బాబి….బాబోయ్

ప‌వ‌న్ క‌ల్యాణ్ తో సినిమా అంటే అది మామూలు విష‌యం కాద‌న్నది ద‌ర్శకుల మాట‌. సినిమాకి హిట్టొస్తే పేరొస్తుంది స‌రే… కానీ ఆ సినిమా పూర్తయ్యేలోగా చుక్కలు క‌నిపిస్తాయి. రెండేళ్ల పాటు ఆ టెన్షన్‌ని…

ప‌వ‌న్ క‌ల్యాణ్ తో సినిమా అంటే అది మామూలు విష‌యం కాద‌న్నది ద‌ర్శకుల మాట‌. సినిమాకి హిట్టొస్తే పేరొస్తుంది స‌రే… కానీ ఆ సినిమా పూర్తయ్యేలోగా చుక్కలు క‌నిపిస్తాయి. రెండేళ్ల పాటు ఆ టెన్షన్‌ని భ‌రించి సంప‌త్‌నంది బ‌య‌ట‌కు వ‌చ్చేశాడు. ఇప్పుడు బాబీ కూడా బాబోయ్ అనే ప‌రిస్థితికి వెళ్లిపోయాడ‌ని వినికిడి. 

ప‌వ‌ర్ సినిమాతో పేరు తెచ్చుకొన్నాడు బాబి. ఆ త‌ర‌వాత బోలెడు ఆఫ‌ర్లొచ్చాయి. అయితే ప‌వ‌న్ నుంచి పిలుపు రావ‌డంతో హుషారుగా ఆ కాంపౌండ్‌లోకి వాలిపోయాడు. ఇప్పుడు గ‌బ్బర్ సింగ్ 2 స్ర్కిప్టుని ప‌వ‌న్ కి న‌చ్చేట్టు మార్చడానికి కిందా మీదా పడుతున్నాడట. ఇది వ‌ర‌కే సంప‌త్ నంది స్ర్కిప్టు త‌యారు చేసిన‌ప్పటికీ దాన్ని కాస్త మార్చాలనుకున్నాడు ప‌వ‌న్‌.   

అయితే బాబీ ఎన్ని సీన్లు చెప్పినా ఐ సినిమాలో విక్రమ్ డైలాగ్ లా ''అంత‌కు మించి… అంత‌కు మించి'' అంటున్నాడ‌ని వినికిడి. ఇంత‌కు మించి ఏం చేయాలో అర్థం కాక కుర్ర డైరెక్టర్ తెగ ఇబ్బంది ప‌డుతున్నాడ‌ట‌. ప‌వ‌న్‌కి న‌చ్చేలా, నూటికి నూరు పాళ్లూ సంతృప్తిప‌డేలా స్ర్కిప్టు త‌యారు చేయ‌డం నావ‌ల్ల అవుతుందా??  అంటూ బెంగ పెట్టేసుకొన్నాడని అనుకుంటున్నాడు. మ‌రి ఆ స్ర్కిప్టు ఎప్పటికి పూర్తవుతుందో.. ఈ సినిమా ఎప్పుడు ప‌ట్టాలెక్కుతుందో..??