“జాక్.. కొంచెం క్రాక్” అంటూ అనర్గళంగా బూతులు చెప్పేశాడు హీరో సిద్ధు జొన్నలగడ్డ. బొమ్మరిల్లు భాస్కర్ లాంటి దర్శకుడి సినిమా నుంచి అలాంటి ట్రయిలర్ కట్స్ ను ఎవ్వరూ కలలో కూడా ఊహించలేదు.
కాకపోతే అక్కడున్నది సిద్ధు కాబట్టి, ‘యూత్ పల్స్’ పేరిట ఆసువుగా బూతులు పెట్టేసి ఉంటారు. బహుశా, హీరో-దర్శకుడికి మధ్య అభిప్రాయబేధాలొచ్చింది కూడా ఇక్కడే కావొచ్చు.
తను పెట్టిన బూతులకు కొన్ని రోజుల కిందట జస్టిఫికేషన్ కూడా ఇచ్చుకున్నాడు సిద్ధు జొన్నలగడ్డ. బూతులు తను ప్లాన్ చేయలేదని, పీక్ క్లైమాక్స్ లో హీరో ఫ్రస్ట్రేషన్ తో అలా బూతులు మాట్లాడేస్తాడని, ఆ పాత్రకు, ఆ ఎమోషన్ కు ఆ బూతు కరెక్ట్ అని సమర్థించుకున్నాడు.
అయితే ట్రయిలర్ కాబట్టి మేకర్స్ ధైర్యంగా, విచ్చలవిడిగా బూతులు వాడేశారు. తాజాగా సినిమాకు సెన్సార్ అయింది. అధికారులు ఆ డైలాగ్స్ లో కొన్నింటిని కట్ చేసి, మరికొన్నింటికి మ్యూట్స్ వేశారు. యు/ఏ ఇచ్చారు.
సన్నివేశం డిమాండ్ చేసిందని, ఆ పాత్ర అలానే ప్రవర్తిస్తుందని ఎంత కవరింగ్ ఇచ్చుకున్నప్పటికీ, సెన్సార్ అనేది ఒకటి ఉంటుందని తెలిసి కూడా హీరోలు, దర్శకులు ఇలా ఇష్టారీతిన బూతులు వాడడం ఈమధ్య కామన్ అయిపోయింది.
జాయిన్ అవ్వాలి అంటే
ఈ సినిమా ఫ్లాప్ అవుతుంది, పరిమిత బడ్జెట్‌తో నిర్మించబడిందని విజువల్స్ చూస్తే తెలుస్తుంది, అందరి లుక్స్ కూడా casual గ ఉన్నాయ్ అంటే ఎంత బడ్జెట్ తక్కువ పెట్టారో అర్ధం అవుతుంది . ఇంకో మైనస్ ఏంటంటే సాంగ్స్ బాగాలేవు, హీరోయిన్ హెయిర్ కి వైట్ కలర్స్ పెట్టారు అది ఇంకో మైనస్, హీరోయిన్ కూడా ఒక మైనస్ పాయింట్ ఐన అవ్వొచ్చు. నాకు తెలిసి రిలీజ్ అయినాక Greatandra 2/5 రేటింగ్ ఇస్తారు