వైసీపీ యువ నాయ‌కుడు ఎక్క‌డ‌?

వైసీపీ యువ నాయ‌కుడు బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి అస‌లు క‌నిపించ‌డం లేదు. వైసీపీ హ‌యాంలో శాప్ చైర్మ‌న్ ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. సిద్ధార్థ్‌కు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నందికొట్కూరులో బైరెడ్డి దెబ్బ‌కు…

వైసీపీ యువ నాయ‌కుడు బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి అస‌లు క‌నిపించ‌డం లేదు. వైసీపీ హ‌యాంలో శాప్ చైర్మ‌న్ ప‌ద‌విని ద‌క్కించుకున్నారు. సిద్ధార్థ్‌కు వైసీపీ అధినేత వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డి అధిక ప్రాధాన్యం ఇచ్చారు. నందికొట్కూరులో బైరెడ్డి దెబ్బ‌కు నాటి ఎమ్మెల్యే ఆర్ధ‌ర్ రాజ‌కీయంగా దెబ్బ‌తిన్నారు. వైసీపీ అధికారం పోయిన త‌ర్వాత బైరెడ్డి సిద్ధార్థ్ పెద్ద‌గా క‌నిపించ‌డం లేద‌న్న చ‌ర్చ ఆ పార్టీలోనే జ‌రుగుతోంది.

ఎన్నిక‌ల‌కు ముందు సిద్ధార్థ్ టీడీపీలో చేరుతార‌ని పెద్ద ఎత్తున ప్ర‌చారం జ‌రిగింది. ఎట్టి ప‌రిస్థితుల్లోనూ వైసీపీని వీడేది లేద‌ని బైరెడ్డి తేల్చి చెప్పారు. అయితే రాజ‌కీయ నాయ‌కుల మాట‌ల్ని పెద్ద‌గా పట్టించుకోవాల్సిన అవ‌స‌రం వుండ‌దు. పరిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు రాజ‌కీయ నాయ‌కులు అభిప్రాయాల్ని మార్చుకుంటుంటారు. వారు కూడా పార్టీలు మారుతుంటారు.

వైసీపీ అధికారం కోల్పోవ‌డం, ఆయ‌న సోద‌రి శ‌బ‌రి నంద్యాల ఎంపీ కావ‌డంతో స్పీడ్ త‌గ్గించార‌నే చ‌ర్చ జ‌రుగుతోంది. అయితే వైసీపీకి దూర‌మ‌య్యే అవ‌కాశం వుండ‌ద‌ని ఆయ‌న అనుచ‌రులు చెబుతున్నారు. కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరి నాలుగు నెల‌లే కావ‌డంతో అప్పుడే రాజ‌కీయ పోరాటం ఎందుకులే అనే ఆలోచ‌న‌తో బైరెడ్డి సొంత ప‌నుల్లో నిమ‌గ్నం అయ్యార‌ని తెలిసింది.

నందికొట్కూరు నియోజ‌క‌వ‌ర్గంలో బైరెడ్డి వ్య‌వ‌హార శైలి న‌చ్చ‌క‌, ఇప్ప‌టికే చాలా మంది ఇత‌ర పార్టీల్లోకి వెళ్లార‌ని స‌మాచారం. కానీ ప్ర‌భుత్వంపై వ్య‌తిరేక‌త త‌మ‌కు సానుకూల‌త‌గా మారి, తిరిగి అధికారంలోకి వ‌స్తామ‌నే ధీమా వైసీపీ నేత‌ల్లో క‌నిపిస్తోంది. యువ‌నేత బైరెడ్డి యాక్టీవ్ అయితే మాత్రం, సోష‌ల్ మీడియాలో ఆయ‌నే క‌నిపిస్తారు.

18 Replies to “వైసీపీ యువ నాయ‌కుడు ఎక్క‌డ‌?”

  1. వైసీపీ యువ నాయకురాలు..

    వైసీపీ ఫైర్ బ్రాండ్..

    వైసీపీ ఆరాధ్య దైవం..

    శ్రీ రెడ్డి కూడా కనపడటం లేదనుకుంటా…

    ఇక్కడ వీడు కనపడటం లేదు.. అక్కడ అదీ కనపడటం లేదు.. ఇద్దరూ యెలహంక పాలస్ లో ఉన్నారేమో..

      1. ఫ్రస్ట్రేషన్.. 11 కి పడిపోయారు కదా.. ఇక బతుకు లేదని అర్థమయిపోయినట్టుంది..

  2. ప్రియమైన లోకనాథరావు గారు, మీ ఆరోగ్యం ఎలా ఉంది? నేను చాలా సార్లు చెప్పినట్లు, మీరు మీ ఆరోగ్యం గురించి సరిగా పట్టించుకోకుండా కాపు, కమ్మ కులాల మీద ఆవేశం, ద్వేషంతో మునిగిపోయారు. మీరు ఎప్పుడూ కులం, కులం, కులం అనే ద్వేషపూర్వక చర్చలే చేస్తుంటారు. ఇది మీ మెదడులో అతి ద్వేషాన్ని నింపి, అది మీ హృదయం, మానసిక స్థితిపై ప్రతికూల ప్రభావం చూపుతోంది. కుల ద్వేషాన్ని ప్రోత్సహించడం వల్ల మీకు ఏం లాభం? ఈ వ్యూహం మీకు తీవ్రంగా వ్యతిరేకంగా పనిచేసింది. మీలాంటి వారు, రంగనాథ్ లాంటి వారు ఎప్పుడూ కమ్మ, కాపు కులాలపై ద్వేషం పెంచుకోవడం వలన మీ ఆరోగ్య సమస్యలు, గుండెపోటులు వచ్చాయి. ఇన్ని ఆరోగ్య సమస్యలు ఉన్నప్పటికీ, ఇంకా మీ అసభ్యకరమైన స్వభావంతో కొనసాగుతూనే ఉన్నారు. అత్యధిక ప్రజలు జగన్మోహన్ రెడ్డిని ద్వేషించి కేవలం 11 సీట్లు మాత్రమే ఇచ్చారు 175 స్థానాల నుండి. మీకు సిగ్గు లేదా? మీ జీవితాంతంలో ఈ కుల ద్వేషం ప్రోత్సహించడం అనే అర్థరహిత పని ఎందుకు? మీరు నిజంగా సీరియస్‌గా ఆలోచించాలి. మంచి విద్య పొంది కూడా మీకు సిగ్గు లేదా?

    1. ఏంది బ్రదర్ వాడంటే మీకు అంటే పేమా… వాడో లత్కోర్ లపంగి మగసరసాలతో అలరారే ప్రకృతి విరుద్ధంగా బతికేటోడు.. వాడి గురించి అంత పెద్ద పెద్ద పేరాలు అవసరమా

Comments are closed.