టీడీపీ Vs టీడీపీ.. చోద్యం చూస్తున్న బాబు

పార్టీలో క్రమశిక్షణరాహిత్యాన్ని క్షమించను. ప్రతి కార్యకర్త సైనికుడిలా క్రమశిక్షణతో ఉండాలి. తెల్లారితే ఇలాంటి కబుర్లు భలేగా చెప్పేవారు చంద్రబాబు. కానీ ఇప్పుడు ఇద్దరు బడా నేతలు బహిరంగంగా, సిగ్గులేకుండా తిట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారు. అసలు…

పార్టీలో క్రమశిక్షణరాహిత్యాన్ని క్షమించను. ప్రతి కార్యకర్త సైనికుడిలా క్రమశిక్షణతో ఉండాలి. తెల్లారితే ఇలాంటి కబుర్లు భలేగా చెప్పేవారు చంద్రబాబు. కానీ ఇప్పుడు ఇద్దరు బడా నేతలు బహిరంగంగా, సిగ్గులేకుండా తిట్టుకుంటుంటే చోద్యం చూస్తున్నారు. అసలు ఈ వివాదం తన చేతిలో లేదు అన్నట్టు ప్రవర్తిస్తున్నారు.

కేశినేని నాని, బుద్ధావెంకన్న మధ్య కొన్ని రోజులుగా మాటల యుద్ధం నడుస్తున్న విషయం తెలిసిందే. ఆదివారం నాడు అది మరింత తీవ్రరూపం దాల్చింది. సోషల్ మీడియాలో ఇష్టమొచ్చినట్టు తిట్టుకుంటున్న ఈ నేతలిద్దరూ చంద్రబాబు మాటను ఖాతరు చేయడం లేదు. ఇగోలకు పోయి పార్టీ పరువు తీస్తున్నారు.

“నాలుగు ఓట్లు సంపాదించలేనివాడు, నాలుగు పదవులు సంపాదిస్తున్నాడు. నాలుగు పదాలు చదవలేనివాడు, నాలుగు వాక్యాలు రాయలేనివాడు, ట్వీట్ చేస్తున్నాడు. దౌర్భాగ్యం!” అంటూ కేశినేని నాని విమర్శల పర్వాన్ని ప్రారంభిస్తే.. బుద్ధావెంకన్న మరింత రెచ్చిపోయారు.

“నువ్వు చేసినవన్నీ అభాంఢాలు, నేను చెప్పేవన్నీ నిజాలు. బస్సుల మీద ఫైనాన్స్ తీసుకొని 1997లో సొంతంగా దొంగ రిసిప్ట్ లు తయారుచేసుకుని ఫైనాన్స్ వారికి డబ్బులు చెల్లించకుండా నువ్వే దొంగ ముద్ర వేసుకొని కోట్లాది రూపాయలకు ఫైనాన్స్ కంపెనీలకు మోసం చేసిన నువ్వా ట్వీట్ చేసేది” అంటూ రెచ్చిపోయారు బుద్ధా వెంకన్న. ఇక్కడితో ఆగలేదాయన.

“దళిత నాయకుడు మాజీ స్పీకర్ బాలయోగి ఆస్తులన్నీ కాజేసిన దొంగ ఎవరో దేశం మొత్తానికి తెలుసు. ఒకే నంబర్ పై దొంగ పర్మిట్లతో బస్సులు నడిపిన దొంగవి నువ్వే కదా. నేను చెప్పాల్సిన నిజాలు చాలా ఉన్నాయి వినే ధైర్యం నీకుందా?” అంటూ దెప్పిపొడిచారు. ప్రజారాజ్యం నుంచి బయటకు వచ్చే ముందు ఆడిన ఆటలు టీడీపీలో సాగవంటూ కాస్త సూటిగానే చురకలు అంటించారు.

దీంతో కేశినేని ఇక తన ఆఖరి అస్త్రాన్ని ప్రయోగించారు. నేరుగా చంద్రబాబుకే ట్వీట్ పెట్టారు. “చంద్రబాబు గారు.. పార్టీలో నాలాంటి వాళ్లు మీకొద్దనుకుంటే చెప్పండి. ఎంపీ స్థానానికి, పార్టీ సభ్యత్వానికి కూడా రాజీనామా చేస్తాను. నాలాంటి వాళ్లు మీకు కావాలనుకుంటే, పార్టీలో కొనసాగాలనుకుంటే దయచేసి మీ పెంపుడు కుక్కను అదుపులో పెట్టండి.”

కొద్దిసేపటి కిందట కేశినేని పెట్టిన ఈ ట్వీట్ మరింత అగ్గిరాజేసింది. ఇక్కడ కేశినేని ఎవర్ని పెంపుడు కుక్క అన్నారు ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పైగా ఆయన పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేస్తానని అన్నారంటే, ఆఖరి అస్త్రం అదే అంటున్నారు విశ్లేషకులు.

ఇలా 2 రోజుల నుంచి వీళ్లిద్దరూ బహిరంగంగా తిట్టుకుంటున్నా అదుపుచేసే ప్రయత్నం చేయడం లేదు చంద్రబాబు. పార్టీ నుంచి ఒకట్రెండు బుజ్జగించే ప్రయత్నాలు చేసినా, మీ పని మీరు చూసుకుంటే మంచిదంటూ ఇద్దరూ వార్నింగ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇదీ టీడీపీలో క్రమశిక్షణ.

ప్రత్యర్థులు ఏకమై సుధీర్ విజయాన్ని ఆపలేకపోయారు