నిర్మాతల్లో కొంతమంది వేరుగా అప్రకటిత సంఘం పెట్టుకుని, మీడియాను, ప్రకటలను కట్టడి చేసే పని మొదలు పెట్టిన సంగతి తెలిసిందే. ఆ మధ్య ఈ వ్వవహారం చాలా సినిమాలను దెబ్బ తీసింది. తరువాత అదే సిండికేట్ పెద్దలు తమ సినిమాలకు మాత్రం నిబంధనలు పక్కనపెట్టేసారు. వారి సినిమాలు బాగుండాలన్న కోరికతో. కానీ మళ్లీ వేరే సినిమాల దగ్గరకు వచ్చేసరికి, వాళ్లను ఈ నిబంధనల్లో ఇరికిస్తూ, మీడియాకు దూరం చేసేస్తున్నారు.
సినిమా ఏ మాత్రం బాగున్నా నడిచిపోతోంది. ఏ మాత్రం తేడావున్న, మీడియా తన తడాఖా చూపించేస్తోంది. శివమ్ సినిమా విషయంలో అదే జరిగిందట. శివమ్ సినిమా కూడా ఈ సిండికేట్ సూచనల మేరకే నడుచుకుంది. చాలా చానెళ్లను, పత్రికలను పట్టించుకోలేదు. అంతే సినిమా తేడా కొట్టగానే వీటన్నింటిలో కథనాలు ప్రారణభమైపోయాయి. మాట్నీవేళకే కథనాలు వచ్చేసాయి.
వీటి ప్రభావం ఎంతలా వుందంటే, శనివారం మార్నింగ్ షో వేళకే కలెక్షన్లు పూర్తిగా డల్ అయిపోయాయి. జనంలోకి సినిమా ఫలితం అంతలా వెళ్లిపోయింది. ఇలా కాకుండా వుండివుంటే, కనీసం వీకెండ్ మూడు రోజులు అయినా కాస్త మంచి కలెక్షన్లు వుండివుండేవి. సోమవారం నాటికి డౌన్ అయ్యేది.
కానీ సిండికేట్ లో చేరిన పుణ్యమా అని ఆ అవకాశం లేకుండా పోయింది. పైగా సినిమాలు ఎలా బాధపడినా సిండికేట్ పని బాగానేవుందట.చానెళ్లతో సిండికేట్ రేట్ కాంట్రాక్టు, మార్జిన్ కుదర్చుకుందని టాలీవుడ్ లో టాక్ వినిపిస్తోంది. దాని మేరకు, ప్రకటనలు అన్నీ సిండికేట్ ద్వారానెే వెళ్తాయి. ప్రకటనల ఒప్పందం కుదుర్చుకున్న చానెళ్ల దగ్గర భారీగా కమీషన్లు వస్తున్నాయని వదంతులు వినిపిస్తున్నాయి.అసోసియేషన్ ఖర్చులు, ప్యూచర్ ప్రాజెక్టులు వంటి వాటి పేరు చెప్పి చానెళ్ల దగ్గర సిండికేట్ వసూలు చేస్తోందట. వాటిని ఇండస్ట్రీ కోసమో ఎప్పుడో, ఏలాగో ఖర్చు చేస్తాం అని చెబుతున్నారట. మరేం చేస్తారో కానీ, ఇప్పుడు మాత్రం ఆ మాత్రం అటు ఇటుగా వున్న సినిమాలు బలైపోతున్నాయి.
అసలు సిండికేట్ దగ్గరకు ఎందుకు వెళ్లాలి..నేరుగా నిర్మాతలే చేసుకోవచ్చు కదా..అంటే, అక్కడ బడ్జెట్, ఇతరత్రా మొహమాటలా వంటి సమస్యలు వస్తున్నాయని, దిల్ రాజు, అరవింద్, సురేష్ లాంటి వాళ్లతో మొహమాటాలు, పైగా యాడ్ లు తక్కువ రేటుకు వస్తాయని కూడా.నిర్మాతలు అటు మొగ్గుతున్నారు. ఇటు మీడియాకు దూరం అవుతున్నారు.