వెంకీ మళ్లీ సోలో

ఒక మల్టీస్టారర్‌, ఒక సోలో సినిమా అన్నట్టుగా వెంకటేష్‌ తన కెరీర్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడు. దృశ్యం తర్వాత గోపాల గోపాల చేసిన వెంకటేష్‌ ఇప్పుడు తన తదుపరి చిత్రం సోలోగా చేయాలని డిసైడ్‌ అయ్యాడు.…

ఒక మల్టీస్టారర్‌, ఒక సోలో సినిమా అన్నట్టుగా వెంకటేష్‌ తన కెరీర్‌ ప్లాన్‌ చేసుకుంటున్నాడు. దృశ్యం తర్వాత గోపాల గోపాల చేసిన వెంకటేష్‌ ఇప్పుడు తన తదుపరి చిత్రం సోలోగా చేయాలని డిసైడ్‌ అయ్యాడు. ఎన్‌.వి. నిర్మల్‌ డైరెక్షన్‌లో వెంకటేష్‌ నెక్స్‌ట్‌ మూవీ ఖరారైంది. 

తమిళంలో ‘సలీమ్‌’ అనే సక్సెస్‌ఫుల్‌ థ్రిల్లర్‌ని నిర్మల్‌ డైరెక్ట్‌ చేసాడు. ఆ చిత్రాన్ని తెలుగులో రీమేక్‌ చేయాలని వెంకటేష్‌ అనుకున్నాడు కానీ ఇప్పుడు అతని దర్శకత్వంలోనే వేరే కథతో తెలుగులో స్ట్రెయిట్‌ సినిమా చేస్తున్నాడు. ఇది కూడా దృశ్యం మాదిరిగా కొత్తరకం కథ, కథనాలతో ఉంటుందట. 

రెగ్యులర్‌ కమర్షియల్‌ చిత్రాలకి దూరంగా తన వయసుకి తగ్గ పాత్రల్నే వెంకీ ఎంచుకుంటున్నాడు. దృశ్యం చిత్రాన్ని తక్కువ బడ్జెట్‌లో కంప్లీట్‌ చేసి లాభపడిన వెంకటేష్‌ తన కొత్త చిత్రానికి కూడా అదే పద్ధతి ఫాలో అవుతున్నాడు.