జనసేన సమర్పించు.. ఫిల్మ్ ఇనిస్టిట్యూట్!

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించింది జనసేన పార్టీ! ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. సాధారణంగా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో చలివేంద్రాలు, భోజనం…

పశ్చిమగోదావరి జిల్లా పాలకొల్లులో ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటు చేయనున్నట్టుగా ప్రకటించింది జనసేన పార్టీ! ఈ మేరకు ఆ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రకటించారు. సాధారణంగా రాజకీయ పార్టీల ఆధ్వర్యంలో చలివేంద్రాలు, భోజనం కేంద్రాలు ఏర్పాటు కావడం చూస్తూ ఉంటారు. అయితే జనసేన మాత్రం ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ ను ఏర్పాటు చేస్తూ ఉందట. పాలకొల్లు వేదికగా ఇది నడవనుందట. యువతకు సినిమా రంగానికి సంబంధించిన మెలకువలను నేర్పనున్నారట. యాక్టింగ్, డైరెక్టింగ్ స్కిల్స్ ను నేర్పిస్తారట!

ఈ ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కు హరిరామజోగయ్య చైర్మన్ గా వ్యవహరిస్తారట. రాజా వన్నెంరెడ్డి, బన్నివాసుల ఆధ్వర్యంలో ఈ ఇనిస్టిట్యూట్ నడుస్తుందట. పాలకొల్లు అంటే సినీ రంగానికి చాలామంది ప్రముఖులను అందించిందని ఈ సందర్భంగా పవన్ కల్యాణ్ ప్రస్తావించారు.

అల్లు రామలింగయ్య, దాసరి నారాయణ రావు, కోడి రామకృష్ణ వంటి వారిని పాలకొల్లు సినీ పరిశ్రమకు అందించిందని పవన్ గుర్తుచేశారు. తాము ఏర్పాటు చేసే ఫిల్మ్ ఇనిస్టిట్యూట్ కు ఎస్వీ రంగారావు పేరు పెట్టనున్నట్టుగా ప్రకటించారు. 

దాడులపై బాబు మౌనం.. ఓటమికి ఇది కూడా కారణమే