న‌ట కిరీటి… ఇంకోటి

క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక‌…. రాజేంద్రప్రసాద్ మ‌రీ బిజీ అయిపోయారు. ప్రస్తుతం బ‌న్నీ సినిమాలో న‌టిస్తున్నారాయ‌న‌. ఇప్పుడు మ‌రో ఆఫ‌ర్ త‌గిలింది. అఖిల్ ఎంట్రీ మూవీలోనూ న‌ట కిరీటికి ఛాన్స్ ద‌క్కింది. అఖిల్ – వినాయ‌క్‌ల…

క్యారెక్టర్ ఆర్టిస్టుగా మారాక‌…. రాజేంద్రప్రసాద్ మ‌రీ బిజీ అయిపోయారు. ప్రస్తుతం బ‌న్నీ సినిమాలో న‌టిస్తున్నారాయ‌న‌. ఇప్పుడు మ‌రో ఆఫ‌ర్ త‌గిలింది. అఖిల్ ఎంట్రీ మూవీలోనూ న‌ట కిరీటికి ఛాన్స్ ద‌క్కింది. అఖిల్ – వినాయ‌క్‌ల మూవీ ఇటీవ‌లే సెట్స్‌పైకి వెళ్లింది. ఇందులో తండ్రి పాత్ర కోసం ప‌లువురు న‌టుల‌ను ప‌రిశీలించారు. 

చివ‌ర‌కి రాజేంద్ర ప్రసాద్ అయితే బాగుంటుంద‌ని వినాయ‌క్ బృందం ఫిక్సయ్యింద‌ట‌. మ‌రో వైపు నాగార్జున కూడా రాజేంద్ర ప్రసాద్ పేరే సూచించ‌డంతో… రాజేంద్రుడు బెర్త్ క‌న్‌ఫామ్ అయ్యింది. అంతా బాగానే ఉంది. 

అయితే రాజేంద్రప్రసాద్ కీ రోల్స్ చేసిన సినిమాలేవీ (జులాయి మిన‌హాయిస్తే) స‌రిగా ఆడ‌లేదు. ల‌వ్ లీ అంతంత‌మాత్రంగా ఆడితే బావ‌, ఆగ‌డు ఫ్లాపుల‌య్యాయి. మ‌రి ఈ సెంటిమెంట్‌ని వినాయ‌క్ బృందం ప‌క్కన పెట్టిందంటే గొప్ప విష‌య‌మే.