మేధావులతో సామాన్యుడు కలవలేడుగానీ, మేధావి సామాన్యుడితో కలవగలడు.. అనడానికి ఉదాహరణ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం. గాయకుడిగానే కాదు, వ్యక్తిగానూ ఎంతో మేధావి ఆయన. పాడుతా తీయగా అనే ప్రోగ్రామ్ ఆయనకు జీవిత సాఫల్యం కిందే చెప్పుకోవాలి.
అలాంటి ప్రోగ్రామ్‌ని అమెరికాలో జరుపుతున్న సందర్భంగా సహ యాంకరింగ్ కోసం యాంకర్ సుమను తీసుకెళ్ళారు. పానకంలో పుడకలాగా యాంకర్ సుమ వేస్తున్న పిచ్చి జోకులకు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం సమన్వయం చేయలేక ఇబ్బంది పడుతున్నారు. ఎస్పీగారు ఎంతో గొప్పగా చెబుతున్న జీవిత సత్యాలకు సుమ కౌంటర్లు నిలబడలేక వెలవెలబోతున్నాయి.
ఏవో పట్టుచీరలూ, గాలిబుడగలు పగలగొట్టడం, జారుడు బల్ల జారడం లాంటి ఐడల్ ప్రోగ్రామ్స్‌కి అయితే సుమ మైండ్ సెట్ ఓకేగానీ, పాడుతా తీయగా లాంటి ఐడల్ ప్రోగ్రామ్స్‌కి సుమ యాంకరింగ్ అతుకుల బొంతలా వుందని పలువురు విమర్శిస్తున్నారు.