విశాఖ స్టీల్ ప్లాంట్ విషయంలో కార్మికులు తగ్గేలా కనిపించడం లేదు. వారు ఒక వైపు ఉద్యమాలు చేస్తూనే మరో వైపు కూటమి నేతలను కలుస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ని ఇందులో భాగంగా ఉక్కు నేతలు కలసి ప్రైవేటు పరం కాకుండా చూడాలని కోరారు. విశాఖ ఉక్కుని కాపాడుకోవాలని వేలాది మందికి ప్రత్యక్షంగా ఉపాధిని కలిపిస్తున్న ప్లాంట్ ని రక్షించుకోవడంలో కేంద్రాన్ని ఒప్పించాలని కోరారు. ఈ విషయాలు విన్న పవన్ కేంద్రంతో అన్ని చర్చిస్తామని తెలిపారు.
విశాఖ ఉక్కు కోసం చేసిన త్యాగాలను మరచిపోవద్దని ఆయన కోరారు. పరిశ్రమను కాపాడుకోవాలనే భావోద్వేగం కార్మికులు, ఉద్యోగులు, అలాగే కార్మిక సంఘాల్లో ఉండాలని పవన్ సూచించినట్లుగా చెబుతున్నారు.
విశాఖ ఉక్కు విషయంలో బీజేపీకి చెందిన సీనియర్ నేత, సైల్ ఇండిపెండెంట్ డైరెక్టర్ కాశీరాజు కూడా మరో వైపు రంగంలోకి దిగారు. సైల్ లో విశాఖ ఉక్కుని విలీనం చేయాలని ప్రతిపాదిస్తూ ఆయన కేంద్రానికి లేఖ రాశారు. విశాఖ ఉక్కు విషయంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంటే అన్ని వర్గాలు హర్షిస్తాయని అంటున్నారు.
ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ నెల 7న ఢిల్లీలో పర్యటించనున్నారు. ఆయన విశాఖ ఉక్కు మీద మాట్లాడాలని కార్మిక సంఘాలతో పాటు కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. సాధ్యమైనంత తొందరలోనే విశాఖ ఉక్కు సమస్య పరిష్కారం చేయాలని బీజేపీ నేతలు చూస్తున్నారు.
సెయిల్ లో విశాఖ ఉక్కు విలీనం కోసం వారు ప్రయత్నం చేస్తూంటే విశాఖను సొంతంగానే నడపాలని మరో డిమాండ్ వస్తోంది. పవన్ కళ్యాణ్ ఈ విషయంలో కేంద్రాన్ని ఒప్పిస్తారా లేక బీజేపీ నేతలు స్థానికంగా తామే సెయిల్ లో విలీనం చేయించామని చెప్పుకుంటారా అన్నదే అంతా తర్కించుకుంటున్న విషయం.
జగన్ రెడ్డి కొట్టేసిన డబ్బు రాబడితే ఇలాంటి ప్లాంట్లు జిల్లాకి ఒకటి పెట్టొచ్చు
Call boy works 9989793850
లక్షలు కొట్లు సంక్షేమ పథకాలు అమలు చేసిన జగనన్న ఎందుకు కొనలేదు?
vc estanu 9380537747
vc available 9380537747
Last five years Manam matram Ami cheyalekapoyam just asking