ఆంధ్రప్రదేశ్‌లో మహిళలు, చిన్న పిల్లలపై అత్యాచారాలు చంద్రబాబు సర్కార్‌కు తలనొప్పిగా మారాయి. వరుస దుర్ఘటనల నేపథ్యంలో ఏపీ హోంశాఖ మంత్రి వంగలపూడి అనిత అసమర్థతపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో ఎక్కడైనా చిన్న సంఘటన జరిగినా అనిత తీవ్ర విమర్శలు గుప్పించేవాళ్లు. మరి ఇప్పుడు అనిత ఏం చేస్తున్నారనే ప్రశ్న ఎదురవుతోంది.
అనితకు టీడీపీలో కూడా శత్రువులు ఎక్కువే. అత్యాచార ఘటనలు ప్రభుత్వానికి చెడ్డపేరు తెస్తున్నాయని, హోంశాఖ మంత్రి అనిత పనితీరు బాగాలేదనే చర్చ టీడీపీలో మొదలైంది. ఇవన్నీ అనితలో అసహనం పెంచుతున్నాయి.
ఈ నేపథ్యంలో తిరుపతి జిల్లా వడమాలపేట మండలంలో మూడున్నరేళ్ల గిరిజన చిన్నారిపై హత్యాచారానికి పాల్పడడం సర్వత్రా వ్యతిరేకత ఎదురవుతోంది. బాధిత కుటుంబాన్ని పరామర్శించి, ప్రభుత్వం తరపున రూ.10 లక్షల ఆర్థిక సాయం అందజేయడానికి అనిత అక్కడికి వెళ్లారు. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ వైసీపీ నేతల తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
అత్యాచార ఘటనలను వైసీపీ నేతలు రాజకీయం కోసం వాడుకుంటున్నారని అనిత అన్నారు. ఆ పార్టీ నేతలు రాజకీయ రాబందుల్లా మారిపోయారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కామాంధులు రెచ్చిపోయిన ప్రతి చోటకు చేరి వారిపై అఘాయిత్యాలను తమకు అనుకూలంగా వాడుకోవాలని చూస్తున్నారని అనిత మండిపడ్డారు.
ఆడవాళ్లకు రక్షణ కల్పించడంలో ప్రభుత్వం విఫలమైందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అనిత ఆవేదనను అర్థం చేసుకోవచ్చు. అయితే వైసీపీ నేతలు రాజకీయంగా వాడుకునే అవకాశం ఇవ్వకుండా, తగిన రక్షణ చర్యలు తీసుకుంటే సరిపోతుంది కదా? అనే మాట వినిపిస్తోంది. కూటమి పాలనలో పోలీస్‌శాఖ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందనే విమర్శ లేకపోలేదు. అందుకే ఇలాంటి దుర్ఘటనలు చోటు చేసుకుంటున్నాయనే చర్చకు తెరలేచింది. కావున ప్రత్యర్థులు వెళ్లి రాజకీయాలు చేయకూడదంటే, ఎదురు దాడి చేయడం కాదు, రక్షణ చర్యలు చేపట్టాలని అనిత గ్రహిస్తే మంచిది.
ఆవిడే house arrestd అయి ఉంటారు. ఇంకా ఆమె కొత్తగా చేసేదేమి ఉంటుందిలే. She is just a spokesperson, not even behaving like an MLA
like vanitha you mean?
Call boy works 9989793850
Home minister is doing good job. Red Dogs crying as usual.
బాబాయ్ మర్డర్ కూడా అవకుండా చేసుకోవచ్చు కదా
నీలి నీచుడు జగన్ రెడ్డి గ్యాంగ్ చేసే అరాచకాలు ఆపితే అన్ని అత్యాచారాలు, హత్యలు , ఆర్థిక నేరాలు తగ్గుతాయి
vc available 9380537747
vc estanu 9380537747
Chandranna madyam erruliparisthu janalani pichivalani chesthe elane chestharu, govt failed