సమంత సీన్‌ అయిపోలేదింకా!

సమంత పని అయిపోయిందని మీడియా తెగ రాసేస్తోంది. చరణ్‌, శ్రీను వైట్ల సినిమాలో అవకాశం దక్కినట్టే దక్కి చేజారడంతో ఇప్పుడు సమంతకి తెలుగులో అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ల ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ మినహా మరేం లేదు.…

సమంత పని అయిపోయిందని మీడియా తెగ రాసేస్తోంది. చరణ్‌, శ్రీను వైట్ల సినిమాలో అవకాశం దక్కినట్టే దక్కి చేజారడంతో ఇప్పుడు సమంతకి తెలుగులో అల్లు అర్జున్‌, త్రివిక్రమ్‌ల ‘సన్నాఫ్‌ సత్యమూర్తి’ మినహా మరేం లేదు. అయితే దీని గురించి బెంగ పడాల్సిన పని లేకుండా సమంతకి తమిళంలో వరుసగా పెద్ద ఆఫర్లు వస్తున్నాయి. 

కత్తితో బ్లాక్‌బస్టర్‌ సాధించిన సమంత ప్రస్తుతం విక్రమ్‌తో ఒక చిత్రంలో నటిస్తోంది. సూర్య, విజయ్‌, విక్రమ్‌లాంటి హీరోలతో అవకాశాలు దక్కించుకున్న సమంత విజయ్‌ నటించే తదుపరి చిత్రంలోను ఛాన్స్‌ కొట్టేసింది. మురుగదాస్‌ నిర్మించే ఈ చిత్రానికి ‘రాజా రాణి’ ఫేం అట్లీ దర్శకత్వం వహిస్తాడట. 

‘కత్తి’లో హీరోయిన్‌గా నటించినా కానీ తన పాత్ర నిడివి మరీ తక్కువని విమర్శలు వచ్చాయి. కానీ విక్రమ్‌ సినిమాతో పాటు విజయ్‌-అట్లీల చిత్రం కూడా తనకి ముఖ్యమైన పాత్రలు దక్కాయని, నటిగా తనకి తమిళంలో స్టార్‌ స్టేటస్‌ తెచ్చిపెట్టే చిత్రాలవుతాయని సమంత ధీమాగా ఉంది. తెలుగులో జోరు తగ్గినా తమిళంలో ఆ గ్యాప్‌ ఫిల్‌ అయిపోవడంతో సమంత సంతృప్తి పడుతోంది. మళ్లీ ఇక్కడ కూడా బిజీ కాగలననే ధీమా వ్యక్తం చేస్తోంది.