వ‌ర్మ పుస్తకం రాస్తున్నాడోచ్‌!

సంచల‌నాల‌కు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వ‌ర్మ‌. 'నా ఇష్టం' అంటూ త‌న‌కిష్టం వ‌చ్చిన‌వ‌న్నీ, ఇష్టమొచ్చిన రీతిలో రాసిపాడేశాడు. జ‌నాలు పిచ్చిపిచ్చిగా చ‌దివారు. ఆ పుస్తకం బాగా అమ్ముడుపోయింది. రైట‌ర్‌గానూ హిట్టయిపోయాడు వ‌ర్మ‌. ఆ ఉత్సాహంతో…

సంచల‌నాల‌కు కేరాఫ్ అడ్రస్ రాంగోపాల్ వ‌ర్మ‌. 'నా ఇష్టం' అంటూ త‌న‌కిష్టం వ‌చ్చిన‌వ‌న్నీ, ఇష్టమొచ్చిన రీతిలో రాసిపాడేశాడు. జ‌నాలు పిచ్చిపిచ్చిగా చ‌దివారు. ఆ పుస్తకం బాగా అమ్ముడుపోయింది. రైట‌ర్‌గానూ హిట్టయిపోయాడు వ‌ర్మ‌. ఆ ఉత్సాహంతో ఇప్పుడు మ‌రో పుస్తకం రాయ‌డానికి రెడీ అవుతున్నాడట‌. 

ఇందులో త‌న స్వీయ అనుభ‌వాల‌ను పొందుప‌రుస్తాడ‌ట‌. శివ నుంచి ఇప్పటి వ‌ర‌కూ త‌న సినీ ప్రయాణాన్ని పూస గుచ్చిన‌ట్టు వివ‌రిస్తాడ‌ట‌. వ‌ర్మ క‌థంటే.. హాట్ హాట్ విష‌యాలు ఎక్కువ‌గా ఉంటాయి. దానికి త‌గ్గట్టుగానే ఓ హాట్ టైటిల్ కోసం అన్వేషిస్తున్నాడు వ‌ర్మ‌. చూద్దాం.. ఈసారి ఎంత కిక్ ఇస్తాడో?