ప్రచారం కోసమే లీగల్ నోటీసు

ఇన్ని నెలల తర్వాత ఆమె నాకు నోటీసులు పంపించడం ఆశ్చర్యంగా ఉంది

నటి హేమ మరోసారి వార్తల్లోకెక్కిన సంగతి తెలిసిందే. గతంలో తన పరువుకు భంగం కలిగించే విధంగా వ్యవహరించారని ఆరోపిస్తూ, కరాటే కల్యాణికి ఆమె లీగల్ నోటీసు పంపించారు. దీనిపై తాజాగా కరాటే కల్యాణి స్పందించారు.

“ఇన్ని నెలల తర్వాత ఆమె నాకు నోటీసులు పంపించడం ఆశ్చర్యంగా ఉంది. మీడియాలో ఎటెన్షన్ తగ్గింది, తన పేరు వినిపించాలనే ఉద్దేశంతో, నేనైతే కరెక్ట్ అని నాకు నోటీసులు పంపించినట్టుంది. ఆమె ప్రచారం కోసం 5 కోట్ల రూపాయలకు పరువు నష్టం దావా వేస్తున్నట్టు నోటీసులు పంపించి నన్ను వాడుకుంటున్నారు.”

ఇలా హేమ నుంచి నోటీసులు అందుకున్న విషయాన్ని నిర్థారించిన కరాటే కల్యాణి, తను కూడా ఈ వివాదంపై లీగల్ గా ఫైట్ చేస్తానని ప్రకటించారు. మీడియాలో వచ్చిన విషయాన్నే తను ప్రస్తావించానని, అందులో తన తప్పు లేదని ఆమె అన్నారు.

సొంత పనుల మీద తన సొంతూరు విజయనగరం రావడంతో మీడియాకు అందుబాటులోకి వెళ్లలేకపోయానని, హైదరాబాద్ వచ్చిన తర్వాత కచ్చితంగా హేమకు లీగల్ గానే సమాధానమిస్తానని కల్యాణి అన్నారు.

మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఎన్నికల టైమ్ లో కూడా హేమ-కరాటే కల్యాణి మధ్య వివాదం నడిచింది. ఆ టైమ్ లో కరాటే కల్యాణిపై హేమ పోలీసులకు ఫిర్యాదు కూడా చేశారు.

2 Replies to “ప్రచారం కోసమే లీగల్ నోటీసు”

Comments are closed.