జ‌గ‌న్‌ను తిట్టారు.. త‌ర్వాత ఏంటి?

ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైఎస్ జ‌గ‌న్‌ను కూట‌మి నేత‌లు తిట్టింది స‌రిపోన‌ట్టుంది. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా నిత్యం అదే ప‌ని చేస్తున్నారు. మ‌రోవైపు కూట‌మికి ఘ‌న విజ‌యాన్ని అందించిన ప్ర‌జ‌లు మాత్రం… హామీల అమ‌లు…

ఎన్నిక‌ల ప్ర‌చారంలో వైఎస్ జ‌గ‌న్‌ను కూట‌మి నేత‌లు తిట్టింది స‌రిపోన‌ట్టుంది. అధికారంలోకి వ‌చ్చిన త‌ర్వాత కూడా నిత్యం అదే ప‌ని చేస్తున్నారు. మ‌రోవైపు కూట‌మికి ఘ‌న విజ‌యాన్ని అందించిన ప్ర‌జ‌లు మాత్రం… హామీల అమ‌లు కోసం ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. ఎన్నిక‌ల‌కు ఏడాది ముందు నుంచే చంద్ర‌బాబునాయుడు సూప‌ర్ సిక్స్ పేరుతో భారీ ల‌బ్ధి క‌లిగిస్తాన‌ని హామీ ఇచ్చిన సంగ‌తి తెలిసిందే.

కూట‌మి ప్ర‌భుత్వం కొలువుదీరిన మొద‌లు హామీల‌న్నీ అమ‌లు చేస్తార‌ని ప్ర‌జ‌లు న‌మ్మారు. అబ్బే, చంద్ర‌బాబు స‌ర్కార్ వాటి జోలికి వెళ్ల‌డం లేదు. ప్ర‌స్తుతానికి పింఛ‌న్ల పెంపుతో స‌రిపెట్టుకోవాల‌ని చెప్ప‌క‌నే చెప్పారు. ఈ నేప‌థ్యంలో శ్వేత‌ప‌త్రాల పేరుతో ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు త‌న మార్క్ పాల‌న‌కు శ్రీ‌కారం చుట్టారు. జ‌గ‌న్ వ్య‌వ‌స్థ‌ల్ని స‌ర్వ‌నాశ‌నం చేశారంటూ మ‌రోసారి పాత విమ‌ర్శ‌ల్నే పున‌రావృతం చేస్తున్నారు. ఈ ద‌ఫా ఇందుకు అసెంబ్లీని వేదిక చేసుకోవ‌డం గ‌మ‌నార్హం.

హామీల్ని అమ‌లు ఉద్దేశం లేద‌ని ఏపీ ప్ర‌భుత్వం బ‌డ్జెట్ ప్ర‌వేశ పెట్ట‌కుండా త‌న వైఖ‌రి స్ప‌ష్టం చేసింది. శ్వేత‌ప‌త్రాలు విడుద‌ల చేసింది, చేస్తోన్న‌ది కూడా అందుకే అని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు. సంక్షేమ ప‌థ‌కాల్ని అమ‌లు చేయ‌క‌పోవ‌డానికి జ‌గ‌న్ సృష్టించిన ఆర్థిక విధ్వంసం అని చెప్పి, చంద్ర‌బాబు స‌ర్కార్ బాధ్య‌త‌ల నుంచి త‌ప్పించుకునే ప్ర‌య‌త్నం చేయ‌డం గ‌మ‌నార్హం. చంద్ర‌బాబు స‌ర్కార్ హామీల్ని నెర‌వేర్చ‌డం అసాధ్య‌మ‌ని మొద‌టి నుంచి అంద‌రూ చెబుతున్న‌దే.

అయితే తాను సంప‌ద సృష్టిస్తాన‌ని, ప్ర‌జ‌ల‌కు పంచుతాన‌ని సుదీర్ఘ రాజ‌కీయ, ప‌రిపాల‌న అనుభ‌వం క‌లిగిన చంద్ర‌బాబు గ‌ట్టిగా చెప్పారు. దీంతో జ‌నం కూడా న‌మ్మారు. మ‌రోవైపు జ‌గ‌న్ 2019 నాటి మ్యానిఫెస్టోనే అమ‌లు చేస్తాన‌ని చెప్ప‌డం జ‌నాన్ని పెద్ద‌గా ఆక‌ట్టుకోలేదు. చివ‌రికి కూట‌మి అప‌రిమిత‌మైన అధికారాన్ని ద‌క్కించుకుంది. హామీల అమ‌లు విష‌యానికి వ‌చ్చే స‌రికి వెన‌క‌డుగు వేస్తోంది. శ్వేత ప‌త్రాల పేరుతో జ‌గ‌న్‌ను తిట్ట‌డం కూడా ముగింపు ద‌శ‌కు వ‌చ్చింది. ఇప్పుడు చంద్ర‌బాబు స‌ర్కార్ ఏం చేస్తుందో మ‌రి!

22 Replies to “జ‌గ‌న్‌ను తిట్టారు.. త‌ర్వాత ఏంటి?”

  1. ఒక నానుడి :”కుక్కను చంపాలంటే ముందు అది పిచ్చిదాని ప్రచారం చెయ్యాలి “

    1. Yep, Jagan is a f’g rabid dog and he doesn’t need the mercy of getting euthanized but put to death by pelting stones and bricks for what he did to the state and the people.

      Condom vaadalsindani anabadevallallo veedu first, Visagadu next.

  2. మన జగన్ రెడ్డి ఢిల్లీ లో ధర్నా పెట్టుకుని చేసింది ఏంటి.. మంగళ గౌరీ వ్రతమా..? అదే తిట్లు కదా..

    అధికారం పోయాక .. భూతులు తగ్గాయి.. భూతు మనుషులు కనపడటం మానేశారు..

    ఇదే ప్రశ్న తమరు ఎన్నికలకు ముందు .. దుష్టచతుష్టయం.. మూడు పెళ్లిళ్లు.. ఎన్నికల్లో కుప్పం లో పెళ్ళాం నిలబడుతోంది..అంటూ చెత్త సొల్లు వాగుడు వాగినప్పుడు ప్రశ్నించి ఉంటె.. జగన్ రెడ్డి కి ప్రతిపక్ష హోదా అయినా దక్కేది ఏమో కదా..

    ఇప్పుడు చూడు 11 మంది ఎమ్మెల్యేలతో పీఎం అయిపోవాలని కలలు కంటున్నాడు..

  3. మరి ఆ శ్వేత పత్రాలు కి జగన్ సమాధానం ఏంటి? సైలెంట్ గా ఉంటే ఒప్పుకున్నట్లే కదా.

  4. మరి మన పలానా అట్ల ఏడిసింది అప్పుడు ...తెలుగు నేల ఉన్నంత వరకు గుర్తు ఉంటే పలానా అది

Comments are closed.