అల్లు అర్జున్ కు తొలిబోణీ

మెగాఫ్యామిలీకి, పవన్ కు మధ్య వున్న ముసుగు తీసేయడం అల్లు అర్జున్ కు కలిసివచ్చింది. ఇప్పుడు అల్లుఅర్జున్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లోని సన్నాఫ్ సత్యమూర్తి అడియో ఫంక్షన్ కు పవన్ అతిథిగా హాజరు కానున్నట్లు…

మెగాఫ్యామిలీకి, పవన్ కు మధ్య వున్న ముసుగు తీసేయడం అల్లు అర్జున్ కు కలిసివచ్చింది. ఇప్పుడు అల్లుఅర్జున్-త్రివిక్రమ్ ల కాంబినేషన్ లోని సన్నాఫ్ సత్యమూర్తి అడియో ఫంక్షన్ కు పవన్ అతిథిగా హాజరు కానున్నట్లు వార్తలు వెలువడ్డాయి. పవన్ కు త్రివిక్రమ్ కు మధ్య వున్న స్నేహం..సన్నిహిత్వం తెలిసిందే. 

మామూలుగానే పవన్ ఫంక్షన్ కు వస్తే..పక్కన త్రివిక్రమ్ వుంటారు. అలాంటిది. త్రివిక్రమ్ ఫంక్షన్ అంటే…అందుకే పవన్ వస్తున్నారు. ఇది ఆ సినిమాకు వున్న హైప్ ను మరింత పైకి తీసుకెళ్తుందన్నది గ్యారంటీ. ఇన్నాళ్లు ఈ ముసుగు కారణంగా ఫంక్షన్లకు హాజరయ్యేందుకు వీలు కాలేదనుకోవాలి. ఇకపై ఇలాంటి కలయికలు చాలా చూడొచ్చు అభిమానులు.