మళ్ళీ హిట్టిస్తావా రాజా?

టాలెంట్‌ పరంగా ఏమాత్రం తక్కువ లేని శర్వానంద్‌కి అదృష్టమే చాలాసార్లు కలిసి రాలేదు. అందుకే హీరోగా ఎన్నో పరాజయాలు చవిచూసాడు. కానీ ‘రన్‌ రాజా రన్‌’తో సోలో హీరోగా తొలి విజయాన్ని అందుకున్న శర్వానంద్‌…

టాలెంట్‌ పరంగా ఏమాత్రం తక్కువ లేని శర్వానంద్‌కి అదృష్టమే చాలాసార్లు కలిసి రాలేదు. అందుకే హీరోగా ఎన్నో పరాజయాలు చవిచూసాడు. కానీ ‘రన్‌ రాజా రన్‌’తో సోలో హీరోగా తొలి విజయాన్ని అందుకున్న శర్వానంద్‌ ఆ సక్సెస్‌ని నిలబెట్టుకోవాలని చూస్తున్నాడు. అతను హీరోగా నటించిన ‘మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు’ ఈ శుక్రవారం రిలీజ్‌ అవుతోంది. 

శర్వానంద్‌ ఇందులో రన్నర్‌ క్యారెక్టర్‌ చేసాడు. నిత్యామీనన్‌ అతడిని ప్రేమించే ముస్లిమ్‌ యువతి క్యారెక్టర్‌లో కనిపిస్తుంది. ట్రెయిలర్‌ అయితే సినిమాపై డీసెంట్‌ ఎక్స్‌పెక్టేషన్స్‌ బిల్డ్‌ చేసింది. ఈ సినిమాతో కనుక శర్వానంద్‌ మరో సక్సెస్‌ సాధించినట్టయితే తన కెరీర్‌ స్టేబుల్‌ అయిపోతుంది. 

‘రన్‌ రాజా రన్‌’ సినిమాతో క్లాస్‌ ఆడియన్స్‌కి బాగా దగ్గరైన శర్వానంద్‌ ఈసారి కూడా వాళ్లే తన సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నాడు. కాకపోతే ‘రన్‌ రాజా రన్‌’ వచ్చినపుడు చాలా రోజుల పాటు పెద్ద చిత్రాలేవీ విడుదల కాలేదు. కానీ ఈసారి మాత్రం తదుపరి వారంలోనే ‘టెంపర్‌’ వస్తుంది. ఈ పరీక్షలో ‘మళ్ళీ’ గెలుస్తాడనే అనుకుందాం.