వైసీపీ టూ జనసేన వయా టీడీపీ

అధికారం పోయినపుడు సహజంగానే విపక్షంలో ఉండడం ఎవరికీ నచ్చదు. తమ వ్యాపారాలు, వ్యాపకాలు అన్నీ పోతాయని బెదురు బెంగ ఉంటూనే ఉంటాయి. అయిదేళ్ల పాటు వీధి పోరాటాలు చేస్తూ ఉన్న పార్టీకే నిధులు వెచ్చిస్తూ…

అధికారం పోయినపుడు సహజంగానే విపక్షంలో ఉండడం ఎవరికీ నచ్చదు. తమ వ్యాపారాలు, వ్యాపకాలు అన్నీ పోతాయని బెదురు బెంగ ఉంటూనే ఉంటాయి. అయిదేళ్ల పాటు వీధి పోరాటాలు చేస్తూ ఉన్న పార్టీకే నిధులు వెచ్చిస్తూ తిరిగే సత్తెకాలపు నేతలు ఉన్న కాలం కానేకాదిది.

అందువల్ల నీవు వస్తానంటే నేను వద్దంటానా అని కాదు, నేనే వచ్చేస్తున్నా అని తలుపు తోసుకుంటూ అధికార శిబిరాలలోకి దూసుకునిపోయే రోజులు ఇవి. విశాఖ కార్పొరేషన్ మేయర్ పదవి మీద కన్నేసిన కూటమి నేతలు వైసీపీ కార్పోరేటర్లను ఆకట్టుకుంటున్నారు వారు కూడా అందుకు తయారుగానే ఉన్నారు.

అయితే వచ్చిన వారిని వచ్చినట్లే చేర్చుకోవడంలో తమ్ముళ్ల మధ్య తగాయిదా వస్తోంది. అప్పుడెపుడో విశాఖ వస్తే చంద్రబాబుని అవమానించారు కాబట్టి ఈ కార్పోరేటర్ వద్దు అని ఒకరు అంటే ఆయన అధికారం కోసం వస్తున్నారు కాబట్టి చేర్చుకోవద్దు అని మరొకరు ఇలా టీడీపీలో పెద్ద ఎత్తున కార్పోరేటర్లు చేరాలనుకున్నా కొంతమందికే అవకాశం దక్కింది.

ఫిరాయింపులలో ఇది ఒక నీతి అన్న మాట. ఈ విషయంలో జనసేన సంగతి వేరేలా ఉంది. టీడీపీలో చేర్చుకోమని వారు డోర్లు వేసేస్తే జనసేన వైపు చూసిన కార్పోరేటర్లను చేర్చుకోవడానికి ఆ పార్టీ సిద్ధం అయిపోతోంది. తమ పార్టీ సంస్థాగతంగా బలపడడానికి ఇదే అదను అని ఎవరు వచ్చినా ఓకే అని ఆ పార్టీ గ్రీన్ సిగ్నల్ ఇస్తోంది. దీంతో కూటమిలో పొరపొచ్చాలు వస్తున్నాయని అంటున్నారు.

మేము వద్దు అన్న వారిని మిత్రులు చేర్చుకుంటే ఇక అర్ధమేమి ఉంటుందని తమ్ముళ్ళు అంటున్నారు. అయితే ఎవరి రాజకీయ అవసరాలు వారివి. పార్టీని ఎదగనీయాలీ అంటే కార్యకర్త నుంచి ఎక్కడ పెంచుకుని వస్తారు. ఎవరు ఈ రోజులలో ఆ పని చేస్తున్నారు. అంది వచ్చిన నేతలకే ఎర వేసి మరీ బలం పెంచుకుంటున్నారు.

జనసేన అలా తన పార్టీ పటిష్టత కోసం చూస్తోంది. ఇవన్నీ చూసిన జనాలు మాత్రం రాజకీయం అంటే కరెక్ట్ గా ఇలాగే ఉండాలని అంటున్నారు. మడి కట్టుకుని రాజకీయం చేయడానికి ఇవేవీ పాతకాలం రోజులు కావు కదా అని కూడా అంటున్నారు.

3 Replies to “వైసీపీ టూ జనసేన వయా టీడీపీ”

  1. కల్యాణ బాబు నోటి సన్యాసం చేసిందే అందుకు…ఇంత సమయం పట్టిందా మీకు అర్థం కావడానికి..

  2. మొత్తానికి జగన్ రెడ్డి పార్టీ ఖాళీ అయిపోతుందంటావ్..

    వై నాట్ 175 అంటే.. మొత్తం ఓడిపోవడమా..

    సాయి రెడ్డి బీజేపీ లోకి జంప్..

    జగన్ రెడ్డి బెంగుళూరు జంప్..

    పెద్ది రెడ్డి కి పుంగనూరు వెళ్లాలంటే వీసా తెచ్చుకోవాలి.. తిరుపతి లో ఉండాలంటే కోర్ట్ ని బతిమాలాడుకోవాలి..

    రోజా రెడ్డి చెన్నై జంప్..

    గన్నవరం వంశి అమెరికా జంప్..

    కొడాలి నాని నోటి కాన్సర్ తో సచ్చేలా ఉన్నాడు..

    మార్గాన్ని భరత్ జనసేన తలుపులు దబా దబా బాదేస్తున్నాడు ..

    2029 కి పార్టీ ఉంటుంది.. నాయకులు ఉండరు ..

Comments are closed.