అబ్బాయ్ దృష్టిలో బాబాయ్ డైరక్టర్?

గబ్బర్ సింగ్ సినిమాతో స్టామినా ప్రూవ్ చేసుకున్నా, రామయ్యా వస్తావయ్యాతో అంతా పోయింది మళ్లీ ..డైరక్టర్ హరీష్ శంకర్ కు. సరైన చాన్స్ రాని టైమ్ లో మళ్లీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో కాస్త…

గబ్బర్ సింగ్ సినిమాతో స్టామినా ప్రూవ్ చేసుకున్నా, రామయ్యా వస్తావయ్యాతో అంతా పోయింది మళ్లీ ..డైరక్టర్ హరీష్ శంకర్ కు. సరైన చాన్స్ రాని టైమ్ లో మళ్లీ సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ తో కాస్త ఆశలు చిగురిస్తున్నాయి.

ఇప్పుడు పవన్ కళ్యాణ్ మాటతో రామ్ చరణ్ తన తరువాతి సినిమా హరీష్ శంకర్ పేరు పరిశీలిస్తున్నాడన్న గ్యాసిప్ పైకి వచ్చింది. గతంలో గబ్బర్ సింగ్ 2 కు హరీష్ పేరు బయటకు వచ్చింది. అప్పట్లో హరీష్ నే ఈ వార్త ప్రచారానికి మూలం అని మరో గ్యాసిప్ వినిపించింది. 

మరి ఇప్పుడు రామ్ చరణ్ కు నిజంగానే హరీష్ పేరు చెప్పినట్లా..చాన్స్ వస్తున్నట్లా అన్నది కొన్నాళ్లు ఆగితే కానీ తెలియదు.