రాజు గారికి ఏమి కావాలి?

రాజు గారు ఎందుకు ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? ఆయనకు ఏమి కావాలి అన్నది కూడా పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారట.

బీజేపీ తరఫున రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలవడం విశాఖ నార్త్ సిట్టింగ్ ఎమ్మెల్యే విష్ణు కుమార్ రాజు చేసుకున్న అదృష్టమే అని చాలా మంది భావిస్తారు. ఈ రెండు సార్లూ ఆయన పొత్తులతోనే గెలిచారు. బీజేపీలో సీనియర్లు ఎంతో మంది ఉన్నప్పటికీ, 2014లోనూ 2024లోనూ ఆయన బీజేపీ శాసనసభ పక్ష నాయకుడిగా ఎంపికయ్యారు.

అయితే 2024లో గెలిచాక ఆయనలో మంత్రి పదవి మీద ఎక్కడో ఆశలు మొలిచాయని అంటారు. ఆయనకు ఆశ ఉండడం తప్పు కాదు కానీ, బీజేపీ నాయకత్వం మొదటి నుంచి పార్టీలో సీనియర్‌గా ఉంటూ వచ్చిన సత్యకుమార్ యాదవ్‌కు మంత్రి పదవి ఇచ్చింది.

దాంతో, రెండు సార్లు గెలిచిన ఎమ్మెల్యేగా తనకు అవకాశం దక్కలేదని కొంత అసంతృప్తితో ఉన్నారని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో విష్ణు కుమార్ రాజు లేటెస్ట్‌గా విశాఖ ఉక్కు కార్మికులపై హాట్ కామెంట్స్ చేశారు. కేంద్రం బ్రహ్మాండమైన ప్యాకేజీ ప్రకటించినా, కార్మికులకు ఆశలకు అంతు లేదని ఆయన వ్యాఖ్యానించారు. నచ్చకపోతే వీఆర్ఎస్ తీసుకుని రాజీనామా చేయండి అంటూ ఘాటుగా మాట్లాడారు.

ఇప్పుడు ఈ విషయం పెద్ద వివాదంగా మారింది. ఉక్కు కార్మిక సంఘాలు ఈ వ్యాఖ్యలపై పెద్ద ఎత్తున స్పందిస్తూ, బీజేపీ మరియు కేంద్ర ప్రభుత్వంపై విమర్శల దాడి చేస్తున్నారు. వాస్తవానికి, ప్యాకేజీ వల్ల పెద్దగా ఒరిగేదేమీ లేదని ప్రజా సంఘాలు కూడా అంటున్నాయి.

ఉక్కు కార్మికులు తమ అభిప్రాయాలను వ్యక్తం చేసుకోవడానికి హక్కు ఉంది. కానీ, వారి పై ఈ విధంగా రాజు గారు కామెంట్స్ చేయడం వివాదాన్ని మరింత ముదిరేలా చేసింది. దీనితో, రాజు గారి తీరు, నోరు మీద బీజేపీ హైకమాండ్ ఆరా తీస్తోందని ప్రచారం సాగుతోంది.

రాజు గారు ఎందుకు ఈ విధంగా స్టేట్మెంట్స్ ఇస్తున్నారు? ఆయనకు ఏమి కావాలి అన్నది కూడా పార్టీ పెద్దలు పరిశీలిస్తున్నారట. గతంలో రాజు గారు బీజేపీ కోటాలో ఎక్కువగా మంత్రి పదవులు కావాలని కోరారు. అయితే, మీడియా ముందు సహనంతో మాట్లాడితే బాగుంటుంది అని అంటున్నారు. లేకపోతే కమలం పార్టీలో ఆయనకు ఇబ్బందులు తప్పవని భావిస్తున్నారు.

5 Replies to “రాజు గారికి ఏమి కావాలి?”

  1. ప్లే బాయ్ వర్క్ :- ఏడు తొమ్మిది, తొమ్మిది, ఏడు, ఐదు, ఐదు, ఒకటి, సున్నా, సున్నా, నాలుగు

  2. తొమ్మిది, సున్నా,ఒకటి, తొమ్మిది, నాలుగు, ఏడు, ఒకటి, ఒకటి, తొమ్మిది, తొమ్మిది వీసీ

Comments are closed.