శ్రీకాకుళం జిల్లా రాజకీయాలలో సామాజిక సమీకరణలను మార్చాలని వైసీపీ చేసిన ప్రయత్నాలూ ప్రయోగాలూ చాలానే ఉన్నాయి. అయితే దశాబ్దాలుగా పాతుకుపోయిన ఒక బలమైన సామాజిక వర్గానికి చెందిన రెండు కుటుంబాల ముందు అవి ఏ మాత్రం సాగలేదు.
టీడీపీలో నాలుగున్నర దశాబ్దాలుగా కింజరాపు కుటుంబం కుదురుకుంటే కాంగ్రెస్ వయా వైసీపీగా ధర్మాన కుటుంబం గట్టిగా నిలబడిరది. వెలమ సామాజికవర్గానికి చెందిన ఈ రెండు కుటుంబాలదే జిల్లాలో రాజకీయ ఆధిపత్యం.
కాంగ్రెస్ వర్సెస్ టీడీపీగా ఉన్న కాలంలో ఒకరు అదికార పక్షం మరొకరు ప్రతిపక్షంగా ఉండేవారు. ఇపుడు వైసీపీ వర్సెస్ టీడీపీగా సాగుతోంది. అయిదే ధర్మాన సోదరులలో మాజీ మంత్రి ప్రసాదరావు సందడి చేయడంలేదు. కృష్ణదాస్ హడావుడి తగ్గింది.
దాంతో వైసీపీ కాళింగ సామాజికవర్గాన్ని నమ్ముకున్నా మాజీ స్పీకర్ తమ్మినేని సీతారామ్ అలక పానుపు ఎక్కారు. అదే సామాజికవర్గానికి చెందిన ఎమ్మెల్సీ దువ్వాడ శ్రీనివాస్ దూకుడు మైనస్‌గా మారింది. దాంతో జిల్లాలో అతి కీలకమైన సామాజికవర్గంగా ఉన్న తూర్పు కాపులనే వైసీపీ నమ్ముకుంటోంది.
దివంగత మాజీ ఎంపీ పాలవలస రాజశేఖరం కుటుంబమే ఇపుడు వైసీపీకి అండ దండగా ఉంది. మాజీ ఎమ్మెల్యే రెడ్డి శాంతి రాష్ట్ర స్ధాయిలో కీలకమైన క్రమశిక్షణా సంఘం సభ్యురాలిగా చేసిన వైసీపీ ఆమె సోదరుడు ఎమ్మెల్సీ విక్రాంత్‌ను జిల్లాలో మరింత కీలకం చేయనున్నారని తెలుస్తోంది.
Neutral media ki kulam leka pote article kuda rayatam radu
జాయిన్ కావాలి అంటే
na SClu na STlu yemipoyaru reddy?
వాళ్ళకి కూడా మన అన్న పార్టీ నే దిక్కు లెండి…..
రేపో మాపో మూసుకునేదానికి హడావుడి అవసరమా అని వైసీపీ లీడర్లు అనుకుంటున్నారు