మైత్రీ సంస్థతో సంబంధం వున్న మూడు భారీ సినిమాలు. ముగ్గురు టాప్ హీరోలు. ముగ్గురు టాప్ డైరక్టర్లు. ఇవన్నీ కాస్త అటు ఇటుగా సెప్టెంబర్ నుంచి ప్రారంభం అయ్యే అవకాశం కనిపిస్తోంది.
ప్రభాస్-హను రాఘవపూడి కాంబినేషన్ లో ఓ మంచి లవ్ స్టోరీ ప్లానింగ్ లో వుంది. దీని కోసం సెట్ ల నిర్మాణం ప్రారంభమవుతోంది. ఈ సినిమా షూట్ సెప్టెంబర్ నుంచి వుండొచ్చు. కల్కి బ్లాక్ బస్టర్ జోష్ తో వున్న ప్రభాస్ ఈ సినిమా షూట్ మీదకు రాబోతున్నారు.
ఉప్పెన తరువాత దర్శకుడు బుచ్చిబాబు వెయిటింగ్ లో వున్నారు. గేమ్ ఛేంజర్ ఆలస్యం కావడంతో ఆయన అలా వుండిపోవాల్సి వచ్చింది. ఆ సినిమాలో రామ్ చరణ్ వర్క్ పూర్తయింది. ఇప్పుడు ఈ సినిమా మీదకు రాబోతున్నారు. ఈ సినిమా కూడా సెప్టెంబర్ నుంచే సెట్ మీదకు వెళ్లే అవకాశం కనిపిస్తోంది. ఇప్పటికీ ఈ సినిమా కోసం రెహమాన్ కొన్ని ట్యూన్ లు అందించారు.
ఎన్టీఆర్-ప్రశాంత్ నీల్ కాంబినేషన్ ఎప్పటి నుంచో వార్తల్లో వుంది. దేవర సినిమా వర్క్ పూర్తి చేసుకుని ఈ సినిమా మీదకు రావాల్సి వుంది ఎన్టీఆర్. సెప్టెంబర్ నుంచి షూట్ ప్రారంభమయ్యే అవకాశం వుందని తెలుస్తోంది.
ఈ మూడు సినిమాలు కూడా పాన్ ఇండియా సినిమాలే. అన్ని భాషల్లో నేరుగా విడుదలయ్యే సినిమాలే. కనీసం ఏడాది పాటు నిర్మాణంలో వుంటాయి. అందువల్ల 2025 చివర్న లేదా 2026 ఈ సినిమాలు అన్నీ తెరమీదకు రావచ్చు. అన్నింటి కన్నా ముందుగా బుచ్చిబాబు-చరణ్ సినిమా విడుదలయ్యే అవకాశం వుంది.