తెలుగులో విశాల్‌కంటూ ఓ మార్కెట్ రావడానికి కారణమైన చిత్రం పందెం కోడి. దర్శకుడిగా లింగుస్వామికి తనకంటూ ఓ ఇమేజ్ తీసుకొచ్చిన సినిమా ఇది. ఆతరవాత విశాల్‌కి హిట్టు పడకపోయినా పందెం కోడి చెప్పి కొన్నాళ్లపాటు తన బండిని లాగించేశాడు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్ తీయడానికి విశాల్ రంగం సిద్ధం చేసుకొన్నాడు.
ఏప్రిల్‌లో ఈ సినిమా సెట్స్‌పై వెళ్లబోతోంది. పార్ట్ 2 పేరుతో ఏదోదో తీసేస్తున్నారు. పేరు వాడుకొంటున్నా… కథతో సంబంధం లేని సినిమాలే వస్తున్నాయి. కానీ పందెం కోడి 2 అలాకాదట. 1,2లకు మధ్య సంబంధం ఉంటుందట.
స్ర్కీన్ ప్లేలో ఓ కొత్తతరహా ప్రయోగం ఈసినిమాతో చేయబోతున్నారని తెలుస్తోంది. అన్నట్టు విశాల్ సినిమా మగమహారాజు ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకొస్తోంది.