హీరోయిన్స్‌ను బాగా ఇబ్బంది పెట్టే ప్రశ్న ఏదంటే.. ‘మీకు ఏ హీరోతో నటించడానికి కంఫర్ట్‌గా వుంటుందని..’. అలాంటి ప్రశ్నలు అడగొద్దు ప్లీజ్ అని వేడుకుంటుంది హీరోయిన్ సమంత. గ్లామర్ హీరోయిన్‌గా తెలుగు, తమిళ రంగాల్లో దూసుకుపోతున్న హీరోయిన్ సమంత ఇప్పటిదాకా ఎంతోమంది హీరోలతో నటించింది. ఏ హీరోతో నటించినాసరే ఇట్టే మ్యాచ్ అయిపోవడం ఆవిడ ప్రత్యేకత.
సమంత హీరోయిన్ అనగానే హీరోలు కూడా ఎగిరి గంతేస్తారు. లౌక్యం బాగా తెలిసిన సమంత ఎవ్వరితోనూ కాంట్రవర్సీకి పోకుండా అందరినీ కలుపుకుపోతూ మంచి హీరోయిన్‌గా పేరు తెచ్చుకుంది. అలాంటి సమంతను ఒక టీవీ ప్రోగ్రామ్‌లో మీకు ఏ హీరో అంటే ఇష్టం.. అని అడిగినప్పుడు నవ్వుతూ అలాంటివి అడగొద్దని రిక్వెస్ట్ చేస్తూనే.. ఒక్కో హీరోది ఒక్కో స్టయిల్. అందరూ గొప్పవాళ్ళే. అందరూ మర్యాదస్తులే. మహిళలంటే గౌరవం వున్నవాళ్ళే అంటోంది.
ఏ లాంగ్వేజ్ చేసినా తనకు అంత ట్రబుల్ వుండదనీ, మన పని మనం శ్రద్ధగా చేసుకుపోవాలి. డైరెక్టర్ సీన్ చెప్పినప్పుడు దాన్ని ఇంప్రూవ్ చేసుకోవాలి. హీరో దగ్గర కూడా నటన నేర్చుకోవాలి. ఇలా ఆలోచిస్తాను నేను తప్పితే ఎవ్వరి పనుల్లోనూ వేలు పెట్టను. అలాగే కొంతమంది నిర్మాతలు అనుకున్నంత పారితోషికం పూర్తిగా ఇవ్వకుండా ఎగ్గొట్టినప్పుడు కూడా నేను గొడవ చెయ్యను.
అప్పటికి వాళ్ళెంతో ఆర్థికంగా ఇబ్బంది పడతారు కదా.. అని ఆలోచిస్తాను. కావాలని ఎవరైనా ఉద్దేశ్యపూర్వకంగా డబ్బులు ఎగ్గొడితే ఇక జన్మలో వాళ్ళ బ్యానర్‌లో నటించను. అలాంటి సందర్భాలు నా లైఫ్‌లో వున్నాయి.. అని చెబుతున్న సమంతకు భవిష్యత్‌లో హీరోయిన్ ఓరియెంటెడ్ ఫిల్మ్ కూడా చెయ్యాలని వుందట. బెస్టాఫ్ లక్ సమంత.