సీబీఐ జేడీగానే లక్ష్మీ నారాయణ అందరికీ సుపరిచితులు. ఆయన ప్రభుత్వ ఉద్యోగానికి స్వచ్చందంగా రాజీనామా చేసి విశాఖ నుంచి జనసేన తరఫున 2019 ఎన్నికల్లో పోటీ చేశారు. రెండు లక్షల డెబ్బై వేల పై చిలుకు ఓట్లు కూడా సంపాదించుకున్నారు.
అయితే ఆ మధ్యన ఆయన జనసేనకు దూరం అయ్యారు. ఆయన విశాఖ ఎంపీగా పోటీ చేసిన టైమ్ లో ఒక మాట చెప్పారు. తాను ఓడినా గెలిచినా విశాఖే తన విలాసం అన్నారు. దాని కోసం లోకల్ అడ్రస్ కూడా ఇచ్చారు.
అయితే ఆ మధ్య దాకా అడపా తడపా విశాఖ వస్తున్నలక్ష్మీ నారాయణ ఇపుడు విశాఖలోనే కంప్లీట్ గా సెటిల్ అయ్యేలా కనిపిస్తోంది. వచ్చే ఎన్నికల కోసం ఆయన కసరత్తు మొదలెట్టినట్లుగా కూడా చెబుతున్నారు.
ఆయన విశాఖ నుంచే మరోమారు ఎంపీగా పోటీ చేస్తారు అంటున్నారు. అయితే ఏ పార్టీ అన్నది మాత్రం తెలియడం లేదు. పొత్తులు కనుక గట్టిగా ఉంటే బహుశా బీజేపీ నుంచి ఆయన విశాఖ ఎంపీగా బరిలో నిలిచే చాన్స్ ఉందని టాక్.
విశాఖలో లోకల్ గా జరిగే అనేక కార్యక్రమాలలో లక్ష్మీ నారాయణ చురుకుగానే పాలు పంచుకుంటున్నారు. దీన్ని బట్టి చూస్తే ఆయన పోటీ చేయడం ఖాయమనే అంటున్నారు.