మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జినీ మ‌రిది అరెస్ట్‌

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల అరెస్టుల ప‌ర్వం కొన‌సాగుతోంది.

ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో వైసీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల అరెస్టుల ప‌ర్వం కొన‌సాగుతోంది. తాజాగా మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని మ‌రిది గోపిని ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. హైద‌రాబాద్‌లో వుంటున్న ఆయ‌న్ను ఇవాళ తెల్ల‌వారుజామున అదుపులోకి తీసుకుని విజ‌య‌వాడ‌కు త‌ర‌లిస్తున్నారు.

రాష్ట్రంలో కూట‌మి ప్ర‌భుత్వం ఏర్ప‌డిన తర్వాత ల‌క్ష్మీ బాలాజీ క్ర‌ష‌ర్స్ యాజ‌మాన్యం ఫిర్యాదుతో కేసు తెర‌పైకి వ‌చ్చింది. మాజీ మంత్రి విడ‌ద‌ల రజిని, ఆమె మ‌రిది, పీఏ త‌మ‌ను డ‌బ్బు కోసం బెదిరించార‌నేది ప్ర‌ధాన ఫిర్యాదు. ఈ ఫిర్యాదు మేర‌కు ఒక ఐపీఎస్ అధికారితో పాటు ర‌జిని, ఆమె చుట్టూ ఉన్న ముఖ్యుల‌పై కూడా కేసు న‌మోదైంది. ర‌జినీకి ముంద‌స్తు బెయిల్ ద‌క్కింది.

ఈ నేప‌థ్యంలో హైద‌రాబాద్‌లో వున్న విడ‌ద‌ల గోపిని అరెస్ట్ చేయ‌డం ప్రాధాన్యం సంత‌రించుకుంది. మ‌రీ ముఖ్యంగా చిల‌క‌లూరిపేట‌లో వైసీపీ కార్య‌క‌ర్త‌లు మొద‌లుకుని నాయ‌కుల‌పై వ‌రుస ఫిర్యాదులు, కేసులు, అరెస్ట్‌లు మితిమీరాయ‌న్న ప్ర‌చారం జ‌రుగుతోంది. కేసుల‌తో భ‌య‌భ్రాంతుల‌కు గురి చేయాల‌ని మాజీ మంత్రి, ప్ర‌స్తుత ఎమ్మెల్యే పుల్లారావు చాలా త‌ప్పులు చేస్తున్నార‌ని మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జిని ఇటీవ‌ల విమ‌ర్శ‌లు చేశారు.

మాజీ మంత్రి మ‌రిది అరెస్ట్‌తో ఆ నియోజ‌క‌వ‌ర్గంలో ఆగే ప‌రిస్థితి వుండ‌క‌పోవ‌చ్చు. మ‌రిన్ని అరెస్ట్‌లు జ‌రిగే అవ‌కాశం వుంద‌ని అంటున్నారు.

9 Replies to “మాజీ మంత్రి విడ‌ద‌ల ర‌జినీ మ‌రిది అరెస్ట్‌”

  1. ఏంటో .. మా జగన్ రెడ్డన్న కి ఆంధ్ర లో ప్రతి జైలు ఎక్కే గడప .. దిగే గడప అయిపొయింది బతుకంతా..

    ఈ మధ్య కొన్ని స్కిప్ కొట్టేస్తున్నాడు కూడా.. ఓపిక నశించినట్టుంది.. 

    ఇక ప్రతి వారం జైలు కి వెళ్లేందుకే ఆంధ్ర కి వస్తున్నట్టు జనాలకు కూడా అర్థమైపోయింది..

    జగన్ రెడ్డి వెళ్లలేక.. అంబటి ని పంపిస్తున్నాడు.. వాడేమో మైకుల ముందు సీమరాజ, కిరాక్ ఆర్పీ ని తిట్టుకుంటూ బతికేస్తున్నాడు ..

    ..

    మరి ఈ రజిని మరిది కూడా అందగాడేనా.. ఏమో మరి జగన్ రెడ్డి పరామర్శిస్తే.. అందగాడనే సర్టిఫికెట్ కూడా వస్తుంది..

      1. ఇలా నేను భారతి రెడ్డి గురించి మాట్లాడలేనా ..

        కానీ నాకు నీ అంత ఫ్రస్ట్రేషన్ లేదు.. ఆ అవసరం కూడా లేదు..

  2. 🔥 జగన్‌ను ప్రజలు ఓడించలేదు… నేరుగా చెంపదెబ్బ కొట్టారు!

    ఇది ఓ సాధారణ ఓటింగ్ ఫలితం కాదు బాస్…

    ఇది ప్రజల కోపం, అసహనం, అవమానానికి ఇచ్చిన ప్రతిస్పందన!

    👉 తల్లిని కోర్టుకి లాగిన వాడికి ప్రజలు గౌరవం చూపారా?

    👉 చెల్లిని అవమానపరిచిన వ్యక్తికి ఇంకెవరైనా అండగా నిలుస్తారా?

    ప్రజలు ఏం చేశారు తెలుసా?

    ఒక నిమిషం కూడా వెనక్కి చూసుకోకుండా, ఒక్క ఓటుతో నేరుగా గుద్దిన చెంపతాటు వేశారు.

    📉 151 నుంచి 11? ఇదెక్కడ ఓ సాధారణ ఓటు తేడా లా ఉంది?

    ఇది ఒక మౌన తిరుగుబాటు కాదు… ఇది ఓ గర్జన!

    ఓట్ల ద్వారా ప్రజలు జగన్‌కి చెప్పిన తుది తీర్పు: “జనం మాయలో పడే రోజులు ముగిశాయి!”

    ఇప్పుడు YCP పేరు వింటేనే జనం చిరాకుపడుతున్నారు.

    గ్రామాల్లో ఫ్లెక్సీలు లేవు, పట్టణాల్లో క్యాడర్ మాయం, నగరాల్లో ఆది అభిమానం మిగల్లేదు.

    💥 ఇది ఓటింగ్ కాదు…

    ఇది ప్రజల చేతిలో వాలిన అర్హత చెంపదెబ్బ.

    ఇది జగన్‌పై వేసిన ముద్ర – “ఇక ఈ వ్యక్తికి ముఖ్యమంత్రి పదవికి అర్హత లేదు!”

    #చెంపతాటు2024

    #తీవ్రతిరస్కారం

    #JaganRejected

    #SelfRespectVote

    #NeverAgainJagan

    #YSRCPGone

    #PublicSlap

    #AndhraDecided

Comments are closed.