుల‌తో బ‌డుల్లో టాయిలెట్ల ఫొటోలు తీయించ‌డం ఏంటి? వాళ్ల ఆత్మాభిమానం కాపాడుతామ‌ని చంద్ర‌బాబు స‌ర్కార్ అంది. ఆ బాధ్య‌త‌ల నుంచి టీచ‌ర్ల‌ను ప్ర‌భుత్వం త‌ప్పించింది. టీచ‌ర్ల ఆత్మాభిమానాన్ని కాపాడామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించుకుంది. టీచ‌ర్లు సంతోషించారు. ఇదే సంద‌ర్భంలో ఆ బాధ్య‌త‌ల్ని గ్రామ స‌చివాల‌య ఎడ్యుకేష‌న్ ఉద్యోగుల‌తో పాటు మ‌రికొంద‌రికి అప్ప‌గిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులిచ్చింది.

ఈ నేప‌థ్యంలో గ్రామ‌, వార్డు స‌చివాల‌య ఉద్యోగులు ప్ర‌భుత్వంపై మండిప‌డుతున్నారు. త‌మ‌కు కూడా ఆత్మాభిమానం వుంద‌ని, టీచ‌ర్లు చేయ‌ని ప‌ని తామెందుకు చేస్తామంటూ వాళ్లంతా రివ‌ర్స్ అయ్యారు. ఈ మేర‌కు త‌మ నిర‌స‌న‌ను తెలియ‌జేస్తూ ప్ర‌భుత్వానికి విన‌తిప‌త్రం స‌మ‌ర్పించ‌డం గ‌మ‌నార్హం.

స్కూళ్ల‌లో టాయిలెట్ల ఫొటోలు తీయాల‌ని ప్ర‌భుత్వం జారీ చేసిన ఉత్త‌ర్వులు త‌మ ప్ర‌తిష్ట‌కు భంగం క‌లిగిస్తోంద‌ని ఏపీ విలేజ్‌, వార్డు స‌చివాల‌య స‌ర్వీస్ అసోసియేష‌న్ ప్ర‌తినిధులు పేర్కొన్నారు. ప్ర‌భుత్వానికి స‌మ‌ర్పించిన విన‌తిప‌త్రంలో ఈ విష‌యాన్ని తెలియ‌జేశారు.

ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో మ‌రుగుదొడ్ల ఫొటోలు తీయ‌డానికి ప్ర‌త్యేక ఏర్పాట్లు చేసుకోవాల‌ని ప్ర‌భుత్వానికి సూచించారు. టీచ‌ర్ల సంఖ్య ఎక్కువ ఉంద‌ని, వారి మెప్పు కోసం త‌మ ఆత్మాభిమానాన్ని దెబ్బ‌తీయ‌డం మంచిది కాద‌ని ప్ర‌భుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ప్ర‌భుత్వం మొండిగా వ్య‌వ‌హ‌రిస్తే వ్య‌తిరేక‌త ఎదుర్కోవాల్సి వ‌స్తుంద‌ని వారు హెచ్చ‌రించారు.

18 Replies to “టీచ‌ర్ల‌కేనా ఆత్మాభిమానం… మాకు లేదా?”

  1. మీకు దీని కాంటే పెద్ద పనేం లేదు.. కానీయండి.. బరువు , అవమానం అనుకుంటే రిజైన్ చేసి వెళ్లిపోవచ్చు.. లక్షల్ లో నిరుద్యోగులు వెయిటింగ్

    1. లేదు సర్ అదే లాజిక్ ప్రభుత్వ టీచర్స్ కి కూడా వర్తిస్తుంది కదా….మీరు అన్నట్టు గ్రామా వార్డు సచివాలయం లో వాళ్ళకి పని లేకపోయుండొచ్చు కానీ పని చేయించుకోవడం ప్రభుత్వం బాధ్యత….ఆలా కాకుండా వీరిలో కొంత మంది ని పరిశుద్య్యా విభాగం లో కి మార్చడమో దానికి అంటూ ఒక శాఖ పెట్టడమో చేసి వీళ్ళలో కొంతమంది ని అందులోకి పంపించి అప్పుడు చెయ్యకపోతే వెళ్లిపొమ్మని చెప్పొచ్చు

  2. లేదు సర్ అదే లాజిక్ ప్రభుత్వ టీచర్స్ కి కూడా వర్తిస్తుంది కదా….మీరు అన్నట్టు గ్రామా వార్డు సచివాలయం లో వాళ్ళకి పని లేకపోయుండొచ్చు కానీ పని చేయించుకోవడం ప్రభుత్వం బాధ్యత….ఆలా కాకుండా వీరిలో కొంత మంది ని పరిశుద్య్యా విభాగం లో కి మార్చడమో దానికి అంటూ ఒక శాఖ పెట్టడమో చేసి వీళ్ళలో కొంతమంది ని అందులోకి పంపించి అప్పుడు చెయ్యకపోతే వెళ్లిపొమ్మని చెప్పొచ్చు

  3. సచివాలయం అంటేనే గ్రామ స్వరాజ్యం కోసం పనిచేయడం…అంటే ప్రజలకు సేవ చేయడం…అందులో ఇవ్వన్నీ వస్తాయ్, మీరే కాదు మీరు చేస్తూ మీతో పాటు ప్రజలని మమేకం చేయాలి…అప్పుడే గ్రామాలు బాగుపడుతాయి, గ్రామాలు బాగు పడితే దేశమే బాగుపడుతుంది.

    సేవ చేయడానికి కూడా మీకు అంత కష్టం అయితే ఎలా….

    ఒక్కప్పుడు స్కూల్ పిల్లలే క్లీన్ అండ్ గ్రీన్ పేరుతో పల్లెల్లో వున్న చెత్త ఏతేవాళ్ళం….

  4. వీళ్ళకి జగన్ బుద్దులే వచ్చాయి,తొండ ముదిరితే ఊసరవెల్లి ,వీళ్ళు సిఎం గారిని అడిగే వాళ్లా

  5. ప్రభుత్వ ఉద్యోగులందరికీ నడ్డి విరిచే రోజు దగ్గరలోనే ఉంది. మరికొంచం ఓపిక పట్టండి.

  6. ఏం అర్హత/రికమండేషన్స్ తో కొలువులు పొందారో మర్చిపోయినట్లున్నారు.అవునులే,గత అవశేషాలు ఎక్కడకి పోతాయి సి.ఎం స్తాయికైనా పి.ఎం స్తాయికైనా వెళ్ళడానికైనా ఎగబడతారు. అవసరం అనుకుంటే (తొండి ముదిరితే), ఈ వ్యవస్థ అంతా మా వల్లే నడుస్తుందని చెప్పడానికి కూడా వెనుకాడని సంఘంలో (ఘడియల్లో) జనియించినవారు కదా.

    ఆ ఉద్యోగాలు పొందారో

  7. pani paata lekundaa eegalu tolukuntunnaru aa sachivalayamlo. meeku udhyogaalu unchadame ekkuva raa bosedks. anni moosukuni icchina pani cheyadam nerchukondi. asale jeetham dandaga batch meerantha.

  8. గ్రామ/వార్డ్ సచివాలయ ఉద్యోగులు ఎం పీకలేరు అని రాష్ట్రం మొత్తం తెలుసు.ఖాళీగా కూర్చొని 20 వేలు కు పైగా సొంత ఊర్లో తీసుకుంటున్నారు. 700 ఇల్లులు ఉండవు దానికి 6/7 సచివాలయ ఉద్యోగులు. వాళ్ళ విధులు, పనులు ఏంటో వాళ్లకె సరిగా తెలియవు.

  9. పంచాయితీలను బలపరచడం అంటే, గ్రామా సచివాలయాలు పని తగ్గటమే, వీళ్ళు కొత్త పనులు చెయ్యాలి, వేరే దారి లేదు.

Comments are closed.