వైఎస్సార్‌, కేవీపీ తిక్కోళ్లు.. జ‌గ‌న్‌, స‌జ్జ‌ల తెలివైనోళ్లు!

త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై భ‌యం లేకుండా, స‌జ్జ‌ల ఎందుక‌ని జ‌గ‌న్‌కు ప్ర‌యోజ‌నం క‌లిగేలా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాలి.

వైఎస్సార్‌సీపీలో సజ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి కీల‌క నాయ‌కుడు. మ‌రీ ముఖ్యంగా వైఎస్ జ‌గ‌న్‌మోహ‌న్‌రెడ్డికి ప్ర‌ధాన స‌ల‌హాదారుడు. తిడితే తిట్టించుకోడానికి, కొడితే కొట్టించుకోడానికి సిద్ధ‌ప‌డే వాళ్లు మాత్ర‌మే జ‌గ‌న్ వ‌ద్ద గ‌ట్టిగా నిల‌బ‌డుతార‌నే చ‌ర్చ వైసీపీలో అంత‌ర్గ‌తంగా వుంది. జ‌గ‌న్ ఏం చేసినా ఏళ్ల‌త‌ర‌బ‌డి ప‌డుతూ వ‌చ్చిన ఒకాయ‌న‌, ఈ మ‌ధ్యే పార్టీని వీడారు. మ‌రొకాయ‌న మాత్రం వైసీపీని, జ‌గ‌న్‌ను గ‌బ్బిలం మాదిరిగా గ‌ట్టిగా వాటేసుకున్నారు.

కుక్క చేసే ప‌ని కుక్క‌, గాడిద చేసే ప‌ని గాడిద చేయాల‌ని పెద్ద‌లు ఊరికే చెప్ప‌లేదు. కానీ వైసీపీలో కుక్క చేయాల్సిన ప‌ని గాడిద‌, అది చేయాల్సిన ప‌ని కుక్క చేస్తున్న‌ట్టుగా, ఇత‌ర ప‌నులు చేస్తుంటార‌ని సొంత పార్టీ నేత‌లే అంటుంటారు. విమ‌ర్శ‌లు వ‌స్తే, వాటిని సానుకూలంగా తీసుకుని, అధినాయ‌కుడి శ్రేయస్సు కోరి నీడ‌లా వుండే వారు మ‌స‌లుకుంటుంటారు. కానీ స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి మాత్రం ఇందుకు మిన‌హాయింపు.

స‌జ్జ‌ల రామ‌కృష్ణారెడ్డి తీరుతోనే జ‌గ‌న్‌కు, వైసీపీకి నాయ‌కులు, కార్య‌క‌ర్త‌లు దూర‌మ‌య్యార‌నే అభిప్రాయం బ‌లంగా వుంది. గ‌తంలో వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డి త‌న ఆత్మ‌గా కేవీపీ గురించి చెప్పారు. ఏనాడూ కేవీపీ మీడియా ముందుకు రావ‌డాన్ని చూడ‌లేదు. కానీ వైఎస్సార్ మ‌న‌సెరిగి కేవీపీ పార్టీని, ప్ర‌భుత్వాన్ని బ్యాలెన్స్ చేస్తూ, ప‌నుల్ని చ‌క్క‌బెట్టేవారు. విమ‌ర్శ‌ల్ని కేవీపీ తీసుకుని, మంచి ప‌రంతా వైఎస్ రాజ‌శేఖ‌ర‌రెడ్డికే ద‌క్కేలా కేవీపీ వ్య‌వ‌హ‌రించారు.

వైఎస్సార్‌కు కేవీపీ ఎలా ప‌ని చేశారంటే.. చెట్టు కార్బ‌న్‌డైఆక్సైడ్‌ను పీల్చుకుని, మాన‌వాళి బ‌తికేందుకు అవ‌స‌ర‌మైన ఆక్సిజ‌న్‌ను ఇచ్చిన‌ట్టుగా. మ‌రి వైఎస్ జ‌గ‌న్ విష‌యంలో ఏం జ‌రుగుతున్న‌దో అంద‌రూ చూస్తున్నారు. త‌మ‌పై నెగెటివిటీని జ‌గ‌న్‌పై తోసేసి, ఆయ‌న‌కు కార్య‌క‌ర్త‌లు, నాయ‌కులు దూర‌మ‌య్యేలా స‌జ్జ‌ల వ్య‌వ‌హారం వుంద‌నే ఆరోప‌ణ‌ల్ని కొట్టి పారేయ‌లేం.

ఇదేమంటే, జ‌గ‌న్ ఆదేశాల మేర‌కే స‌జ్జ‌ల మీడియా ముందుకు వ‌చ్చార‌ని స‌మ‌ర్థించుకుంటున్నారు. స‌ల‌హాదారుడి ప‌నేంటి? అయ్యా ప్ర‌జ‌లు మిమ్మ‌ల్ని ఎన్నుకున్నారు, ఏదైనా వుంటే మీరే వాళ్ల‌తో మాట్లాడుకుంటే బాగుంటుంద‌ని స‌జ్జ‌ల స‌ల‌హా ఇచ్చి వుండాలి. జ‌గ‌న్‌ను ఎన్నుకుంటే, స‌జ్జ‌ల పాలిస్తున్నాడేంద‌బ్బా అనే అసంతృప్తి నెమ్మ‌దిగా జ‌నంలో నాటుకుని, ఐదేళ్ల‌కు వ్య‌తిరేక‌త అనే మ‌హావృక్షంగా మారింది. అదే వైసీపీని రాజ‌కీయంగా కూక‌టి వేళ్ల‌తో స‌హా పెక‌లించేలా చేసింద‌న్న‌ది వాస్త‌వం.

రాజ‌కీయాల్లో ఓట‌మితో ఎవ‌రైనా గుణ‌పాఠం నేర్చుకుంటుంటారు. కానీ వైసీపీ విష‌యంలో అది మాత్రం జ‌ర‌గ‌డం లేదు. స‌జ్జ‌లే స‌క‌లం అనే సంకేతాల్ని వైసీపీ పంపుతోంది. దీనివ‌ల్ల రాజ‌కీయంగా న‌ష్ట‌పోతామ‌ని ఆ పార్టీ గ్ర‌హించ‌డం లేదు. వాస్త‌వాల్ని చెప్పే వాళ్ల‌ను త‌మ వ్య‌తిరేకులుగా స‌జ్జ‌ల, ఆయ‌న పెంచుకుంటున్న టీమ్ ఆగ్ర‌హిస్తోంది. ఈ ధోర‌ణితో న‌ష్ట‌పోయేది జ‌గ‌నే. స‌జ్జ‌ల‌కు పోయేదేమీ లేదు.

వైఎస్ జ‌గ‌న్‌, స‌జ్జ‌ల తీరు చూస్తుంటే, ద‌శాబ్దాల త‌ర‌బ‌డి రాజ‌కీయాలు చేసిన వైఎస్సార్‌, కేవీపీ తిక్కోళ్లు. వైఎస్సార్ కార్యాల‌యానికి పరిమిత‌మై, అయిన‌దానికి కానిదానికి కేవీపీని పంపించ‌కుండా ఘోరం, నేరం చేశార‌ని అర్థం చేసుకోవాలేమో. వైఎస్సార్‌సీపీ నాయ‌కులు, కార్య‌క‌ర్త‌ల అభిమ‌తం మేరకు… వైఎస్సార్‌కు కేవీపీలా, తాను జ‌గ‌న్‌కు ఆ ర‌కంగా ప‌ని చేస్తే, పార్టీలో ప‌ట్టు పోతుంద‌ని స‌జ్జ‌ల భ‌య‌ప‌డుతున్న‌ట్టున్నారు. కేవ‌లం వైసీపీలో త‌న ప‌ట్టు నిలుపుకోడానికి కూచున్న కొమ్మ‌నే న‌ర‌క‌డానికి కూడా స‌జ్జ‌ల వెనక‌డుగు వేయ‌లేదనే చ‌ర్చ‌కు తెర‌లేచింది.

త‌న రాజ‌కీయ భ‌విష్య‌త్‌పై భ‌యం లేకుండా, స‌జ్జ‌ల ఎందుక‌ని జ‌గ‌న్‌కు ప్ర‌యోజ‌నం క‌లిగేలా వ్య‌వ‌హ‌రించ‌డం లేద‌నే ప్ర‌శ్న‌కు స‌మాధానం చెప్పాలి. ఇప్ప‌టికీ సిగ్గులేకుండా స‌జ్జ‌ల త‌న వైఖ‌రిని స‌మ‌ర్థించుకునేలా ప్ర‌వ‌ర్తిస్తున్నార‌ని వైసీపీ శ్రేణులు తిట్టిపోస్తున్నాయి. తిట్ల‌ను, చీత్కారాల‌ను ప‌ట్టించుకునే సున్నిత‌త్వం స‌జ్జ‌ల‌లో వుంటే, జ‌గ‌న్ వ‌ద్ద ఇంత‌కాలం ఎలా వుంటాడ‌నే వైసీపీ సీనియ‌ర్ నాయ‌కురాలి ప్ర‌శ్న ఆలోచించ‌జేసేలా వుంది.

29 Replies to “వైఎస్సార్‌, కేవీపీ తిక్కోళ్లు.. జ‌గ‌న్‌, స‌జ్జ‌ల తెలివైనోళ్లు!”

  1. ఇంతకీ వైసీపీ లో నువ్వు రాసిన ప్రకారం గాడిద ఎవరు? కుక్క ఎవరు?

  2. వైస్సార్,కేవీపీ తెలివిగలవాడు కాబట్టి అలా నెట్టుకొచ్చారు….మరి ఇప్పుడో ఫస్ట్ క్లాసు తెలివి…ఇలాగే ఉంటుంది మరి

  3. నువ్వు చెప్పొచ్చేది ఏమిటి అంటే ….ప్రభుత్వ నిర్ణయాలు సీఎం లేదా మంత్రి ప్రజలకు తెలియచెయ్యాలిఅని, ఒక సలహాదారు చెప్తే కాని తెలుసుకోలేనివాడు సీఎం గా చేసాడు అంటావ్ అంతేగా

  4. జగన్ గారు సజ్జల గారు ఆడించే కీలు బొమ్మ…. 2019-24 మధ్య ఆంధ్ర రాష్ట్రానికి ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్నది జగన్ గారే అయినా, అధికారాల్ని సజ్జల గారు వెలగబెట్టారు……. జగన్ 2.O వస్తుంది అంటున్నారు ప్రతి సమావేశంలో…. ఆ స్క్రిప్ట్ కూడా సజ్జల గారిదే నిజానికి అది సజ్జల 2.o నే….

  5. ఆహా.  రాజ్యంగా వ్యవస్థలను కోయద్రోసి మీరు చేసిన అరాచకాల వలలు మీరు ఓడిపోయారు ఓటమికి సజ్జల ఎలా కారణం .ఇదే సజ్జల 2014 లో కూడా ఉన్నాడు. 19 లో ఉన్నాడు 

    1. అరే అయ్యా నీకు అసలు విషయం అర్దం కావట్లేదు అనుకుంట, వైఎస్ఆర్ లా మీ జగన్ తెలివైన వాడు అయితే కేవీపీ లా సజ్జలా కూడా తెర వెనుక ఉండేవాడు, కానీ వీడు అజ్ఞాని అసమర్దుడు దద్దమ్మ అవటం వలన కొంతలో కొంతైనా దాన్ని కప్పిపుచ్చడానికి సజ్జల ప్రయత్నిస్తున్నాడు, అతనికి మీరు మీ పార్టీ రుణపడి ఉండాలి

  6. కేవీపీ కి ఎలా ఏమి చెయ్యాలో వైస్సార్ పూర్తిగా గైడ్ చేసి ఉన్నారేమో, ఎందుకంటే వైస్సార్ పోయిన తర్వాత కేవీపీ ఎప్పుడూ పరిపక్వత తో మాట్లాడ్డం ఎప్పుడూ చూడలేదు.

  7.  జెగ్గులు, సజ్జలు బెడ్ మేట్స్ అని టాకు ..సజ్జల్ దగ్గర ప్యాలెస్ బ్లూ చీకటి ఎవ్వారాలు pen drive లో చాలా ఉన్నాయ్ అట.. అందుకే   ఓడించినా,  సచ్చినట్టు సజ్జలే సర్వస్వం అంటున్న జెగ్గులు 

  8. ఇప్పుడు అర్జెంటుగా సజ్జలు నీ తొలగించి, ఆ పోస్ట్  ను Ys విజయమ్మ కి నమ్మక ద్రోహం చేసిన గ్రేట్ ఆంద్ర వెంకట్ రెడ్డిగారు కి ఇవ్వాలి. ఇందుకే ఈ ఏడుపు అంతా.

  9. ఏతా వాతా చెప్పేది ఏంటి అంటే, 11 రెడ్డికి ఏమి తేలేదు పక్కన జాకీ లు వేసి లేపాలి, గిల్లితే గిల్లించు కోవాలి మారం చేస్తే బ్రతిమాలాలి . మనిషి పెరిగాడు కానీ బుద్ధి పెరగలే 1St class student ki

  10. జగన్ రెడ్డి అట్టర్ ప్లాప్ పరిపాలనకు సజ్జల ని భాద్యుడిని చేసేసి.. జగన్ 2.0 కి బాటలు వేసుకొంటున్నారు..

    ప్లాన్ బాగానే ఉంది గాని.. జగన్ 1.0 వల్ల నాశనమైపోయిన జీవితాలు.. ఇంకా జగన్ రెడ్డి ని నమ్మే అవకాశాలున్నాయా అనేదే అనుమానం..

  11. పాత సినిమాల్లో బుర్ర లేని రాజా కుమారుడు పాత్రలు వేసే రేలంగి లాగా, 

    జగన్ కూడా సొంత బుర్ర లేకుండా పక్కనే వందిమాఘదుల సహాయంతో నెట్టుకొచ్చాడు అని నిరూపణ చేశావు.

  12. జగన్ అనే వాడికి సొంత బుర్ర లేదు.

    అయినా పరవాలేదు. కానీ వాడికి

     మంచి బుద్ధి కూడా లేదు. అంత దుర్మార్గం గాడు. శాడిస్ట్, సైకో. 

    1. సొంత చిన్ననా నీ లేపేసారు అని వివేక కూతురే ఆరోపణ చేశారు. 

      అంటే కాక సొంత తండ్రో చనిపోయి తే, వెతకడానికి వెళ్ళలేదు. 

      సొంత తల్లి , చెల్లి మీద ఆస్తులు కోసం కే*సు పెట్టిన పరమ సన్నా*సి .

      అటువంటి వెద*వ కి ఈ వెబ్సై*ట్ బా*నిసత్వం చేయడం

       

  13. అరే అయ్యా నీకు అసలు విషయం అర్దం కావట్లేదు అనుకుంట, వైఎస్ఆర్ లా మీ జగన్ తెలివైన వాడు అయితే కేవీపీ లా సజ్జలా కూడా తెర వెనుక ఉండేవాడు, కానీ వీడు అజ్ఞాని అసమర్దుడు దద్దమ్మ అవటం వలన కొంతలో కొంతైనా దాన్ని కప్పిపుచ్చడానికి సజ్జల ప్రయత్నిస్తున్నాడు, అతనికి మీరు మీ పార్టీ రుణపడి ఉండాలి

Comments are closed.