పవన్ తో అల్లు అరవింద్ సినిమా?

కుటుంబం అంతా ఒక్కటయ్యామని ఏదో విధంగా ప్రకటించేసారు పవన్. దీంతో మళ్లీ ‘సకుటుంబ’ సినిమాలు వచ్చే అవకాశానికి తెరలేచింది. రామ్ చరణ్ తో సినిమా తీస్తానని పవన్ ప్రకటించారు. ఇప్పుడు పవన్ తో సినిమా…

కుటుంబం అంతా ఒక్కటయ్యామని ఏదో విధంగా ప్రకటించేసారు పవన్. దీంతో మళ్లీ ‘సకుటుంబ’ సినిమాలు వచ్చే అవకాశానికి తెరలేచింది. రామ్ చరణ్ తో సినిమా తీస్తానని పవన్ ప్రకటించారు. ఇప్పుడు పవన్ తో సినిమా చేయాలని అల్లు అరవింద్ ప్లాన్ చేస్తున్నారని వినికిడి. అల్లు అరవింద్ భారీ సినిమా తీసి చాలా కాలమైంది. 

చిన్న, మీడియం రేంజ్ సినిమాలు నిర్మిస్తూ వస్తున్నారు. ఇందుకోసం రకరకాల బ్యానర్లు, పార్టనర్ షిప్ లు వున్నాయి. ఇప్పుడు మళ్లీ ఓ భారీ సినిమా ప్లాన్ చేస్తున్నారట. అన్నీ కుదరితే పవన్ సన్నిహితుడు శరద్ మురార్, అరవింద్ కలిసి ఓ సినిమాను నిర్మిస్తారు. ఇందుకోసం సరైన సబ్జెక్ట్ కు గాలింపు మొదలైంది. కాస్త స్పెషల్ సబ్జెక్ట్ అయితేనే, బ్యానర్ కు ప్రెస్టీజియస్ గావుంటుందని అరవింద్ భావిస్తున్నారని తెలుస్తోంది. 

నిజానికి చిరంజీవితో ఎడమొహం పెడమొహం అని వార్తలు వచ్చినా పవన్ మాత్రం అరవింద్ తో, ఆయన సోదరి, తన వదిన అయిన చిరంజీవి భార్యతో మంచి సంబంధ బాంధ్యవాలు, కుటుంబ అనుబంధాలు మిస్ కాకుండా చూసుకుంటూ వచ్చారని వినికిడి. అత్తారింటికి దారేది సినిమా పైరసీ, థియేటర్ల సమస్య వచ్చినపుడు కూడా నిర్మాత తరపున బయ్యర్లకు అడ్డంగా అరవిందే నిల్చున్నారు. అందుకే ఇప్పుడు ఓ సినిమా కూడా చేయాలని అనుకుంటున్నారట.