2024 పక్కన పెట్టి 2025 బిజీ

2024 ఇంకా అయిదారు నెలలు వుంది. ఈ అయిదారు నెలలకు గాను, ఇండియన్ 2, దేవర, సరిపోదా శనివారం, గేమ్ ఛేంజర్, పుష్ప 2, లక్కీ భాస్కర్ .. ఇలా ఓ ఆరు నోటెడ్…

2024 ఇంకా అయిదారు నెలలు వుంది. ఈ అయిదారు నెలలకు గాను, ఇండియన్ 2, దేవర, సరిపోదా శనివారం, గేమ్ ఛేంజర్, పుష్ప 2, లక్కీ భాస్కర్ .. ఇలా ఓ ఆరు నోటెడ్ సినిమాల విడుదల వుండేలా కనిపిస్తోంది. మహా అయితే మరో ఒకటో రెండో రావచ్చు. అంతకు మించి వచ్చే సూచనలు కనిపించడం లేదు. అల్లరి నరేష్ బచ్చల మల్లి ఈ జాబితాలో వుండొచ్చు.

కానీ 2025 కు మాత్రం రుమాళ్లు పడిపోతున్నాయి. సంక్రాంతికి మెగాస్టార్ విశ్వంభర, వెంకీ- అనిల్ రావిపూడి సినిమా ఇప్పటికే లైన్ లో రెడీగా వున్నాయి. ఫిబ్రవరికి నితిన్ చేస్తున్న రెండు సినిమాల్లో ఒకటి, విష్వక్ సేన్ లైలా సినిమాలు ఫిక్స్ అయి వున్నాయి. సితార సంస్థ రవితేజ, బాలయ్య, సిద్దులతో నిర్మించే సినిమాలు అన్నీ ఫిబ్రవరి నుంచి ఏప్రిల్ మధ్యలో రాబోతున్నవే.

చాలా మిడ్ రేంజ్ సినిమాలు నిర్మాణంలో వున్నాయి. ఇవన్నీ రెండు మూడు నెలల వరకు రెడీ అయ్యే అవకాశం లేనివే. ఈ ఏడాది రెండో ఆరు నెలల్లో ఎక్కువ సినిమాలు లేకపోవడానికి సింగిల్ రీజన్. డిజిటల్ సేల్స్. ఏ సినిమా కూడా డిజిటల్ సేల్ పూర్తి చేసుకోకుండా డేట్ వేసుకునే అవకాశం ఇప్పుడు లేదు. డిజిటల్ సేల్ మీద భరోసా వుంటేనే డేట్ వేయగలుగుతున్నారు.

సినిమాలు పూర్తి చేసుకుంటూ మరో పక్క డిజిటల్ కోసం ప్రయత్నిస్తున్న వారు డేట్ వేయలేకపోతున్నారు. ఈ ఏడాదికి డిజిటల్ సేల్స్ ఆల్ మోస్ట్ క్లోజ్ కనుక, అన్నీ వచ్చే ఏడాది స్లాట్ లకే అమ్మాల్సి వుంటుంది. అందువల్లే ఈ ఏడాది కన్నా వచ్చే ఏడాది మిడ్ రేంజ్ సినిమాలు ఎక్కువగా వచ్చే అవకాశం ఎక్కువ వుంది.